OTT Movie : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కొన్ని సినిమాలు డిఫెరెంట్ స్టోరీలతో ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ నచ్చితే భాషతో పనిలేకుండా ఆదరిస్తున్నారు మూవీ లవర్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే జపనీస్ మూవీలో ఒక వాషింగ్ మిషిన్ అద్భుతాలు చేస్తుంది . కోరిన కోరికలను తీరుస్తూ ఉంటుంది. అంతే కాకుండా గర్ల్ ఫ్రెండ్స్ ని కూడా ఇస్తుంది. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
ఒక వ్యక్తి తన బట్టలు ఉతకడానికి లాండ్రీ షాప్‌కి వెళ్తాడు. అక్కడ వాషింగ్ మిషిన్ డ్రైయర్‌లో బట్టలు వేసిన తర్వాత, అతను ఒక బీర్ క్యాన్ తాగాలని అనుకుంటాడు. అద్భుతంగా వాషింగ్ మిషిన్ లో ఏదో పడిన శబ్దం వినిపిస్తుంది. అతను అందులో వెతికినప్పుడు అక్కడ ఒక బీర్ క్యాన్ కనిపిస్తుంది. అతను మరిన్ని కోరికలు కోరుకుంటాడు. ప్రతిసారీ వాషింగ్ మిషిన్ అతని కోరికలను నెరవేరుస్తుంది. అది డబ్బు, ఆహారం, ఏ వస్తువులు అయినా కోరుకున్న వెంటనే ఇస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ ఒక మాయాజాల యంత్రంలా పనిచేస్తుందని అతను గ్రహిస్తాడు. ఇక అతని ఆనందానికి అవధులు లేకుండాపోతాయి. దాని ద్వారా తన కోరికలన్నింటినీ తీర్చుకోవాలని అనుకుంటాడు. అయితే, అతను ఈ శక్తిని దుర్వినియోగం చేయడం ప్రారంభిస్తాడు. అతను ప్రతిరోజూ కొత్త అమ్మాయిని కోరుకుంటాడు. ఈ యంత్రం అతని ఈ కోరికను కూడా నెరవేరుస్తుంది.
కానీ దీనికి ఒక కండిషన్ ఉంటుంది. ప్రతిసారీ అతను కొత్త అమ్మాయిని పొందినప్పుడు, మునుపటి అమ్మాయి అదృశ్యమవుతుంది. దీని వెనుక ఏదో రహస్యం ఉందని అతను గ్రహిస్తాడు. కథ ముందుకు సాగే కొద్దీ, ఈ వాషింగ్ మెషిన్ కేవలం కోరికలను తీర్చే యంత్రం మాత్రమే కాదు, అది అతని జీవితంలో ఊహించని రీతిలో వినాశనాన్ని తెచ్చిపెడుతుందని తెలుస్తుంది. అతని అత్యాశ ఊహించని మలుపులు తీసుకొస్తుంది. చివరికి వాషింగ్ మిషిన్ వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి ? అతని జీవితం ఎలా మలుపు తిరుగుతుంది ? అమ్మాయిలతో అతనేం చేస్తాడు ? అనే విషయాలను తెలుసుకోవాలి అంటే, ఈ జపనీస్ హారర్ ఆంథాలజీ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : చావక ముందే స్వర్గానికి వెళ్ళే మనుషులు… సీను సీనుకో ట్విస్ట్ తో అదిరిపోయే ఫ్యాంటసీ థ్రిల్లర్
యూట్యూబ్(Youtube) లో
ఈ జపనీస్ హారర్ ఆంథాలజీ మూవీ పేరు ‘టేల్స్ ఆఫ్ ది అన్యూశ్వల్ వాషింగ్ మిషిన్ ‘ (Tales of the Unusual washing Machine). 2000 లో వచ్చిన ఈ సినిమాకి మసాయుగు ఓషియోదర్శకత్వం వహించారు. అనే చిత్రంలో నాలుగు విభిన్న కథలు ఉన్నాయి. యూట్యూబ్(Youtube) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.