Illu Illalu Pillalu Today Episode june 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి ఇంట్లో భోజనాల సంగతి చూసుకుంటూ అన్ని అయిపోయాయి. ఇక అన్నం ఒకటి చేస్తే సరిపోతుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది.. అప్పుడే తన చెల్లెలు బుజ్జి ఇంటికి వస్తుంది. సడన్ గా ఇక్కడికి వచ్చావు అంటే ఇది మా అక్క ఇల్లు నేను రాకుండా ఉంటే బాగోదు కదా.. నా అక్క ఇంటికి నేను రావడానికి పర్మిషన్ తీసుకోవాలి ఏంటి అని అంటుంది.. నీకు ఏం కావాలో చెప్పు నేను చేసి పెడతానని అంటుంది శ్రీ వల్లి.. చందు ఆఫీస్ కు సేటు వెళ్లి వెంటనే 10 లక్షలు కావాలని అడుగుతాడు. కానీ చందు మాత్రం నాకు ఇస్తానన్న వాళ్ళ ఇంకా ఇవ్వలేదు సేటు నాకు ఒక నెల టైం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తాడు. ఇదంతా కాదు నేను రామరాజు దగ్గరే అన్ని తేల్చుకుంటానని సేటు అంటాడు. ఇక శ్రీవల్లి హనీమూన్ గురించి తన చెల్లి హింట్ ఇస్తుంది. చందు ఇంటికి రాగానే వల్లి పై అరుస్తాడు.. చందు చెప్పనివ్వకుండా హనీమూన్ సంగతి చెప్తుంది. నీది నికే నేను చెప్పేది కాస్త పట్టించుకోవా.. సేటు గురించి చెప్తాడు. వల్లి టెన్షన్ పడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్త .. సేటు ఎలాగైనా నెల రోజుల్లో 10 లక్షలు ఇవ్వకుంటే మాత్రం ఇంట్లో చెప్పేస్తాడంట ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో నాకన్నా నువ్వే అర్థం చేసుకో అనేసి అంటాడు. ఆ మాట వినగానే షాక్ అయిన శ్రీవల్లి బయటకు వెళ్లి ఏడుస్తూ ఉంటుంది. బుజ్జి అక్కడికి వచ్చి అక్క మీ హనీమూన్ కి వెళ్తున్నారా అని అడుగుతుంది. శ్రీవల్లి ఏడవడం చూసి పది లక్షల గురించి అయినా అడిగాడు అమ్మ మాత్రం ఏమీ చెప్పదు అని టెన్షన్ పడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది..
భాగ్యం డబ్బులు ఇవ్వకుండా ఏదోకటి మ్యానేజ్ చెయ్యాలి.. ఇలా కన్నీళ్లు పెట్టుకుంటావా.. నా కొడుకుని ఎలా పుట్టావే నువ్వు అంటూ అరుస్తుంది. శ్రీవల్లి మాత్రం ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటుంది. చెల్లెలు బుజ్జి నేర్చుకుంటూ అక్క దగ్గరికి వెళ్తుంది. అక్క మీ తోడికోడలు ఇద్దరికి 10 లక్షలు మేటర్ తెలిసిపోయింది అక్క.. మీ అక్క ఎందుకు 10 లక్షల గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతుంది అని అడిగారు.. బలవంతంగా నా చేత నిజం చెప్పించాలని చూశారు నేను చెప్పలేదు అక్క అని అంటుంది.. నువ్వు నిజం చెప్పలేదు కదా అమ్మయ్య బతికించావు అని శ్రీవల్లి అనుకుంటుంది.
అప్పుడే అక్కడికి వచ్చిన ప్రేమ నర్మదా నువ్వు ఏదో టెన్షన్ పడుతున్నావ్ కదా అక్క అదేంటో తెలుసుకుందామని అడిగాము. అంతే తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు అని నర్మదా అంటుంది.. అయినా నా మేటర్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి మీరెవరు అని గొడవకు దిగుతుంది శ్రీవల్లి. ఇక ముగ్గురు అక్క చెల్లెలు కలిసి 10 లక్షల మేటర్ ఏంటో తెలుసుకోవాలని గొడవ పడతారు.. అప్పుడే అక్కడికి వచ్చిన వేదవతి ఏంటి మీరు ముగ్గురు అక్కచెల్లెలా ఉంటారు అనుకుంటే ఇలా గొడవ పడుతున్నారు ఏంటి అని అరుస్తుంది.
గొడవేం లేదు అత్తయ్య అక్క ఎదో పది లక్షల మేటర్ గురించి టెన్షన్ పడుతుంటే కనుక్కుంటున్నాము అని అంటుంది. 10 లక్షలు ఏంటి అంటే? అదేం లేదు అత్తయ్య వీళ్ళు కావాలని ఏదో అంటున్నారు అని వేదవతితో శ్రీవల్లి అంటుంది.. మీరు ఏరి కోరి తెచ్చుకున్న మీ పెద్ద కోడలే మీకు ఇష్టంలే మేము ఏం చెప్పినా అది అబద్దం అవుతుంది అక్క వెళ్ళిపోతున్నావా ఆ పది లక్షలు మేటర్ ఏంటో నేను తెలుసుకోకుండా అస్సలు వదిలిపెట్టనని నర్మదా అంటుంది.
బెడ్ రూమ్ లోకి వెళ్లిన శ్రీవల్లిని ఫోన్ మాట్లాడడానికి ఇంత టైం పడుతుందా..? మీ అమ్మ ఏం చెప్పిందని టెన్షన్ పడుతూ అడుగుతాడు చందు. దానికి శ్రీవల్లి నర్మదాప్రేమ నామీద లేనిపోనివి అత్తయ్య గారికి చెప్తున్నారు. నేనంటే కొంచెం కూడా భయం లేకుండా నాతో గొడవ పడుతున్నారని చెప్పి కావాలనే కన్నీళ్లు పెట్టుకున్నట్లు నాటకమాడుతుంది. ఇక మొత్తానికి 10 లక్షల మేటర్ ని చందు దగ్గర నుంచి డైవర్ట్ అయ్యేలా శ్రీవల్లి డ్రామాను మొదలు పెడుతుంది..
ఇక తర్వాత ధీరజ్ కోసం ప్రేమ ఎదురు చూస్తూ ఉంటుంది. నర్మద అక్కడికి వెళ్లి ఏంటి ప్రేమ ఈ మధ్య నువ్వు ప్రేమలో పడినట్టు ఉన్నావు కదా అనేసి అడుగుతుంది. అదేంటి అక్క అలా అన్నావు అని అంటుంది ప్రేమ. ఏం లేదు ఈ మధ్య నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు ధీరజ్ కోసం ఎదురు చూస్తున్నావు అంతా ఏదో కొత్త కొత్తగా ఉంది అని అంటుంది.. నర్మద మాట విన్న ప్రేమ సిగ్గుపడుతూ లోపలికి వెళుతుంది. అప్పుడే ధీరజ్ ఇంటికి వస్తాడు ప్రేమ ధీరజ్ కి ప్రేమగా వడ్డిస్తుంది. ఇదంతా చూస్తున్న నర్మదా నువ్వు కచ్చితంగా ధీరజ్ని ప్రేమిస్తున్నామని కన్ఫామ్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..