Illu Illalu Pillalu Today Episode May 6th: ఏంటి సాగర్ ఇది? ఇంత కోపం ఆవేశం ఎందుకు నీకు.. అసలు ఇంట్లో నుంచి వెళ్లాలన్న ఐడియా నీదా మా నాన్నదా అని అనగానే బయట కూర్చుని ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అవమానాలు పడుతూ ఇక్కడే ఉండాలంటే నావల్ల కాదు. ఐదు లక్షలు అడిగారు కదా వాటిని కట్టేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఈ నరకం నుంచి బయట పడదామని సాగర్ అనగానే రామరాజు ఫీల్ అయిపోతాడు. నర్మదా ఇంట్లో నుంచి వెళ్లకుండా ధీరజ్ చేసిన ప్రయత్నం పై ప్రేమ ఎమోషనల్ అవుతుంది. ఇప్పుడు స్కానింగ్ ప్రేమ నర్మదకు వెళ్లకుండా ఈరోజు ఆపావు ఇకముందు వెళ్లకుండా ఎలా ఆపుతావు అని అడుగుతుంది.. నీకు అక్క మాత్రమే కాదు నాకు వదిన,అన్నయ్య.. అలానే ఇకమీదట బయటకి వెళ్ళనివ్వకుండా నేను చేస్తాను అని ధీరజ్ అంటాడు. ధీరజ్ మాట ఇవ్వడంతో ప్రేమ చాలా సంతోషంగా ఉంటుంది..
చందు వల్లికి పుల్లగా తినాలనిపిస్తుంది కదా అందుకోసమే మామిడికాయలు తీసుకొచ్చాను అని నర్మదా వాళ్ళకి ఇవ్వమని చెప్తాడు. శ్రీవల్లి వాళ్ళ అమ్మాయి పీతల పులుసుని ఎవ్వరికి ఇవ్వకుండా మొత్తం తినాలి అని ఉంటుంది.. పీతలు కూర ఎంత బాగుందో అంటూ లొట్టలు వేసుకుంటూ తినేస్తూ ఉంటుంది శ్రీవల్లి.. మళ్లీ తింటూ ఉండగా ప్రేమ నర్మదలు లోపలికి వస్తారు.. ఏం తింటున్నావ్ వల్ల అక్క అని అడుగుతారు. మా అమ్మ నా కోసం పీతల పులుసు పంపించింది ముక్కలు కొన్నే ఉన్నాయి. కాబట్టి మీకు ఇవ్వకుండా తినేస్తున్నాను అని అనగానే నర్మదా బుద్ధుందా నీకు అని ఒక్కసారిగా అరుస్తుంది.. కడుపుతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పీతల పులుసు తింటారా కొంచమేనా నీకు బుద్ధి లేదా అని నర్మదా సీరియస్ అవుతుంది..
నర్మదా వెంటనే వేదవతిని పిలుస్తుంది.. కడుపుతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పీతలు తింటారా మీరు చెప్పండి అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది. అయ్యో శ్రీరామచంద్ర కడుపుతో ఉన్నవాళ్లు పీతలు ఎలా తింటారు తినకూడదు కదా అని వేదవతి సీరియస్ అవుతుంది. నీ కంటే బుద్ధి లేదు కనీసం మీ అమ్మ కన్నా బుద్ధి లేదా అని వేదవతి శ్రీవల్లిని భాగ్యం నీ ఇద్దరినీ కలిపి తిట్టేస్తుంది. మీ అమ్మ ఇద్దరు పిల్లలు కనింది ఆ మాత్రం కూడా తెలీదా ఏమి తినాలో ఏవి తినకూడదో కూతురికి ఇలానే ఇలా పెట్టేది అంటూ వేదవతి రెచ్చిపోతుంది.. ఇదంతా కాదు అత్తయ్య ఒకసారి మీరు బయటికి రండి అని నర్మదా ప్రేమలు వేదవతిని బయటకు తీసుకుని వెళ్తారు..
అత్తయ్య కడుపుతో ఉన్నవాళ్లు పీతలు తినకూడదని వాళ్ళ అమ్మ కూడా తెలియలేదు. అంటే వల్లి యొక్క నిజంగానే కడుపుతో ఉందా లేదా వాళ్ళమ్మ జిత్తుల మరి నక్క కదా.. ఏదైనా నాటకాలు ఆడుతుంది అన్నది ఇప్పుడు అర్థం కావడం లేదు అని నర్మదా అంటుంది. వీళ్ళు ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారు అని బయటికి వెళ్లిన శ్రీవల్లికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఎదురవుతుంది. నా కడుపులో బిడ్డ లేదని మీరు అనుమానిస్తున్నారా? మా అమ్మ అబద్ధం చెప్పిందని మీరు అనుకుంటున్నారా అయితే హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ గారిని అడుగుదాం పదండి అని నర్మదా ప్రేమలను బలవంతంగా హాస్పిటల్ కి తీసుకుని వెళుతుంది వల్లి.
హాస్పిటల్ లోపలికి వెళ్లిన శ్రీవల్లి తెగ హడావిడి చేస్తుంది. డాక్టర్ గారండి ఆరోజు నేను కళ్ళు తిరిగి పడిపోతే మీరు నేను ప్రెగ్నెంట్ అని చెప్పారు కదా.. కానీ నా చెల్లెలు ఇద్దరు ఆ విషయం గురించి చెప్తే నమ్మడం లేదు. మీరు స్కానింగ్ చేసి వీళ్ళకి బిడ్డ ఏ పొజిషన్లో ఉందో చెప్పండి అని వల్లి అనగానే డాక్టర్ ఎక్కడ దొరికిపోతుంది అని కంగారు పడిపోతుంది. మీరు బయటికి వెళ్ళండి అమ్మ నేను స్కానింగ్ చేయాలి అని డాక్టర్ వల్లి తో అంటుంది. వాళ్ళిద్దరూ అలా బయటకు వెళ్ళగానే డాక్టర్ వల్లి చెంప పగలగొడుతుంది. నీకు కాపురం నిలబెట్టమని మీ అమ్మ నాకు కాళ్లు పట్టుకుంటే లేని కడుపుని ఉందని అబద్ధం చెప్పాను. నువ్వు అసలు ప్రెగ్నెంట్ కాదు అని డాక్టర్ గుండెలు బద్దలు కొట్టే నిజాన్ని బయటపెడుతుంది. ఆ మాట వినగానే వల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదంతా మీ అమ్మ ఆడిన నాటకమే నువ్వు ప్రెగ్నెంట్ కాదు అని చెప్పగానే వల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేను కడుపుతో ఉన్నానని చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు ఇది నిజంగానకు బయటికి తెలిస్తే నా పరిస్థితి ఏంటి రా దేవుడా నాకు కాపురం కూలిపోతుంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ విషయాన్ని మీరు బయటకు చెప్పనివ్వకుండా ఏదో ఒకటి చేయండి నాకు కాపురం నిలబెట్టండి డాక్టర్ గారు అంటూ వల్లి డాక్టర్ కాళ్లు పట్టుకుంటుంది. ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో వల్లి కోసం డాక్టర్ ఏం చెబుతుంది అన్నది సస్పెన్స్ గా మారింది..
Also Read : ‘అమ్మోరు ‘ భవాని రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?