Preity Zinta: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పంజాబ్ కింగ్స్ జట్టు పైన ఏకంగా ఆరు పరుగులతో విజయం సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు… మొదటిసారి ఛాంపియన్గా నిలిచింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని ఉంటాయి. అటు విరాట్ కోహ్లీ కూడా గ్రౌండ్లో సంబరాలు చేసుకుంటూ సందడి చేశారు. ఒకానొక సమయంలో విరాట్ కోహ్లీ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.
ALSO READ: Anushka Sharma-Virat Kohli: 18 ఏళ్ళ తర్వాత కప్.. అనుష్కకు టైట్ హాగ్ ఇచ్చి.. ఏడ్చేసిన కోహ్లీ
నిరాశలో ప్రీతి జింటా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… ఫైనల్లో పంజాబ్ కింగ్స్ దగ్గర దాకా వచ్చి ఓడిపోయింది. చివర్లో శశాంక్ సింగ్ ఎంత పోరాడినా కూడా… మ్యాచ్ మాత్రం గెలిపించలేకపోయాడు. ఆస్కింగ్ రేట్ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో… పంజాబ్ కింగ్స్ ఓడిపోవడం జరిగింది. అయితే పంజాబ్ కింగ్స్ ఓటమి తర్వాత… 18 సంవత్సరాలుగా టైటిల్ కోసం చూస్తున్న ప్రీతి జింటా కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు. గెలుస్తుంది అన్న మ్యాచ్లో చివరికి ఓడిపోయేసరికి… ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయినప్పటికీ తమ జట్టు ప్లేయర్లను…. కలుస్తూ వాళ్లను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పోతేనేం నెక్స్ట్ ఇయర్ చూసుకుందాంలే అన్న రేంజ్ లో… ప్రీతి జింటా రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రీతి జింటా రియాక్షన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కన్నీళ్లు పెట్టుకున్న శశాంక్ సింగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… జరిగిన ఫైనల్ మ్యాచ్లో వీరోచిత పోరాటం చేశాడు పంజాబ్ కింగ్స్ ఆటగాడు శశాంక్ సింగ్. ద బెస్ట్ ఫీచర్ గా గుర్తింపు తెచ్చుకున్న శశాంక్ సింగ్.. తనకు ఎవరు సపోర్ట్ చేయకపోవడంతో… పోరాడి ఓడిపోయాడు. బెంగళూరు పైన ఫైనల్ మ్యాచ్లో 30 బంతుల్లోనే 61 పరుగులు చేసి రప్పాడించాడు. ఇందులో ఆరు సిక్సర్లు అలాగే మూడు బౌండరీలు ఉన్నాయి. ఏకంగా 203 స్ట్రైక్ రేట్ తో దుమ్ము లేపాడు శశాంక్ సింగ్. అయితే మ్యాచ్ ఓడిపోయిన తర్వాత శశాంక్ సింగ్ చేసేది ఏమీ లేక కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన చేతులను అడ్డం పెట్టుకొని ఏడ్చేశాడు. దీంతో పంజాబ్ కింగ్స్ ఆటగాడు శశాంక్ సింగ్.. వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ గెలుచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ( RCB TeaM )భారీ ప్రైజ్ మనీ వచ్చింది. ఈ మ్యాచ్ లో గెలిచినందుకుగాను… ఏకంగా 20 కోట్లు గెలుచుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అలాగే… ఫైనల్ లో ఓడిపోయిన పంజాబ్ కింగ్స్ కు 12.5 కోట్లు దక్కాయి.
ALSO READ: RCB Maiden IPL Trophy: 18 ఏళ్ల నిరీక్షణ… ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా RCB… ప్రైజ్ మనీ ఎంతంటే
#PreityZinta has tears in her eyes, as expected. She's heartbroken again. I saw similar visuals in 2014. 💔#RCBvPBKS #IPL #IPL18 #IPL2025 #TATAIPL #Ahmedabad #Final pic.twitter.com/mSG9e1gdKJ
— Tejan Shrivastava (@BeingTeJan) June 3, 2025
Mad respect for Shashank Singh 🫡
Fought like a true warrior till the very end.One man army. Standout of the night. 👏🔥#ShashankSingh #RCBvsPBKS #ViratKohli𓃵 #IPLFinals pic.twitter.com/Aul2AkybHc
— J.N. SINGH 🇮🇳 (@JnSinghSir) June 4, 2025