Illu Illalu Pillalu Today Episode july 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. చందు వాళ్ళ తమ్ముడు దగ్గరికి వెళ్తుంటే శ్రీవల్లి ఆపుతుంది. నా తమ్ముళ్ళ అంత బాధ పడుతుంటే నేను ఇక్కడ ఎలా ఉంటాను అనుకుంటున్నావు. ఈరోజు నేను నా తమ్ముడు దగ్గరే పడుకుంటాను అని మళ్లీతో అంటాడు. మీకు మీ తమ్ముళ్లే ముఖ్యం నేనంటే అస్సలు ఇష్టం లేదు. నువ్వు లేకుండా ఉంటే నాకు నిద్ర పట్టదు బావ లోపలికి వెళ్దాం పద అని తీసుకెళ్లి పోతుంది. మీ తమ్ముళ్ళతో నిన్ను అసలు కలవనివ్వను అని అంటుంది. సాగర్, ధీరజ్ లు మాత్రం ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల ఇదంతా జరిగిందని బాధపడుతూ ఉంటారు.. రామరాజు రైస్ మిల్లులకు వెళ్తాడు.. ప్రేమ వల్ల ఫ్యామిలీ అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. తన కొడుకులు ముగ్గురు తండ్రి బాధని పోగొట్టాలని రైస్ మిల్లుకు వస్తారు. ధీరజ్ ని వెళ్లి నాన్నతో మాట్లాడు అని అంటారు. రామరాజు కాళ్ళ మీద పడి నన్ను క్షమించు నాన్న అని ఎంత వేడుకున్నా సరే మౌనంగా ఉండిపోతాడు రామరాజు.. నా తప్పుందో లేదో నాకు తెలియదు నాన్న నేను మాత్రం మీ బాధను చూడలేకపోతున్నాను రండి ఇంటికి వెళ్లి పోదామని బ్రతిమలాడుతాడు. కానీ రామ రాజు మాత్రం ధీరజ్ ను దూరం పెట్టేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రేమ ధీరజ్ కోసమే నేను జాబ్ చేశాను అత్తయ్య అర్థం చేసుకోండి.. మావయ్య గారిని అలా అనడం నాకు బాధగానే ఉంది.. అయితే ఇంత జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు నన్ను క్షమించండి అత్తయ్య అని ప్రేమ వెదవతిని అడుగుతుంది. ఇక
నర్మదా వేదవతి తరపున వక్కత పుచ్చుకొని మాట్లాడుతుంది. అసలు నువ్వు మాట్లాడద్దు అని వేదవతి నర్మదపై సీరియస్ అవుతుంది. ఇంట్లో ఇదంతా జరగడానికి కారణం నువ్వే. ప్రేమ పిరికిది నువ్వే దానికి ధైర్యాన్ని నూరిపోసి ఇలా మాట్లాడించావు ఇలా చేశావు అంటూ వేదవతి అరుస్తుంది. మిమ్మల్ని నేను ఎంతగా నమ్మాను.. ఫ్రెండ్స్ లాగా ప్రతిదీ మీకు చెప్తూ వచ్చాను. కానీ మీరు మాత్రం నన్ను ఇలా మారుస్తారని అస్సలు ఊహించలేదు.
మా పెళ్లయిన ఈనెలలో ఆయన ఇంత బాధ ఎప్పుడు పడలేదు కేవలం మీ వల్లే ఆయన బాధపడుతున్నారని కోడళ్ళపై కోపంతో రగిలిపోతుంది. ప్రేమ నర్మదా ఎంతగా వేదవతిని బ్రతిమలాడుతున్న సరే ఆమె మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. నాతో మాట్లాడద్దు అని ఒకవైపు వాదిస్తూ వాళ్లపై సీరియస్ అవుతుంది. అయితే శ్రీవల్లి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి అత్తయ్య గారు మనసుని బాధపెట్టారు దేవుడు లాంటి మావయ్య గారిని అవమానపాలి ఎలా చేశారుఅత్తయ్య గారు మనసుని బాధపెట్టారు. దేవుడు లాంటి మావయ్య గారిని అవమానపాలి ఎలా చేశారు. ఇప్పుడు అత్తయ్య గారిని బతిమిలాడితే ఆమె కోపం పోతుందా అని అంటుంది శ్రీవల్లి..
ఇక శ్రీవల్లి నర్మద ప్రేమను అక్కడి నుంచి వెళ్ళిపొమ్మని బలవంతంగా పంపించేస్తుంది. తిరుపతి నగలను తీసుకొని సేన వాళ్ళ ఇంటికి వెళ్తాడు. బావని అంతగా అవమానించారు కదా ఇవిగోండి మీ నగలు అని ఇచ్చేస్తాడు. నగల కోసం మీరు బావని ఎంతగా అవమానించారు మీకు తెలీదు మీ నగలు మీరే ఉంచుకోండి అని ఇచ్చేసి వస్తాడు. నగలను చెక్ చేసిన ప్రేమ వాళ్ళ అమ్మ అవి ప్రేమవి కాదని అనుకుంటుంది ఆ విషయాన్ని బయట పెడితే మళ్లీ గొడవ జరుగుతుందని సైలెంట్ గా ఉంటుంది.
శారదమ్మ వచ్చి ప్రేమ వాళ్ళమ్మని ఆ నగలు నిజంగానే ప్రేమవైన ఎందుకలా చూసావు అని అంటుంది. అయితే ఈ రెండు నగలు ప్రేమవి కావు.. విషయం చెప్తే గొడవ చేస్తారని నేను మౌనంగా ఉండిపోయాను అత్తయ్య అని అంటుంది. అయితే శారదమ్మ ఇప్పటికే చాలా గొడవలు జరుగుతున్నాయి. మళ్లీ ఈ విషయం గురించి మాట్లాడితే గొడవలు జరుగుతాయి తర్వాత సమయం వచ్చినప్పుడు మనమే అడిగి తీసుకుందాంలే అని అంటుంది.
ఇంట్లోకి వెళ్లిన తిరుపతి ఇంకా రాలేదని గుమ్మం బయట ఎదురు చూస్తూ టెన్షన్ పడుతూ శ్రీవల్లి ఉంటుంది.. బాబాయ్ గారు నగలను ఇచ్చేసారా అని అడుగుతుంది. అయితే ఇచ్చాను అని అంటాడు. అవి డూప్లికేట్ అని ఎక్కడ తెలుసుకుంటారు అని ప్రేమ టెన్షన్ పడుతూ ఉంటుంది. బాబాయ్ గారు అంటే అవి ప్రేమ నగలుగా ఎందుకు చెక్ చేస్తారు లోపల పెట్టేసారు అని అనగానే శ్రీవల్లి సైలెంట్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..