PBKS vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… ఫైనల్ కు దూసుకు వెళ్ళింది పంజాబ్ కింగ్స్. క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు షాక్ ఇచ్చి నేరుగా ఫైనల్ కు దూసుకెళ్లింది శ్రేయస్ అయ్యర్ సేన. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిన్న జరిగింది. అయితే ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 203 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని ఒక ఓవర్ మిగిలి ఉండగానే పంజాబ్ కింగ్స్ చేదించగలిగింది. శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్ తో రాణించడం.. మిగతా ప్లేయర్లు కూడా దుమ్ము లేపడంతో 19 ఓవర్లలోనే 5 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేదించింది పంజాబ్. ఈ నేపథ్యంలోనే 11 సంవత్సరాల తర్వాత… ఫైనల్ కు దూసుకు వెళ్ళింది పంజాబ్ కింగ్స్.
Also Read: Priyansh Arya football: వాళ్ళు తన్నడం, వీడు తన్నించుకోవడం…అందరూ సరిపోయారు.. పిల్ల బచ్చాను చేసి
ఫైనల్స్ కు పంజాబ్ కింగ్స్.. జగన్ డైలాగ్ వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ ఫైనల్ కు చేరిన తరుణంలో… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి డైలాగ్ వైరల్ గా మారింది. మీరు కొట్టారు… మేం తీసుకున్నాం… మాకు టైం వస్తుంది.. మేము కొడతాం.. అనే డైలాగ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 2019 కంటే ముందు చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్లుగానే ఏపీలో 2019 సంవత్సరంలో.. వైసిపి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్… అదే డైలాగ్… వాడుకొని సక్సెస్ అయ్యాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
బెంగళూరు చేతిలో దారుణ ఓటమి.. మళ్లీ ఫైనల్ కు పంజాబ్
క్వాలిఫైయర్ మొదటి మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో దారుణంగా ఓడిపోయింది పంజాబ్ కింగ్స్. శ్రేయస్ అయ్యర్ ఒక్కడు ఆడక పోవడంతో మిగతా ప్లేయర్లు అందరూ చేతులెత్తేశారు. అయితే ఈ మ్యాచ్ అనంతరం… శ్రేయస్ అయ్యర్ కీలక ప్రకటన చేశాడు. మేము క్వాలిఫైయర్ మాత్రమే ఓడిపోయాం… యుద్ధం ఓడిపోలేదు.. అంటూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు శ్రేయస్ అయ్యర్. ఇక.. మొన్నటి క్వాలిఫైయర్ మొదటి మ్యాచ్ సందర్భంగా శ్రేయస్ అయ్యర్ చెప్పినట్లుగానే… ఇప్పుడు జరిగింది. రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టును ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసి… ఫైనల్ కు దూసుకు వెళ్లింది పంజాబ్ కింగ్స్. దీంతో జూన్ మూడవ తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో పంజాబ్ కింగ్స్ ఫైనల్ ఆడనుంది. అప్పట్లో జగన్… ఇలాగే సక్సెస్ అయ్యాడని… ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ చెప్పి మరి కొట్టాడని… సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియోను వైరల్ చేస్తున్నారు.
?igsh=MW52ajY1ZW5sZDFzMQ==