Illu Illalu Pillalu Today Episode may 29th: నిన్నటి ఎపిసోడ్ లో.. ధీరజ్ నాన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ప్రేమ వచ్చి సెటైర్లు వేస్తుంది.. మరి లేకుంటే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? మీ నాన్న అన్న దాంట్లో తప్పేముంది. తప్పులేదు ఇన్ని రోజులు నేను మా నాన్న తిడుతున్నారేమో అని అనుకున్నాను కానీ మా నాన్న మా కోసం ఇంత బాధ పడుతున్నారని తెలియనే తెలీదు. అయితే మా నాన్న ఏరోజైనా మా ఎదుగుదలను చూసి సంతోష పడతాడు అలా నేను చేసి చూపిస్తానని ధీరజ్ అంటాడు.. ధీరజ్ని చూసి ప్రేమ సంతోషపడుతుంది. నువ్వు మీ నాన్న అనుకున్న స్థాయికి ఎదుగుతావని నేను అనుకుంటున్నాను నేను నమ్ముతున్నానని ప్రేమ అంటుంది.. నర్మదా బాధపడుతూ ఉంటే అక్కడికి వెళ్లి ఏంటి మీ నాన్నన్న మాటలకి బాధపడుతున్నావా.. తప్పేముంది ఎందుకు బాధపడుతున్నావ్ ఆయన అన్నదాంట్లో తప్పు లేదు కదా అనేసి అంటుంది.
నెత్తి మీద రూపాయి పెడితే అదిరిపోయి కూడా విలువ చేయలేవని ఆయన అన్నాడు అది 100% నిజం. ఆ రైస్ మిల్లులో పనిచేస్తూ ఉంటే నీకు అసలు విలువే ఉండదు అది నువ్వు గుర్తించుకో సాగరని నర్మదా అంటుంది. కూడా మా నాన్న మాదిరే మాట్లాడుతున్నావు. ఆఖరికి నీకు కూడా నేను చీప్ అయిపోయాను అని సాగర్ అంటాడు. అవును అది నిజమే అయితే నువ్వు ఆ రైస్ మిల్లు పని చేయడం మానేసి.. వేరే జాబ్ వెతుకు లేదంటే మాత్రం నీకు అసలు విలువే ఉండదు అని నర్మదా అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నర్మద చెప్పిన విషయాన్ని సాగరు ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఉదయం లేవగానే శ్రీవల్లి బాక్స్ పెట్టేసి తన భర్తకు ప్రేమతో ముద్దులు వర్షం కురిపిస్తుంది. దానికి చందు మురిసిపోతూ ఉంటాడు. మా బావకి నేనంటే అంత ప్రేమ అనేసి తనపై ప్రేమను కురిపించేస్తూ ఉంటుంది శ్రీవల్లి. శ్రీవల్లి ప్రేమకు చందు ఫిదా అయిపోతాడు. ఇద్దరి మధ్య కాస్త రొమాంటిక్ యాంగిల్ మొదలవుతుంది. బయట తలుపు వేయలేదు బావ ఎవరైనా వస్తే బాగోదు కదా అనేసి శ్రీవల్లి అంటుంది. సరే నేను ఇంకా ఆఫీస్ కి వెళ్ళొస్తానని చందు శ్రీవల్లితో అంటాడు.
సాగరు వాళ్ళ నాన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అయితే నాన్న చెప్పిందానికైనా నేను ఏదో ఒకటి సాధించి చూపించాలంటూ సాగర్ ఆలోచిస్తాడు. అటు నర్మద చెప్పిన ఆలోచన బాగుంది అంటూ సాగర్ మనసులో అనుకుంటూ వస్తాడు. అయితే చందు ఆఫీస్ కి వెళ్లడం చూసి శ్రీవల్లి విషయాన్ని చందుకు చెప్పడానికి సాగర్ వస్తాడు. వదిన నాన్నతో అలా చెప్పకూడదు కదా అన్నయ్య అనేసి సాగర్ అంటాడు.. దానికి వెంటనే చందు నర్మదా వయసులో పెద్దది అని కూడా చూడకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడటం తప్పు కదా.. ప్లేస్ లో నువ్వున్నా సరే అలానే ఆలోచిస్తావు.. టెన్షన్ పడకూడదని శ్రీవల్లి అలా చెప్పింది దాంట్లో తప్పేంటి అని సాగర్ ని తిడతాడు..
శ్రీవల్లిని వయసులో పెద్దదని కూడా చూడకుండా మర్యాద ఇవ్వకుండా నర్మదా అలా మాట్లాడటం బాగోదు. మీ ఆవిడకి ఇంకొకసారి ఇలా మాట్లాడితే బాగోదని చెప్పు అని చందు సాగర్ తో అంటాడు.. ఆ మాట వినగానే సాగర్ షాక్ అవుతాడు. ఇదంతా విన్న శ్రీవల్లి సంతోష్ పడుతుంది.. ఇక ధీరజ్ తన ఫ్రెండ్ బైక్ తీసుకొని డెలివరీ కోసం వెళ్తాడు. విశ్వం ధీరజ్ని ఫాలో అయ్యి అతని ఎక్కడ జాబ్ చేస్తున్నాడు అన్న విషయాన్ని తెలుసుకుంటాడు.. ఎలాగైనా సరే వీన్ని రోజు అడ్డంగా ఇరికించాలని ప్లాన్ చేస్తాడు..
అయితే ధీరజ్ ఉన్న ఫుడ్ డెలివరీ ఏంటో తెలుసుకొని ఆర్డర్ పెట్టమని తన ఫ్రెండ్స్ కి అడుగుతాడు. ధీరజ్ చేత ఫుడ్ ని తీసుకొచ్చే ప్రయత్నం సక్సెస్ అయ్యేలా చేస్తాడు. ధీరజ్ ని అడ్రస్ చెప్తూ ఒక ఆట ఆడుకుంటారు విశ్వం అండ్ ఫ్రెండ్స్. చివరికి ధీరజ్ అక్కడికి రాగానే విశ్వం తన విశ్వరూపం చూపిస్తాడు. ధీరజ్ ని ఎలాగైనా సరే ఈరోజు దారుణంగా అవమానించాలని కావాలని గెలుకుతాడు. ఫుడ్ ని కింద పడేసి బాడ్ రివ్యూ యువర్ అని చెప్పేసి పెడతానంటూ బెదిరిస్తాడు. ధీరజ్ భయపడి వద్దు సార్ నాదే తప్పు లేట్ అయినందుకు అని రిక్వెస్ట్ చేస్తాడు. మాట వినకుండా ధీరజ్ ను అవమానిస్తారు.. ఇక ఇదంతా చూసిన ప్రేమ విశ్వం ఫ్రెండ్ ని దారుణంగా కొడుతుంది. ధీరజ్ ఇప్పుడు నా భర్త.. తనకి ఇలా అవమానిస్తే మేము అసలు ఒప్పుకోమంటు తిడుతుంది. ఇంతకాలం ఇలా మా మీద పగతో ఉంటావు నువ్వు ఇంకా మారవా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది ప్రేమ. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..