E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: నగల కోసం రామరాజు కండీషన్.. ధీరజ్, ప్రేమ మధ్య గొడవ.. వేదవతికి టెన్షన్..

Illu Illalu Pillalu Today Episode: నగల కోసం రామరాజు కండీషన్.. ధీరజ్, ప్రేమ మధ్య గొడవ.. వేదవతికి టెన్షన్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 28th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లో నోములు ఉన్నాయని అందరు రెడీ అవుతారు. శ్రీవల్లి ఒంటినిండా బంగారు నగలు వేసుకొని బంగారానికే బంగారంలా ఉన్నావు అని తెగ మురిసిపోతుంది.. అంతలోకే లోపలికి తిరుపతి వచ్చి నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది అని అంటాడు. ప్రేమ నగలు మార్చిన విషయాన్ని కనిపెట్టాడు ఏంటి అనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది శ్రీవల్లి.. అనవసరంగా నేనే నోరు జారీ ఇరుక్కున్నట్లు ఉన్నాయని శ్రీవల్లి అనుకుంటుంది.. ఏం తెలిసింది బాబాయ్ దేని గురించి మీరు మాట్లాడుతున్నారు అని అడుగుతుంది.. నువ్వు చాలా గుణవంతురాలు వి నువ్వు చాలా గొప్ప దానివి అని శ్రీవల్లి పై తిరుపతి పొగడ్తల వర్షం కురిపిస్తాడు..ఇంట్లో నోముల కోసం అంతా సిద్ధం చేస్తారు. అప్పుడే ఎదురింట్లోని వాళ్లు గిల్ట్ నగలు అని రామరాజు కుటుంబంతో గొడవకు దిగుతారు. రామారాజుకు బుర్ర గిర్రున తిరుగుతుంది. నగలు ఎలా మాయం అయ్యాయి అని టెన్షన్ పడుతుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రేపటి సాయంత్రం వరకు టైం ఇస్తున్నాం మా నగలు మాకు కావాలి అని భద్ర వార్నింగ్ ఇస్తుంది.. ఇంట్లో నగలు ఏమయ్యాయి అని టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే శ్రీవల్లి ఆ నగల గురించి ప్రేమకు దేవుడికి తెలుసు మావయ్య అని అంటుంది.. ఆ పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కంటుంది. దానికోసం చాలా డబ్బులు కావాలి. అందుకే ఆ నగలని అమ్మేసుకుని ఆ డబ్బులని ఏం చేస్తుందో అడగండి అని అంటుంది.. ఏం మాట్లాడుతున్నావ్ అక్క నీ ప్రేమ ఎంత చెప్పినా సరే నువ్వే తీసి ఉంటావు ధీరజ్ మొన్న షూస్ కూడా కొన్నాడు కదా… ఆ నగల గురించి మీరే చెప్పాలి అని అంటుంది.. ప్రేమకు సపోర్టుగా నర్మదా వస్తుంది.. ఏం మాట్లాడుతున్నావు అక్క ప్రేమ నగలు ప్రేమే తీసుకోవడం ఏంటి..? మాట్లాడితే ఒక అర్థమనేది ఉండాలి అని నర్మదా అంటుంది…

Advertisement

మీ దగ్గరే ఉండేవి కాబట్టి ఆ నగలు ఎలా పోయాయో మీరే కనిపెట్టి సాయంత్రం లోపు మీరు ఇవ్వాలి అని రామరాజు ధీరజ్ ప్రేమలకు వార్నింగ్ ఇస్తాడు. రూమ్ లోకి వెళ్లిన ధీరజ్ ప్రేమ నగలు ఏమయ్యాయో అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ నగలు మాయం అవ్వడానికి ఏదో కారణం ఉంది నిజం చెప్పు నువ్వే అనగల్ని దాచిపెట్టవేమో అని ప్రేమ అని అడుగుతాడు ధీరజ్. నేను నా నగల్ని దాచి పెట్టుకోవడం ఏంట్రా ఏం మాట్లాడుతున్నావ్ అని ప్రేమ అంటుంది. మా నాన్నని మీ వాళ్ళు ఎన్ని మాటలు అన్నారు చూసావు కదా.. ఆ నగలు ఎక్కడ పెట్టావో చెప్పు అని ప్రేమని అడుగుతాడు.

