Illu Illalu Pillalu Today Episode may 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ పార్ట్ టైం జాబ్ ఇంట్లో నుంచి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. నర్మదగూడా ప్రేమ ఏం జాబ్ చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తుంది. ఇద్దరు మధ్యలో వాళ్ళ అత్త వేదవ తెచ్చి కూర్చుని తల పండిన నన్ను అడిగితే నేను ఐడియాలు చెప్తాను కదా అని అంటుంది.. ముగ్గురు కలిసి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే వీళ్ళ ముగ్గురిని చూసిన శ్రీవల్లి అక్కడికి వచ్చి అత్తగారండి నాకు డబ్బులు ఇవ్వండి నేను వెళ్ళిపోతాను మా ఇంటికి అని అడుగుతుంది. అయ్యో ఏమైందమ్మా ఎందుకలా అడుగుతున్నామని వేదవతి అంటుంది. ముగ్గురు కలిసి నన్ను వేరు చేస్తున్న అత్తగారండి నాకు ఒక 20 రూపాయలు ఇస్తే నేను ఆటో ఎక్కి మా ఇంటికి వెళ్ళిపోతాను అని అంటుంది. ప్రేమ ఇంట్లో కూర్చొని ఏ జాబ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాంటి జాబ్ చేస్తే బాగుంటుందో అని ఆలోచిస్తున్నామని అంటుంది అయితే నేను మీ దగ్గరికి రానా అని మెరుపుతీగ లాగా వాళ్ళు మధ్యలో కూర్చుంటుంది.. శ్రీవల్లి తనకు తోచిన ఐడియా లని చెప్తుంది చివరికి పిల్లలకి ట్యూషన్ చెప్పడం ఐడియా బాగుంటుంది అందరూ దానికి ఓకే చెప్తారు.. నా పెద్ద కోడలు ఎంతైనా బంగారం మంచి ఐడియా ఇచ్చిందని వేదవతి పొగిడేస్తుంది.. నర్మదా కుళ్ళుకుంటుంది. కుటుంబానికి చందును దూరం చేయబోతుంది శ్రీవల్లి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నర్మదా ట్రైనింగ్ కోసమని హైదరాబాద్ కి సాగర్ తో కలిసి వెళుతుంది. ఇక ధీరజ్ ఎలాగైనా సరే వచ్చే నెల నుంచి వాళ్ళ నాన్నకి పదివేలు ఇవ్వాలని పార్ట్ టైం జాబ్ చేస్తాడు. ఫుడ్ ని డెలివరీ చేస్తూ ఉంటాడు. అయితే ఒక కస్టమర్ మాత్రం అడ్రస్ చెప్పడానికి విసుక్కుంటాడు. నేను ఆల్రెడీ అడ్రస్ కరెక్ట్ గా చెప్పాను కరెక్ట్ గా పెట్టాను నువ్వు అలానే రా అనేసి ఫోన్ పెట్టేస్తాడు. చివరికి ఎలాగోలా ఆ డ్రెస్ ని కనుక్కొని ధీరజ్ అక్కడికి వెళ్ళగానే ఆ కస్టమర్ నేను ఏ టైం కి నీకు ఆర్డర్ పెట్టాను నువ్వు ఏ టైం కి డెలివరీ చేస్తున్నావు అని సీరియస్ అవుతాడు..
ఇంట్లో గొడవలు పడి డబ్బులు ఇవ్వడం ఆపేస్తే ఇలా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ బతుకుతున్నారు మీకు ఎంత పొగరు.. నువ్వు ఇంత లేటుగా తీసుకొచ్చినందుకు నీకు జీరో రేటింగ్ ఇచ్చి కంప్లైంట్ చేస్తాను అని అంటాడు. అలా అయితే జాబ్ పోతుందని ధీరజ్ కస్టమర్ తో మర్యాదగా మాట్లాడే క్షమాపణ చెప్తాడు. కస్టమర్ అన్న మాటలు తలుచుకొని మా నాన్న చెప్పిన మాటలు నాకు ఇప్పుడు అవసరం అవుతున్నాయి ఆయన జీవితం గురించి ఎంతో నేర్పించాడు అని ధీరజ్ వాళ్ళ నాన్నని పొగిడేస్తాడు.
అటు ప్రేమ ట్యూషన్ పెట్టడానికి పిల్లల కోసం వాళ్ళ బాబాయ్ దగ్గరికి వచ్చి అడుగుతుంది. బాబాయ్ నీకు ఈ ఊర్లో చాలామంది తెలుసు కదా వాళ్లకి పిల్లలు ఉంటారు కదా నేను ట్యూషన్ చెప్పాలనుకుంటున్నాను నా గురించి చెప్పు బాబాయ్ అని అడుగుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ధీరజ్ ఇప్పుడు ట్యూషన్ చెప్పాల్సిన అవసరం ఏమి వచ్చింది నేను సంపాదిస్తున్నాను కదా అని అంటాడు. నువ్వు వచ్చే నెల నుంచి మీ నాన్నకు పదివేలు ఇవ్వాలని అనుకున్నావు.. అలాగే మన చదువులకు కూడా డిస్టబెన్స్ అవ్వకుండా నేను జాబ్ చేస్తే ఎంతో కొంత సాయం అవుతాను కదా అని ప్రేమ అంటుంది.
ధీరజ్ నీ ఆలోచన బాగానే ఉంది కానీ ఇంట్లో ఉన్న పెద్దరాయుడు పరిస్థితి ఏంటి అని అంటాడు.. మావయ్య గారికి చెప్పే రీతిలో చెప్తే అర్థమవుతుంది ఆయన నొప్పించే బాధ్యత నాది అని ప్రేమ అంటుంది. ఏది ఏమైనా సరే కానీ ఇంట్లో వాళ్లకు ఇష్యూ అవ్వకుండా చూసుకోవడం మంచిది అని సలహా ఇస్తాడు. అటు సాగర్ నర్మదలు రూమ్ ని చూసి సంతోషంగా ఫీల్ అవుతారు. నర్మద కాళ్లు పట్టడానికి సాగర్ రెడీ అవుతాడు. ఇద్దరి మధ్య రొమాంటిక్ టచ్ మొదలవుతుంది. సినిమా లెవెల్లో వీరిద్దరి మధ్య సీన్ జరుగుతుంది.
ఇక వేదవతి నర్మద లేదని దిగులు పెట్టుకొని బుంగమూతి పెట్టుకుని ఉంటుంది.. చూసిన ప్రేమ ఏంటత్తా అలా ఉన్నావు నర్మదక్క లేదని నువ్వు చాలా ఫీల్ అవుతున్నావా ఏంటి అని అడుగుతుంది. అక్క తో మాట్లాడుకున్న అస్సలు ఉండలేవని నాకు తెలుసు. అవునా సుమీ ఇంతకు ముందు నుంచి నాకు ఏదో మిస్ అయినట్లు ఫీలింగ్ వచ్చింది. నిజమేనేమో నర్మదతో మాట్లాడకుండా నేను ఉండలేనేమో అని వేదవతి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..