Shiva Jyothi: ప్రముఖ యాంకర్ శివజ్యోతి (Shiva Jyothi) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో ఎంతోమందిని మెప్పించిన ఈమె సావిత్రక్కగా వినోదరంగంతో పాటు జర్నలిజంలో విశేష గుర్తింపును సొంతం చేసుకుంది. ఒక న్యూస్ ఛానల్లో సావిత్రక్కగా రాణించిన ఈమె, ఆ తర్వాత పలు చానల్స్ లో పనిచేసి.. ఇప్పుడు బుల్లితెరపై మెరుస్తోంది. ఇదిలా వుండగా శివ జ్యోతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు అనే వార్త ఒక్కసారిగా ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఇంతటి ఘోరానికి శివజ్యోతి పాల్పడింది? అసలేమైంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
ఆత్మహత్యాయత్నం చేసిన శివ జ్యోతి..
అసలు విషయంలోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామానికి చెందిన శివ జ్యోతి ఒక టీవీ కార్యక్రమం తో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. కెరియర్ మొదలు పెట్టక ముందు వరకు జీవితం మొత్తం కష్టాల మయం. చిన్న వయసులోనే గంగులు (ప్రస్తుతం శివ జ్యోతి భర్త) ను ప్రేమించింది. ఈ ప్రేమ కారణంగానే ఎన్నో కష్టాలు అనుభవించింది. పదవ తరగతి వచ్చేసరికి వీరి ప్రేమ ఇంట్లో తెలిసి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే ముంబైలోని బంధువుల వద్దకు పంపించి, ఆమెను కొన్ని రోజులు అక్కడే ఉంచారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్ళీ స్వగ్రామం చేరిన ఆమెకు కొన్ని కష్టాలు తగ్గాయి. కానీ గంగులును మాత్రం వదులుకోలేకపోయింది. శివ జ్యోతికి గంగులుపై ఉన్న ప్రేమను తగ్గించాలని కుటుంబ సభ్యులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆఖరికి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. దాంతో తీవ్ర భయాందోళనకు గురైన శివ జ్యోతి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది.
ప్రేమించిన వాడి కోసం ఎన్నో కష్టాలు..
అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన శివజ్యోతిని.. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్ కి తరలించి, ఆమెను కాపాడుకున్నారు. ఇక తర్వాత ఉన్నత చదువుల కోసం హైదరాబాదు వెళ్ళింది అక్కడే తన సోదరుడితో పాటు తన ప్రియుడు గంగులుతో కలిసి ఒకే రూమ్లో నివసించడం మొదలుపెట్టింది. అటు గంగులు కూడా కష్టపడి చదివి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం సంపాదించారు. శివ జ్యోతి కూడా న్యూస్ రీడర్ గా కెరియర్ మొదలు పెట్టి.. టీవీ యాంకర్ గా మారి.. ఇద్దరూ సెటిల్ అయ్యాక నిజామాబాద్ లోని సాయిబాబా ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక తర్వాత బిగ్ బాస్ కి వెళ్లిన శివజ్యోతి అక్కడ తన వాక్చాతుర్యంతో, ఆట తీరుతో అందరినీ ఆకట్టుకొని హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు షోలు చేస్తూ మెప్పిస్తోంది. అంతేకాదు ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసిన ఈమె తన భర్తతో కలిసి పలు వీడియోలు చేస్తూ అటు వైవాహిక జీవితాన్ని కూడా సంతోషంగా గడుపుతోంది. ఇకపోతే ఈ విషయాలన్నీ కూడా శివజ్యోతి తన పదవ పెళ్లిరోజు సందర్భంగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఈ విషయాలు తెలిసి.. అభిమానులు గతంలో జరిగిందా అంటూ నివ్వెరపోతున్నారు. ఏది ఏమైనా ప్రేమించిన వాడి కోసం చావు అంచుల వరకు వెళ్లి.. మళ్లీ జయించింది అంటూ శివజ్యోతి పై కామెంట్లు చేస్తున్నారు.
also read:RGV: మరోసారి తనను దిగజార్చుకున్న వర్మ.. వార్ -2 పై అర్ధరాత్రి పోస్ట్..!