ఆ నగలు గురించి నాకు తెలియదు ఆ నగలు ఏమయ్యాయని నేనే టెన్షన్ పడుతున్నాను.. నువ్వు మధ్యలో నన్ను ఇంకా ఇరిటేట్ చేయకు అని ప్రేమ ఉంటుంది. మొదటినుంచి మీ వాళ్ళు ఈ నగల గురించే నా వెంట పడుతున్నారు.. నన్ను చంపుకు తింటున్నారు అని ధీరజ్ అంటాడు… అసలు ఈ నగల వల్లే మొదటి నుంచి నా జీవితం ఇలా తయారయింది అని అంటాడు. ఆ రోజు నీ మెడలో తాళి కట్టుకున్న అంటే ఈరోజు ఈ నగలు గోల నాకు ఉండేది కాదు అని పదేపదే అంటాడు. ఇంకొకసారి నీ మెడలో తాళి కట్టాను అని అన్నావంటే మర్యాదగా ఉండదు నీకు అని ప్రేమ అంటుంది. అది నిజమే కదా ఆరోజు నీకు దగ్గరికి నేనెందుకు వచ్చానో వస్తే నా పని నేను చూసుకోకుండా దాంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాను నాకర్థం కావట్లేదు అని ధీరజ్ అంటాడు

Advertisement

ఆ మాట వినగానే ప్రేమ కోపంతో రగిలిపోయి ధీరజ్ పై అక్కడున్న వస్తువుతో విసిరి కొడుతుంది. ఇక నర్మదా వేదవతి ఆ నగలు ఏమయ్యాయో అర్థం కావట్లేదని టెన్షన్ పడుతూ ఉంటారు.. నగలు ఎక్కడికి పోతాయి ఇక్కడే ఉంటాయి. బ్యాంకు నుంచి తెచ్చిన నగలు నేను దగ్గరుండి వాళ్ళ ఇంటికి పంపించాను మధ్యలో ఎక్కడ మారిపోయాయి నాకు అర్థం కావట్లేదు. ధీరజ్ ప్రేమ ఇద్దరు గొడవ పడుతున్నారు. గొడవ పెద్దదయి వీళ్ళ పెళ్లి గురించి బయట పెడితే రెండు కుటుంబాల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది అని అంటుంది. ఏం కంగారు పడకండి అత్తయ్య ఏదో ఒకటి చేద్దాం అనేసి నర్మదా అంటుంది.

భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా 10 లక్షలు సంపాదించాము అని చాలా సంతోషంగా పాటలు పాడుతూ డాన్సులు వేస్తూ ఉంటారు.. ఈ పదిలక్షలతో ముందుగా మనం మెడ మీద కత్తిపెట్టిన అప్పులను తీర్చేద్దాం అని భాగ్యం అంటుంది. ఒసేయ్ పిచ్చి భాగ్యం డబ్బులు ఉన్నాయి కదా అని వెంటనే చేయకూడదు వాటిని కోడి పిల్లలు లాగా పిల్లలు పెట్టించి.. ఆ తర్వాత మళ్లీ పిల్లలు పెట్టించి ఇలా డబ్బులు ని పెంచుకుంటూ పోవాలని ఆనందరావు ఉచిత సలహా ఇస్తాడు.. భాగ్యం కాస్త డౌట్ పడిన ఆనందరావు చెప్పిన విషయాన్ని నమ్మి అతనికి 10 లక్షలు ఇస్తుంది.

Also Read :పల్లవికి షాకిచ్చిన శ్రీయా.. భానుమతిని రెచ్చగొట్టిన పల్లవి.. ఆస్తి కోసం ఇంట్లో గొడవలు..

మాయ రావు దగ్గరికి వెళ్లిన ఆనంద్ రావు.. 10 లక్షల కి మరో 10 లక్షలు ఇవ్వండి సాయంత్రం నేను ఐదు లోపల వచ్చేస్తానని అంటాడు. ఇక ఆనంద్ రావు సాయంత్రం అవ్వగానే అక్కడికి వెళ్తాడు. 20 లక్షలు తీసుకొని వెళ్లి మా ఆవిడ ముందు పెట్టాలి అని డాన్సులు కడతాడు. అక్కడికి ఒకతను వచ్చి ఆ మాయ రావు అందరిని మోసం చేసి డబ్బులు తీసుకుని పారిపోయాడని చెప్పగానే దిమ్మతిరిగిపోయేలా షాక్ అవుతాడు. నేను ఇంట్లో ఏం చెప్పాలి.. ఈ విషయం గనుక తెలిస్తే భాగ్యం నన్ను చంపేస్తుంది అని ఏడుస్తూ ఉంటాడు. ప్రేమ నర్మద ఇద్దరు నగలు ఎక్కడ మాయమయ్యాయి అని ఆలోచిస్తూ ఉంటారు. ప్రేమకు వల్లినే ఈ నగలు తీసేసిందని డౌట్ వస్తుంది. నువ్వు చెప్తుంటే నిజమని అనిపిస్తుంది. మనం ముందు ఆ వల్లి రూమ్ లో ఈ నగలను వెతుకుదాం అని నర్మదా అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Big Stories

Advertisement
×