BigTV English

Illu Illalu Pillalu Today Episode: జాబ్ లో జాయిన్ అయిన ధీరజ్.. భాగ్యం ప్లాన్ లో ఇరుక్కున్న రామరాజు.

Illu Illalu Pillalu Today Episode: జాబ్ లో జాయిన్ అయిన ధీరజ్.. భాగ్యం ప్లాన్ లో ఇరుక్కున్న రామరాజు.

Illu Illalu Pillalu Today Episode March 15th : నిన్నటి ఎపిసోడ్ లో.. రాత్రి అయిన తర్వాత భద్రా సేన ఇద్దరు ఇంటి బయట ఉంటారు.. ప్రేమ రాగని రామరాజు కుటుంబాన్ని గట్టిగా అరిచి పిలుస్తారు. నా మేనకోడలు ఎక్కడి నుంచి వస్తుందో అడిగి తెలుసుకోగానే బుజ్జమ్మ ఎక్కడి నుంచి వస్తున్నావ్ అమ్మ అంటే కాఫీ షాప్ లో వెయిటర్ గా పని చేస్తున్నాను అత్తయ్య అంటుంది. అపురూపంగా పెంచుకున్న నా కోడల్ని మీరు ఇలా ఎంగిలికప్పులెత్తించేలా చేశారు.. ఇదంతా నువ్వు చేసింది రామ రాజు అని భద్ర సీరియస్ అవుతుంది.  నిన్ను అమెరికాలో ఉంటున్న వాళ్లకి ఇచ్చి ఎంతో గొప్పగా చూసుకోవాలని అనుకున్నాను కానీ నువ్వు ఇలా ఎంగిలికప్పులెత్తేలాగా పనిచేస్తావని అస్సలు అనుకోలేదని ప్రేమ వాళ్ళ నాన్న బాధపడతాడు. ఇంత బతుకు బతికి ఈ చేతకాని వాడిని పెళ్లి చేసుకొని నువ్విలా బతకడం మాకు అస్సలు ఇష్టం లేదు అని భద్ర అంటుంది.. ప్రేమ మాత్రం నేను జాబ్ చేయాల్సిందే ఖచ్చితంగా జాబ్ చేసి నా ఆత్మ అభిమానాన్ని కాపాడుకోవాలి అని అంటుంది. రామరాజు మాత్రం నువ్వు జాబ్ చేయడానికి వీలు లేదు నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నీ భర్తగా వాడు అన్ని బాధ్యతలు తీసుకొని చేయాలి అని అంటాడు. కానీ ప్రేమ మాత్రం రామరాజును ఎదిరించడంతో ధీరజ్ మా నాన్నకి ఎదురు చెప్తావని సీరియస్ అవుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ధీరజ్ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రేమతో నువ్వు జాబ్ చేయొద్దు నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను జాబ్ చేసి నిన్ను పోషించుకోవాలి మా నాన్న అన్నదే నిజం కదా నేను నిన్ను పోషించే ధైర్యం దమ్ము ఉన్న వాళ్ళని కచ్చితంగా నేను నిన్ను పోషిస్తాను నువ్వు జాబ్ మానేసి అంటాడు. అని ప్రేమ మాత్రం నేను మా ఇంట్లో ఎలా పెరిగాను నా ఆత్మ అభిమానాన్ని చంపుకొని నేను ఇలా తినలేను నువ్వు తింటావేమో గాని అని అంటుంది. నువ్వు జాబ్ చేయొద్దు నేను జాబ్ చేసి నిన్ను పోషించుకుంటాను ఈరోజు గనక జాబ్ రాకపోతే కచ్చితంగా నువ్వు వెళ్లి మళ్లీ నీ జాబ్లో జాయిన్ అవ్వచ్చు అని ధీరజ్ అంటాడు.

నువ్వు జాబ్ చేసి ఇప్పటికే మా నాన్న పరువు తీసావు ఇకమీదట నువ్వు జాబ్ చేయడానికి వీలు లేదు ఈరోజు గనక నేను జాబ్ తెచ్చుకోకపోతే ఇష్టం వచ్చిన చేసుకోపో అని ధీరజ్ ప్రేమను హెచ్చరిస్తాడు. ఇక ధీరజ్ జాబ్ కోసం కొన్ని షాపుల వెంట తిరుగుతాడు. చివరికి వాటర్ క్యాన్లు వేసే జాబ్లో జాయిన్ అవుతాడు. బుజ్జమ్మ ఎంత మాట్లాడాలని ట్రై చేసిన కూడా ధీరజ్ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. పోషించుకోవడానికి ధీరజ్ కష్టపడి నీళ్లు మోస్తుంటాడు.


అటు ప్రేమతో తన అన్నయ్య మనసు మార్చే ప్రయత్నం చేసేలా మాట్లాడుతారు.. ఇంట్లో నిన్ను ఎంత అపురూపంగా చూసుకున్నామో నీకు తెలుసా? కాలు కింద పెడితే ఎక్కడ కందిపోతామని అటు అత్త నాన్న అందరూ కలిసి నిన్ను చాలా గౌరవంగా అపురూపంగా పెంచుకున్నారు. కానీ నువ్వు కేవలం డబ్బు కోసం నగలు కోసం వారిని పెళ్లి చేసుకొని ఇప్పుడు ఇబ్బంది పడుతున్నావు.. కనీసం నువ్వు కడుపునిండా భోజనం అయిన చేస్తున్నావా ఇంట్లో అని ప్రేమ వాళ్ళ అన్నయ్య ప్రేమను అడుగుతాడు.

అయితే ప్రేమ మాత్రం తన ఇంట్లో విషయాల గురించి ఇతను అన్నయ్యకు చెప్పదు తను సంతోషంగా ఉన్నానని చెప్తుంది.. అటు భాగ్యం శ్రీవల్లి పెళ్లిని ఎలాగైనా రామరాజు చేతనే చేయించాలి అని అనుకుంటుంది. గుడిలో లగ్న పత్రిక రాయించడానికి రామరాజు ఫ్యామిలీ అటు భాగ్యం ఫ్యామిలీ ఇద్దరు గుళ్లోకి వస్తారు. ఇక శ్రీవల్లి లాంటి మంచి అమ్మాయి మనకెందుకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని రామరాజు అంటారు. ఇక భాగ్యం పెళ్లి అంతా వాళ్ళే చేసేలా ప్లాన్ చేస్తుంది.

ఏంటి సంప్రదాయం ప్రకారం నిశ్చితార్థం పెళ్లి అమ్మాయి వాళ్ళు చేయించాలని రామరాజు అంటాడు. కానీ భాగ్యం మాత్రం మా ఇంటి సాంప్రదాయం ప్రకారం మేము నిశ్చితార్థం మాత్రమే చేస్తాం ఆ తర్వాత పెళ్లి అబ్బాయి వాళ్ళు చేయాలని అంటుంది. కానీ రామరాజు బుజ్జమ్మ ఆలోచనలో పడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో భద్ర భాగ్యంతో మాట్లాడి పెళ్లిని చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో సోమవారం ఎపిసోడ్ లో చూడాలి..

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×