Intinti Ramayanam Today Episode August 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. భరత్ ని స్టేషన్ కి తీసుకెళ్లి శ్రీకర్ అవని సైన్ చేయిస్తారు. అక్కడ ప్రణతి కోసం చూసిన పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న ఫోటోలను చూసి అవన్నీ షాక్ అవుతుంది. ఇదేంటి వీళ్ళ ఫోటోలు ఇక్కడ ఉన్నాయి అని అవని అక్కడే ఉన్న ఎస్ఐ ని అడుగుతుంది.. ఆయన చెప్పిన నిజంతో మైండ్ బ్లాక్ అవుతుంది.. ఇలాంటి వాడిని నా అత్తయ్య ప్రణతికించి పెళ్లి చేయించించాలని అనుకుంటుందా..? వెంటనే ఈ విషయాన్ని అత్తయ్యకి చెప్పాలి అని ఫోన్ చేస్తుంది.. ఫోన్ లిఫ్ట్ చేసిన పార్వతి వెటకారంగా మాట్లాడుతుంది. నువ్వేంటి నాకు ఫోన్ చేసావ్ అయినా నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని పార్వతి అంటుంది.
నేను ఒక విషయం చెప్పాల అత్తయ్య మీరు కచ్చితంగా రావాలి. ఆ తర్వాత నేను చెప్పింది చూసి మీరు నన్ను చెప్పుతో కొట్టిన నేను పడతాను అని అంటుంది. అవని మాట విన్న పార్వతి ఒక్కటే పోలీస్ స్టేషన్ కి వెళుతుంది. ఏంటి ఇక్కడికి రమ్మన్నావు ఏమైంది అని అడుగుతుంది పార్వతి. మొత్తానికి పార్వతికి ఆ పెళ్ళికొడుకు మోసం గురించి అవని తెలిసేలా చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రణతికి చూసిన పెళ్ళికొడుకు మోసగాళ్ళని పార్వతికి తెలిసేలా చేయాలని అవని పార్వతిని పోలీస్ స్టేషన్ రమ్మని అడుగుతుంది. అక్కడికి వచ్చిన పార్వతీ పోలీస్ చెప్పిన విషయంతో షాక్ అవుతుంది. అయితే ఆ అబ్బాయి వాళ్ళ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు అని పార్వతి అంటుంది. అవని పార్వతి ఇద్దరూ అక్కడికి వెళ్తారు. మీరు భరత్ తో ప్రణతి పెళ్లి చేయడం ఇష్టపడకపోవచ్చు కానీ ఇలాంటి ఫ్రాడ్లను చేసి ప్రణతి నీ జీవితాన్ని నాశనం చేయొద్దు అని అవని అంటుంది. పార్వతి నిజం తెలుసుకుని షాక్ అవుతుంది. అత్తయ్య ఏదో పని ఉందని బయటికి వెళ్లారు వెంటనే ఆవిడ గుడికి వస్తుంది అని పల్లవి అంటుంది. పల్లవి శ్రేయ భానుమతి ముగ్గురు కలిసి గుడికి వెళ్తారు. భానుమతికి అనుమానం రావడంతో పల్లవి పూజ కోసమే మనం వెళ్తున్నామని అంటుంది..
కమల్ వచ్చి గుడికి ఇంత సడన్గా ఏంటి అని అంటాడు. మేమందరము గుడికి వెళుతున్నామని పల్లవి అంటుంది రా.. ఏదో పూజ కోసం మేము గుడికి వెళ్తున్నావు అని భానుమతి అంటుంది. అయితే కమల్కి మాత్రం అనుమానం వస్తుంది. మగ వాళ్లకు కూడా చెప్పకుండా మీరందరూ పూజ చేయాలనుకుంటున్నారా అని అడుగుతాడు. కమల్ కి అనుమానం వస్తే వదల్డని పల్లవి ఏదో ఒకటి మేనేజ్ చేసి అక్కడి నుంచి గుడికి వెళ్ళిపోతుంది.
తర్వాత భరత్ ఫ్రెండుని శ్రీకర్ చితక్కొడతాడు.. భరత్ లాంటి ఈ అబ్బాయిని మోసం చేయమని ఈ కేసులో ఇరికించమని నీకు ఎవరు చెప్పారని అడుగుతాడు.. నాకు ఒక అమ్మ ఫోన్ చేసి చెప్పింది డబ్బులకు ఆశపడి చేశాను అంతేకాదు నా కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తానని చెప్తే నేను ఈ పని చేశాను అని అంటాడు.. నీతో పాటు నటించడం అమ్మ ఎవర్రా అని అడుగుతాడు.. అమ్మాయి కూడా డబ్బుల కోసమే ఇదంతా చేసింది నేను రమ్మని చెప్తాను అని అంటే ఫోన్ చేసి మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి అని శ్రీకర్ అంటాడు.
