Tirumala Parakamani: కోట్లాది మంది భక్తుల విశ్వాసం.. వందల కోట్ల రూపాయల భక్తుల కానుకలు.. ప్రపంచ నలు మూలల నుంచి వచ్చే భక్తులు.. వెరసి ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం. ఇంతటి మహా పుణ్య క్షేత్రం, కలియుగ వైకుంఠంలో.. వరుస అక్రమాలు, అపచారాలు, దొంగతనాలు వెలుగు చూస్తున్నాయి. దొంగతనం చేసిన వ్యక్తితో రాజీ కుదుర్చుకోవడం ఎక్కడైనా చూశామా? కానీ తిరుమల పరకామణి చోరీ కేసులో చూస్తున్నాం.. పరకామణిలో చోరీకి పాల్పడి వందల కోట్ల రూపాయలు వెనకేసుకున్న రవికూమార్ కేసు విషయంలో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
కొందరు TTD అధికారులు, నాయకులు..
కొందరు TTD అధికారులు, నాయకులు అతని అస్తులు రాయించుకోని కేసు నీరుగార్చి.. లోకాయుక్తలో కేసును రాజీ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఆ కేసు తిరిగి విచారించి అసలు దొంగలను బయటపెట్టాలని ఎంతోకాలంగా పోరాటం చేస్తున్న TTD పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి పోరాటం ఫలిస్తుందా..? కూటమి ప్రభుత్వం పట్టించుకుంటుందా..? అధికారులు కావాలనే ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా..? లాంటి ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి.
2023 ఏప్రిల్ 29న పెద్ద జియ్యంగారి మఠం ఉద్యోగి రవికూమార్..
2023 ఏప్రిల్ 29న పెద్ద జియ్యంగారి మఠం ఉద్యోగి రవికూమార్ పరకామణి సేవకు ఎప్పటి లాగే హాజరయ్యారు. లెక్కింపు పూర్తియిన తర్వాత చంద్ర అనే ఉద్యోగి అక్కడున్న AVSO సతీష్‌కు ఫిర్యాదు చేశారు. కాగా.. రవికూమార్‌ను తనిఖీ చేయగా లో దుస్తుల్లో దాచి తీసుకపోతున్న అమెరికన్ డాలర్లు బయటపడ్డాయి. 30 ఏళ్లుగా రెగుల్యర్‌గా పరకామణి సేవకు రవికుమార్ హాజరవుతున్నారు. దీనిపై విజిలెన్స్ విచారణ అనంతరం తిరుమల టుటౌన్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, అనూహ్యంగా.. నెల రోజుల తర్వాత సతీష్, రవికూమార్‌లు లోకాయిక్తాలో రాజీ అయ్యారు. దొంగతనం కేసులో ఈవిధంగా రాజీ పడటం అనేది ఇప్పటి వరకు ఏ న్యాయ చరిత్ర రికార్డుల్లోనూ నమోదు కాలేదు. దీని వెనుక ఏదో మతలబు ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
చెన్నై, మహాబలిపురంతో పాటు తిరుపతిలోని అపార్ట్‌మెంట్‌లో 13 ఫ్లాట్లు..
రవికూమార్‌కు చెందిన అస్తులను TTD పేరుతో కొన్ని రిజిష్టర్లలో నమోదు చేశారు. చెన్నై, మహాబలిపురంతో పాటు తిరుపతిలోని ఓకే అపార్ట్‌మెంట్‌లోని 13 ఫ్లాట్లు. మరో అపార్ట్‌మెంట్ లోని ఒక ఫ్లాట్ TTD మీద రిజిష్టర్ చేశారు. అతనికి సంబంధించిన మరిన్ని అస్తులను అప్పట్లో ఉన్న పాలక మండలి సభ్యులతో పాటు.. అప్పటి జిల్లా ఉన్నతాధికారులు, TTDలోని ఉన్నతాధికారులు బలవంతంగా అమ్మించి నగదును తీసుకున్నారని ప్రచారం జరిగింది. మొత్తం వ్యవహారంపై వివాదం చెలరేగింది. TTD విజిలెన్స్ నివేదికలో సైతం అప్పటి వింగ్ VGOగా ఉన్న గిరిధర్ రావు సైతం ఒత్తిడి వల్ల కేసును లోకాయిక్తాలో రాజీ చేసినట్లు తన నివేదికలో పేర్కోన్నారు.
TTD పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి న్యాయ పోరాటం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు మునుపు కూడా ఈ ఇష్యూపై TTD పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి పోరాటం చేస్తున్నారు. అయిన అనేక నివేదికలను బయటపెట్టారు. దొంగతో రాజీ కావడం ఎక్కడైనా జరిగిందా..? అంటున్నారు. దీంతో పాటు సామాన్య ఉద్యోగి అయిన రవి కూమార్ కోట్లాది రూపాయల విలువైన అస్తులను ఏలా సంపాదించాడు..? ఎన్నేళ్ల నుంచి అతను పరకామణిలో చోరీకి పాల్పడుతున్నాడు? బలవంతంగా రాజీ చేయించి లబ్ధి పొందింది ఎవరు? అన్న కోణంలో విచారణ జరగాలని అయన డిమాండ్ చేస్తున్నారు.
Also Read: మాకెందుకు!!చీపురుపల్లిని గాలికి వదిలేసిన మాజీలు
అయితే లోకాయిక్తలో ఓ సారి రాజీ అయిన కేసును తిరిగి రీ ఓపెన్ చేయడానికి వీలు కాదని అంటున్నారట పోలీసులు. మరో నూతన కేసు ఎందుకు పెట్టకూడదంటున్నారు. దీంతో పాటు CC పుటేజ్‌ను ధ్వంసం చేసింది ఎవరు? చేయించింది ఎవరు? అనే కోణంలో TTD అధికారులు విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు భాను ప్రకాష్. మరో వైపు ఈ కేసు రీ ఓపెన్ అయితే పెద్ద తలల వ్యవహారం బయటపడుతుందని అంటున్నారు.
కేసు రీ ఓపెన్ అయితే పెద్ద తలలు బయటకొస్తాయని ప్రచారం
మొత్తం వ్యవహారంలో అప్పటి పాలకుల పట్ల ప్రస్తుత కూటమి ప్రభుత్వం కావాలనే సాఫ్ట్ కార్నర్‌లో వ్యవహిస్తోందా..? పాలక మండలి సమావేశంలో ఈ కేసు విషయం ఎందుకు ప్రస్తావించడం లేదు? ఎందుకు చర్చ జరగడం లేదు? దీనిపై చర్యలు ఎందుకు తీసుకోలేరనే ప్రశ్నలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. చెన్నై TTD ఆలయంలో ఫారిన్ కరెన్సీ చోరీకి పాల్పడ్డ ఉద్యోగిని సస్పెండ్ చేసిన తర్వాత 15 రోజులకు కేసు పెట్టారు. అంటే గత ప్రభుత్వానికి TTDలో వెన్నెముకగా పనిచేసిన అధికారుల పెత్తనం TTDలో ఇంకా కొనసాగుతోందా? గత పాలక మండలిలో దందాలు చేసిన వ్యక్తి ప్రస్తుతం సలహాదారుగా ఉన్నాడంటున్నారనే ఆరోపణు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా పరకామణి కేసులో రవికూమార్ ఇష్యూపై పాలక మండలి సమగ్ర సమాచారం భక్తులకు తెలపాల్సిన అవసరం ఉంది. లేదంటే గత పాలక మండలికి ప్రస్తుత పాలక మండలిి తేడా ఏముండదని భావించాల్సి వస్తుంది.