Minister Lokesh: ఏపీ మంత్రి నారా లోకేష్ హస్తిన కబుర్లు ఏంటి? ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం వెనుక అసలేం జరుగుతోంది? లిక్కర్ కేసులో తదుపరి అరెస్టుల గురించి లోకేష్ చెప్పే అవకాశం ఉందా? ఈ కేసులో కీలక నేతలు అరెస్టు కావడంతో మరో ఇద్దరు మాత్రమే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వారిని అరెస్టు చేస్తే ముగింపు దశకు వచ్చేయడం ఖాయమని టీడీపీ వర్గాల మాట.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. మంత్రి నారా లోకేష్ శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. గతంలో రెండు సందర్భాల్లో లోకేష్‌ను ఢిల్లీకి రమ్మని ఆహ్వానించారు ప్రధాని. ఈ క్రమంలో శుక్రవారం ప్రధాని మోదీతో అపాయింట్‌మెంట్ కోరారు. అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో హస్తినకు వెళ్లారు మంత్రి లోకేష్. శనివారం సాయంత్రం ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ సమావేశం కానున్నారు.
కీలక అరెస్టు తప్పదా?
సమయం, సందర్భం లేకుండా సడన్‌గా మంత్రి లోకేష్ ఢిల్లీ వెళ్లడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నాయి టీడీపీ వర్గాలు. లిక్కర్ కేసులో కీలక విషయాలు వెల్లడికావడంతో ప్రధాని మోదీతో వాటి గురించి మంత్రి లోకేష్ ప్రస్తావించే అవకాశం ఉంది. ఎందుకంటే లిక్కర్ కేసుల కీలకమైనవారిని అరెస్టు చేసింది సిట్. వారిని నుంచి కీలక సమాచారం రాబట్టింది.
అందులో ఇద్దరు అప్రూవర్‌గా మారినట్టు ఓ ఫీలర్ బయటకు వచ్చింది. రేపో మాపో కీలక వ్యక్తి అరెస్టు అవుతారని అంటున్నారు. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసు గురించి ప్రధాని మోదీతో లోకేష్ చర్చించే అవకాశముందని అంటున్నాయి పార్టీ వర్గాలు. ప్రధాని ఇచ్చిన సలహా మేరకు ఈ కేసు తదుపరి అడుగులు పడే అవకాశముందన్నది తెలుగు తమ్ముళ్ల మాట.
ALSO READ: వంశీకి ఎన్ని కష్టాలో.. ఒక కేసులో బెయిల్, మరో కేసులో రిమాండ్
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉంది. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌కు టీడీపీ కీలకంగా మారింది. ఈ మధ్య అమరావతి రీలాంఛ్ కోసం ప్రధాని మోడీ ఏపీకి వచ్చారు. ఆ సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్రమోదీ మధ్య కొన్ని అంశాలపై కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
వేగంగా మారుతున్న పరిణామాలు
ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ హస్తినకు వెళ్తున్నారని అంటున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. రిటైర్డ్ IAS అధికారి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ OSD కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ అధికారులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. గడిచిన మూడు రోజులుగా వీరిని గంటల తరబడి విచారించారు అధికారులు. అయితే వీరి ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించడంతో గతరాత్రి అరెస్ట్ చేశారు.