ఇక అతను దొరికిన విషయాన్ని శ్రీకర్ అవనికి చెప్తాడు.. అయితే అవని మన ఇంటికి తీసుకురండి అని అంటుంది. శ్రీకర్ అవని రాగానే వెంటనే అతని తీసుకొని ఇంటికి వస్తాడు. అవని ఇంట్లోకి రాగానే నీ పేరు ప్రదీప్ కదా నువ్వు చాలా బెస్ట్ ఫ్రెండ్ అని భరత్ చాలాసార్లు చెప్పాడు. ఇలా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్ ని ఇలా మోసం చేయొచ్చా అని నిలదీస్తుంది. నీ వల్ల వాడు ఎన్ని మాటలు పడ్డాడో తెలుసా? మేమందరం చేయని తప్పుకి ఎంత నరకయాతన అనుభవిస్తున్నామో తెలుసా అని అడుగుతుంది.
మేము ఎక్కడ నిజం చెప్పమని అడిగితే అక్కడ నిజం చెప్పాలని అవని అడుగుతుంది. అక్షయ్ భరత తప్పు చేశాడని రెచ్చిపోయాడు కదరా ముందు వాడికి ఈ నిజం తెలిసేలా చేయాలి ఇంతకీ అక్షయ్ ఎక్కడా అని అడుగుతాడు. అయితే అక్షయ్ ఇంట్లో కనిపించడు అలాగే ప్రణతి కూడా ఇంట్లో ఉండదు.. ప్రణతిని అక్షయ్ గుడికి నమ్మించి తీసుకొని వెళ్తాడు.. అక్కడ పల్లవి వాళ్ళు గుడిలో అన్ని సిద్ధం చేసి రెడీ చేస్తారు.
అయితే పంతులుగారు ముహూర్తానికి టైం అవుతుందని పార్వతికి ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ ని కమల్ లిఫ్ట్ చేస్తాడు. పంతులు అమ్మ కోసం ఫోన్ చేశాడేంటి అని అనుమానంతో ఏమైందో తెలుసుకోవాలని అనుకుంటాడు.. నేను పార్వతి గారికి ఫోన్ ఇస్తాను మీరు లైన్లో ఉండండి అని చెప్పి కమల్ అంటాడు. ఇక పార్వతి లాగే కమల్ గొంతు మార్చి మాట్లాడతాడు. మీరు పూజకి సిద్ధం చేయమన్నారు అంతా సిద్ధం చేశాను మీరు ఇంకా రాలేదేంటి అని అంటాడు పంతులుగారు.
టైం అయిపోతుంది పెళ్లి వాళ్ళు వస్తే బాగోదు ఆడపిల్ల వాళ్ళు మీరే ముందు రావాలి త్వరగా రండి అమ్మ అని అంటుంది. ఇక అసలు విషయాన్ని తెలుసుకోవాలని పెళ్లి ఏ గుడిలోని అడుగుతాడు.. ఆ విషయం తెలుసుకొని కమల్ షాక్ అవుతాడు. వెంటనే ఈ విషయాన్ని వదినకు చెప్పాలని అంటాడు. అవని ప్రణతి అక్షయ్ కనిపించలేదని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే కమల్ అవని కి ఫోన్ చేస్తాడు.. అసలు విషయాన్నీ కమల్ అవినికి చెప్తాడు..
అమ్మ మనకు ఎవరికీ తెలియకుండా ప్రణతి పెళ్లి చెయ్యాలని అనుకుంటుంది.ఈ వీధి చివర్లోని రామాలయంలో పెళ్ళంట మీరు అక్కడికి వచ్చేసేయండి అని అంటాడు. పల్లవి భానుమతి శ్రియ గుడికి వచ్చేస్తారు.. అక్కడ ఏర్పాట్లను చూసి భానుమతికి అనుమానం వస్తుంది. ఏదో పూజ వ్రతం అని చెప్పావ్ ఇక్కడ ఏదో పెళ్లి లాగా ఉంది అని భానుమతి అడుగుతుంది. పంతులుగారు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నట్లుంది అని భానుమతి అడుగుతుంది. పల్లవి నువ్వు కాసేపు మాట్లాడకు నేనేం చేస్తున్నామో నీకు తర్వాత తెలుస్తుంది అని అంటుంది.
Also Read :మనోజ్ నోరు మూయించిన రోహిణి.. మౌనికకు అవమానం..మీనాకు తెలిసిన నిజం..
పల్లవి ఎన్నిసార్లు ఫోన్ చేసినా పార్వతి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటుంది. పార్వతి ఆటోలో టెన్షన్ గా బయలుదేరుతూ ఉంటుంది.. ఇటు అవని వాళ్ళందరూ కూడా పెళ్లి ఆపడానికి బయలుదేరుతారు.. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..