Illu Illalu Pillalu Today Episode may 21st: నిన్నటి ఎపిసోడ్ లో.. రైస్ మిల్లుకి భోజనం తీసుకుని వెళ్లిన శ్రీవల్లిని చూసి.. ఇంత ఎండలో ఎందుకొచ్చావ్ అమ్మా.. నేను ఇంటికి వచ్చేవాడ్ని కదా అని అంటాడు రామరాజు. మీరు భలే ఉన్నారు మామయ్య గారూ.. మీకు భోజనం తేవడానికి ఇవన్నీ ఆలోచిస్తామా?? పైగా మీకు రైస్ మిల్లులో ఎక్కువ పని ఉంది కదా.. భోజనం ఇక్కడికే తీసుకుని ఆ సమయం కలిసి వస్తుంది కదా’ అని అంటుంది శ్రీవల్లి. హా నిజమే అన్నట్టుగా తెగ పొంగిపోతాడు రామరాజు. ఆ తరువాత మామతో పాటు తిరుపతికి భోజనం వడ్డిస్తుంది శ్రీవల్లి. భాగ్యం కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్తుంది. ఏమైందే బాబు ఎందుకు అట్లా నామీద అరుస్తున్నావని అడుగుతుంది. ప్రేమ ట్యూషన్ చెప్పడానికని పిల్లల్ని తీసుకునింది. వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పమని నన్ను అడిగింది. నేను ఎలాగోలా తప్పించుకుని వచ్చేసాను అని అంటుంది.. శ్రీవల్లి రామారాజు దగ్గరకు వెళ్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. వేదవతి ఎంత చెప్పినా కూడా వినకుండా రామరాజుకి భోజనం తీసుకుని వెళ్తుంది శ్రీవల్లి. దాంతో వేదవతి.. ‘ఎందుకు ఈ అమ్మాయి చెప్తున్నా వినపించుకోవడం లేదు.. ప్రతి విషయంలోనూ కాస్త ఎక్కువగానే జోక్యం చేసుకుంటుంది. ఈ ఇంట్లో అడుగుపెట్టి కొన్ని రోజులు కూడా కాలేదు. కానీ ఇంటి పద్దతుల్ని మార్చేయాలని ఎందుకు తాపత్రయ పడుతుంది అంటూ ఆలోచనలో పడుతుంది వేదవతి.. మిల్లుకు వచ్చిన వల్లిని చూసి రామారాజు షాక్ అవుతాడు.. ఇంత ఎండలో ఇక్కడికి ఎందుకు వచ్చావు మేము వస్తాము కదా అని అంటాడు.. మరేం పర్లేదు మామయ్య గారు మీకోసమే కదా తీసుకొచ్చింది అని శ్రీవల్లి అంటుంది.
ఇక భోజనం చేసిన తర్వాత చేతులు కడిగే దానికి రామరాజుకు నీళ్లు ఇస్తుంది. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మావయ్య గారు అని శ్రీవల్లి అడుగుతుంది. వీళ్ళిద్దరి మాట్లాడుకోవడం తిరుపతి వింటాడు. మావయ్య గారండీ ఇంట్లో ప్రేమ ట్యూషన్స్ స్టార్ట్ చేసింది. రామరాజు గారి కోడలు డబ్బుల కోసం ట్యూషన్ చెప్తుందా అని నలుగురు నాన్న మాటలు అనుకుంటారు. కొందరేమో రామరాజే తన కోడలు చేత డబ్బుల కోసం ఇలాంటి పని చేస్తున్నారని అనుకుంటారు. ఈ విషయం గురించి మీరు ఆలోచించండి మావయ్య గారు అని పుల్ల పెట్టేస్తుంది.
అటు నర్మదా సాగర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సాగర్ మాత్రం డబ్బుల కోసం అని షాపులన్నీ తిరుగుతూ ఉంటాడు. సాగర్ కి ఫోన్ చేసి ఇంకా రాలేదు ఏంటి నువ్వు అలాగే తిరుగుతూ ఉంటావా ఏంటి అని అడుగుతుంది. పది నిమిషాలు అని చెప్పి గంటలు గంటలు నర్మదను వెయిట్ చేస్తాడు. సాగర్ ఇంకా వస్తాడని నర్మదా వెయిట్ చేస్తూనే ఉంటుంది. మళ్లీ మళ్లీ ఫోన్ చేసి సాగర్ ని అడుగుతుంది వస్తున్నాను ఒక పది నిమిషాలు అంటూ దాటేస్తాడు. ఇక నర్మదా అలానే నిద్రపోతుంది.
శ్రీవల్లి చందు కి ఐస్ క్రీమ్ తీసుకొని వెళ్లి ఇస్తుంది. చందు మాత్రం ఐస్ క్రీమ్ తింటే నాకు పళ్ళు జివ్వు మంటున్నాయి నాకేం వద్దు అని అంటాడు. వేదవతి కూడా నాకు వేడిగా చల్లగా తిన్న జూమ్ అంటుంది అందుకే నేను మన డాక్టర్ని అడిగితే అయినా నాకు ఒక పేస్ట్ ని సజెస్ట్ చేశారు అది నేను తెచ్చుకున్నాను అని సెన్సోడైన్ యాడ్ ని సీరియల్ లో చేస్తారు. ఇక తర్వాత ప్రేమ మావయ్య గారిని ఎలాగైనా ఒప్పించాలి అత్త అని వేదవతిని అడుగుతుంది. శ్రీవల్లి మాత్రం వీళ్ళిద్దరి ప్రేమను చూసి మంట పుడుతుంది అంటూ కుళ్ళుకుంటుంది..
అదిగో మీ మామయ్య గారు వచ్చారు ఈ విషయం గురించి ఎలాగైనా ఇప్పుడు బయట పెట్టాలి అని అంటుంది వేదవతి.. రామరాజు ఇంట్లోకి రాగానే శ్రీవల్లి రామరాజుకి అన్ని ముందుండి చేస్తుంది. డబ్బులున్న బ్యాగ్ ని ఈ టివి బీరువాలో పెడతానంటే రామరాజు శ్రీవల్లి చేతికే ఇస్తాడు. నేను పెడతాలేండి అంటే నీ టైం వచ్చినప్పుడు నువ్వు పెడుదువులే అని వేదవతి అంటున్న కూడా శ్రీవల్లి వినదు. రామరాజు ఇంట్లో సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారా బుజ్జమ్మ అని అడుగుతాడు. ప్రేమ ట్యూషన్ గురించి అడగ్గానే అందరూ షాక్ అవుతారు. ప్రేమ వెధవతి ఎంత చెప్తున్నా కూడా రాజేంద్రప్రసాద్ మాట వినడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..