CM Chandrababu: ఏపీలో కూటమి సర్కార్‌ను అప్రతిష్ట పాలు చేసేందుకు ప్లాన్ జరుగుతోందా? చంద్రబాబు పాలనపై పొరుగు రాష్ట్రాలతో దుమ్మెత్తి పోయిస్తున్నారా? ఈ తతంగం వెనుకున్నదెవరు? ఇందులో వైసీపీ కుట్ర ఏమైనా ఉందా? మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు క్లారిటీ ఇవ్వడానికి గల కారణమేంటి? ఆ తరహా వార్తలకు ఇక ఫుల్‌స్టాప్ పడినట్టేనా?
ఆ ప్రచారానికి సీఎం చెక్
బెంగుళూరులో ఉన్న హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్-HAL కంపెనీని ఏపీకి తరలించాల్సిందిగా తాను కేంద్రాన్ని కోరినట్టు వచ్చిన వార్తలపై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. కడపలో జరుగుతున్న మహానాడు వేదికపై వివరణ ఇచ్చారు. విమానాల తయారీకి అనువైన ప్రాంతం అనంతపురం జిల్లా లేపాక్షి ప్రాంతమన్నారు.
కర్ణాటకలో ఉండేవారు కొంతమంది చేస్తున్న తప్పుడు ప్రచారంపై వివరణ ఇచ్చారు. బెంగుళూరులో ఉన్న హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కంపెనీని ఏపీకి షిఫ్ట్ చేయాలని తాను కేంద్రాన్ని కోరలేదన్నారు. ఒక రాష్ట్రంలో ఉన్న సంస్థను మరో రాష్ట్రానికి తరలించాలని తానెప్పుడూ కోరను.. కోరలేదన్నారు. నా చరిత్రలో అది లేదన్నారు. అభివృద్ధికి మారుపేరు తెలుగుదేశం పార్టీ అని అన్నారు. అలాంటి చెడ్డ పేరు తెలుగుదేశం పార్టీకి లేదన్నారు.
అసలేం జరిగింది?
ఇటీవల రెండురోజుల పర్యటనకు ఢిల్లీ వెళ్లారు సీఎం చంద్రబాబు. పలువురు కేంద్రమంత్రులను కలిశారు. ముఖ్యంగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌ను కలిసి ఏపీలో HAL కార్యకలాపాలు విస్తరించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. కొత్తగా గ్రీన్ ఫీల్డ్ HAL కేంద్రాన్ని కొత్త యూనిట్ స్థాపించాలని ప్రతిపాదనను తీసుకొచ్చారు.
ALSO READ: కొత్త పథకానికి ఏపీ ప్రభుత్వం ప్లాన్, మహిళల పేరుతో
యుద్ధ విమానాలు, స్వదేశీ రక్షణకు సంబంధించి భవిష్యత్ ఉత్పత్తుల సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలనేది మా లక్ష్యమన్నారు. దీంతో బెంగుళూరులో ఉన్న హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కంపెనీ యూనిట్ ను ఏపీకి తరలించుకుపోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వెంటనే రంగంలోకి దిగిన కర్ణాటక ప్రభుత్వం ఈ ప్రచారాన్ని తోసిపుచ్చింది.
కర్ణాటక సీఎం సిద్దరామయ్య క్లారిటీ ఇచ్చారు. తనకు తెలిసినంత వరకు ఇది సాధ్యపడదన్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా దాదాపుగా అదే చెప్పారు. HALను బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదన్నారు. తుమకూరులో హెలికాప్టర్ యూనిట్ కోసం భూమి కేటాయించామన్నారు.
ఏపీలో కొత్తగా యూనిట ఏర్పాటు చేయాలంటే అడిగే స్వేచ్ఛ వారికి ఉందన్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ-ADA ఆధ్వర్యంలో HAL సహకారంతో నడుస్తున్న విషయం తెల్సిందే.
వైసీపీ కుట్ర?
ఈ ప్రచారం వెనుక వైసీపీ కుట్ర ఉంచవచ్చని భావిస్తున్నారు టీడీపీ నేతలు. ఎందుకంటే ఆ పార్టీ సానుభూతిపరులు కొందరు జాతీయ ఛానెళ్లలో పని చేస్తున్నారని అంటున్నారు. వారి ద్వారా వైసీపీ ఇలాంటి కుట్రకు తెరలేపినట్టు కొందరు నేతలు అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు కాకపోయినా కొద్దిరోజుల తర్వాతైనా బయటపడుతుందని అంటున్నారు. జాతీయ పార్టీలతో చంద్రబాబుకు ఉన్న ఇమేజ్‌ని డ్యామేజ్ చేయాలన్నది వారి ప్లాన్‌గా కనిపిస్తోందని మరికొందరు అంటున్నారు.
CM Naidu has categorically dismissed media reports and political allegations suggesting that he sought the relocation of the Hindustan Aeronautics Limited (HAL) facility from Karnataka to Andhra Pradesh.
Speaking at the Mahanadu Sabha in Kadapa, Naidu… pic.twitter.com/9CyfrE5PM3
— NewsMeter (@NewsMeter_In) May 28, 2025