Junior Movie Review : గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరీటీ రెడ్డి హీరోగా ఎంట్రీగా ఇస్తూ చేస్తూ చేసిన సినిమా ‘జూనియర్’. ‘వైరల్ వయ్యారి’ సాంగ్ తో ఈ సినిమాకి బాగా పబ్లిసిటీ జరిగింది. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ :
విజయనగరం అనే గ్రామానికి చెందిన పెద్ద మనిషి కోదండపాణి (వి రవిచంద్రన్). మంచితనం పేరుపై ఆస్తులన్నీ పోగొట్టుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటాడు. అలాంటిది 45 ఏళ్ళ వయసులో అతని భార్య శ్యామల గర్భవతి అవుతుంది. దీంతో ఊర్లో వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఆ అవమానాలు తట్టుకోలేక ఊరి నుండి వెళ్లిపోవాలని నిశ్చయించుకుంటారు. అయితే బస్సులోనే అతని భార్యకి పురిటి నొప్పులు వస్తాయి. తర్వాత బస్సులోనే ఆమె ఓ బిడ్డకు జన్మినిచ్చి ప్రాణాలు విడుస్తుంది. ఆ తర్వాత కొడుకుని ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటాడు కోదండపాణి. కానీ అతని కొడుకు అభి(కిరీటీ రెడ్డి) తండ్రి ప్రేమని చాదస్తంగా ఫీలవుతాడు.
అతనికి దూరంగా వెళ్ళిపోవాలి అనేది అతని కోరిక. అలాగే 60 ఏళ్లకు తగ్గ మెమోరీస్ పోగేసుకోవాలనేది అతని సిద్ధాంతం. ఈ క్రమంలో స్పూర్తితో ప్రేమలో పడతాడు. తర్వాత ఆమె జాబ్ చేస్తున్న కంపెనీలోనే ఇంటర్న్ గా జాబ్ సంపాదిస్తాడు. అయితే అభి ప్రవర్తన అతని బాస్ విజయ (జెనీలియా) కి అస్సలు నచ్చదు. దీంతో అతన్ని జాబ్ లో నుండి తీసేయాలని భావిస్తుంది. కరెక్ట్ గా విజయ సీఈఓ అయ్యే క్రమంలో అభి.. మాయ చేసి ఆమెను సీఈఓ అవ్వకుండా చేస్తాడు. ఈ నేపథ్యంలో విజయ గురించి అభికి ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది. అసలు విజయ ఎవరు? ఆమె గతం ఏంటి? విజయతో అభికి సంబంధం ఏంటి? అనే ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.
విశ్లేషణ :
‘జూనియర్’ సినిమా ప్రమోషన్స్ లో దర్శకుడు రాధాకృష్ణ రెడ్డి గురించి అంతా చాలా గొప్పగా చెప్పారు. 3 ఏళ్ళ పాటు అతను తన ఫ్యామిలీకి దూరంగా ఉండి ఈ సినిమాని కంప్లీట్ చేశాడని అంతా అతన్ని ప్రశంసించారు. అయితే సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాలకే ‘3 ఏళ్ళు కష్టపడి తీసేంతలా ఇందులో ఏముంది?’ అనే డౌట్ మొదలవుతుంది. క్రమక్రమంగా ఆ డౌట్ పెరుగుతుందే తప్ప దానికి ఆన్సర్ దొరకదు. ‘కార్పొరేట్ సంస్థలో ఉండే హీరో… గ్రామానికి వచ్చి ఏదో ఉద్ధరించడం’ అనే లైన్ మహేష్ బాబు ‘మహర్షి’ వంటి సినిమాల్లో చూశాం.
నితిన్ ‘భీష్మ’ కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. కాబట్టి.. ‘జూనియర్’ లో కొత్తగా ఆశించడానికి ఏమీ ఉండదు. ప్రతి సీన్ ముందుగానే అంచనా వేసేయొచ్చు. కథ, కథనాలు ఇంప్రెస్ చేయకపోయినా.. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒకటి, రెండు పాటలు చూడముచ్చటగా ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఆకట్టుకుంటాయి. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అక్కడక్కడా వర్కౌట్ అయ్యింది. ‘వైరల్ వయ్యారి’ పాటని బాగా పిక్చరైజ్ చేశారు. కానీ దాని ప్లేస్మెంట్ బాలేదు.
నటీనటుల విషయానికి వస్తే.. కిరీటీ రెడ్డి డెబ్యూ కోసమే తీసిన సినిమా ఇది. కాబట్టి సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అతనికి ఎలివేషన్స్ పడుతూనే ఉంటాయి. అవి చాలా మందికి ఇబ్బందిగానే ఉంటాయి. డాన్సులు, ఫైట్స్ బాగా చేశాడు. ఎక్స్ప్రెషన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. శ్రీలీల గురించి చెప్పాలి అంటే ‘ఆదికేశవ’ ‘ఎక్స్ట్రా..’ ‘రాబిన్ హుడ్’ సినిమాల్లో చేసిన పాత్రలకి ఇందులో చేసిన పాత్ర కంటిన్యూషన్ గా అనిపిస్తుంది.
సెకండాఫ్ లో అయితే ఆమె ఒక్క పాటలో తప్ప ఎక్కడా కనిపించదు. బహుశా కాల్షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోయిందేమో. జెనీలియాకి రీ ఎంట్రీకి కావాల్సిన పాత్ర పడింది. సినిమాకి ప్లస్ పాయింట్స్ లో ఈమె గురించి కూడా చెప్పుకోవాలి. రవిచంద్రన్ కూడా బాగా చేశారు. ఆమె నటనకి దూరమైనా ఆ లోటు కనబడనివ్వలేదు. కానీ లుక్స్ విషయంలో మేకప్ ఓవర్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. రావు రమేష్, సత్య, వైవా హర్ష వంటి వాళ్ళు తమ స్థాయికి తగ్గ పెర్ఫార్మన్సులు ఇచ్చారు.
ప్లస్ పాయింట్స్ :
జెనీలియా
ప్రొడక్షన్ వాల్యూస్
స్టార్ క్యాస్టింగ్
వైరల్ వయ్యారి సాంగ్
మైనస్ పాయింట్స్ :
రొటీన్ కథ
సెకండాఫ్
క్లైమాక్స్
మొత్తంగా… ఈ ‘జూనియర్’ బి,సి సెంటర్ ఆడియన్స్ నే టార్గెట్ చేసి తీసిన సినిమా. కానీ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఈ సినిమా సాగుతుంది.
Junior Movie Rating : 2/5