Illu Illalu Pillalu ToIlluday Episode August 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. భాగ్యం ప్లాన్ ప్రకారం.. శ్రీవల్లి వ్రతం నేను చేస్తాను అని అంటుంది. నేను మా ఆయన కూర్చుని ఈ పూజ చేస్తామండి అని అంటుంది శ్రీవల్లి. వేదవతి మాత్రం ముగ్గురు కొత్తగా పెళ్లయిన కోడళ్లే.. ఈ ముగ్గురి చేత వ్రతం చేద్దామని అనుకుంటే ఇలా జరిగింది ఏంటి అని వేదవతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ముగ్గురు కోడలు వస్తే చాలా సంతోషంగా ఉండొచ్చు అని ఎవరు అన్నారు వీళ్ళు ముగ్గురు కొట్టుకు చచ్చేలా ఉన్నారే అని టెన్షన్ పడుతూ ఉంటుంది. రామరాజుని శ్రీవల్లి మాట్లాడినవకుండా చేస్తుంది.. నేను ఇంటి పెద్దకోడల్ని, వ్రతం నా చేతులపైనే జరిపిస్తానని అడగమని చెప్తుంది. ముందుగా వేసిన పక్కా ప్లాన్ ప్రకారం శ్రీవల్లి రామరాజుని అడుగుతుంది. బుజ్జమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది.. ఈ కోడళ్లు ఏంటి పోట్ల గిత్త లాగా ముందుకు వస్తున్నారు శ్రీవల్లిని కొడతారా ఏంటి? కచ్చితంగా ఈ వ్రతం పెద్ద గొడవ లాగా సాగేలా ఉంది. ఏం జరుగుతుందో శ్రీరామచంద్ర అని వేదవతి భయపడుతూ ఉంటుంది. నర్మదా ప్లాన్ ప్రకారం చేయాలంటే కచ్చితంగా ఈ పూజను శ్రీవల్లినే చేయాలని అనుకుంటుంది.. ఆ మాట వినగానే శ్రీవల్లి భాగ్యం ఇద్దరు షాక్ అయిపోతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. వ్రతం చెయ్యాలంటే ఖచ్చితంగా నగలను పూజలు పెట్టాలని నర్మదా అంటుంది. నగల కోసం వెళ్లిన శ్రీవల్లి లోపలి నుంచి ఎంతసేపటికి బయటికి రాదు. అయితే రామరాజు మాత్రం పూజకు టైం అవుతుందని, తిరుపతిని వాళ్ళని పిలవమని అక్కడికి పంపిస్తాడు రామరాజు.. ఎప్పుడూ నాకు మొదటి నుంచి గండికోట రహస్యం లాగే కనిపిస్తున్నారు. అయిపోయింది మొత్తం అయిపోయింది నాకు కాపురం కూలిపోయింది అని వల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది.
వల్లి తన నగలని ఒక ప్లేట్లో పెట్టుకుని ముసుగేసుకుని వస్తుంది. నర్మదా ప్రేమలకు ఇద్దరికీ డౌట్ వస్తుంది.. ఆ మూసుకుని తీసి అక్క ఏంటి నగలు తీసుకురమ్మంటే కలశం తీసుకొచ్చావ్ ఏంటి అని అటు వేదవతి కూడా అడుగుతుంది.. ఆ కలశం చూసి అందరూ తలా ఒక మాట అంటారు. అయితే భాగ్యం ఇంట్లో దొంగలు పడ్డారు కదా అందుకే అమ్మాయిగారు నగలు ఆ కలశంలో వేసిందని అంటుంది. ఆ మాట వినగానే అందరికీ అనుమానం వస్తుంది.. దొంగలు అందులో చేయి పెట్టి నగలు ఎత్తుకుపోకుండా ఉండొచ్చు అని దానికి సొట్ట పెట్టాను అని భాగ్యం అంటుంది. అప్పుడే తిరుపతి ఆ చెంబు మొత్తాన్ని తీసుకెళ్లి పోతే ఏంటి పరిస్థితి అని భాగ్యాన్ని అడుగుతాడు..
కలశంలో నగలను పెట్టుకోవడం చూసి షాక్ అయినా నర్మదా ప్రేమలో ఎలాగైనా సరే ఆ నగలను బయటకు తీసుకురావాలని అనుకుంటారు. ఎంత ప్రయత్నించినా సరే ఆ నగలు బయటికి రావు. ఇంట్లోనే మగవాళ్ళు ఆడవాళ్లు అందరూ కూడా అందులో చేయి పెట్టి బయటకు తీయాలని ప్రయత్నాలు చేస్తారు. కానీ ఏ ఒక్కరికి నగలు బయటికి రావు. ఒకరికి తిరుపతి పోటుగాడిలాగా ఈ నగలను తీయాలంటే నేనే తీయాలి.. ఇదంతా పిల్ల బచ్చాలు అంటూ గొప్పోలకి పోయి తిప్పలు తెచ్చి పెట్టుకుంటాడు.
ఆ చెంబులో అతని చెయ్యి ఇరక్క పోతుంది ఇక చివరికి నర్మదా చెంబును కొయ్యాలని ఎంత అనుకున్న కూడా.. భాగ్యం మా ఇంటి నుంచి తెచ్చింది. అలా చేస్తే అపశకునం, అరిష్టమ అంటూ ఏవేవో మాటలు చెబుతుంది. ఎవరికి చెంబుల చెయ్యి పెట్టిన తిరుపతిని పూజలో కూర్చోబెట్టి పూజలు చేస్తారు.. మొత్తానికి పూజని పూర్తి చేస్తారు మన ప్లాను సక్సెస్ అయిందని శ్రీవల్లి భాగ్యం ఆనందరావు సంతోషంలో మునిగి గంతులు వేస్తుంటారు.
Also Read: ప్రణతికి సపోర్ట్ గా పార్వతి.. చెల్లెలికి హారతి ఇచ్చిన అన్నలు.. అవని పై అక్షయ సీరియస్..
ఇక నర్మద ప్రేమ ఆనందరావు వెళ్తుంటే సెల్ఫీ కావాలని ఫోటోలు దిగుతారు. ఆ ఫోటోలను పంపించుకోవడానికి నర్మదా ఫోన్ తీసుకుంటుంది.. అందులోనే ఆనందరావుకు తెలియకుండా కరెంట్ లొకేషన్ ని పంపిచ్చుకుంటుంది. ఇక వాళ్ళు బయటికి వెళ్ళగానే చిటికెలో మాయం అయిపోయారని ప్రేమా నర్మదా ఇద్దరూ అనుకుంటూ ఉంటారు. తర్వాత ఉదయం భాగ్యం ఆనందరావు ఇంటిని కాళీ చేసి వెళ్లిపోవాలని అనుకుంటారు. అయితే తలుపు తీయగానే ఎదురుగా నర్మదా ప్రేమలు అక్కడ ఉంటారు. మేము ఇంత పగడ్బందీగా ప్లాన్ చేస్తే మీరు ఎలా వచ్చారు అని ఆనందరావు అడుగుతారు. అయితే ఇలా వచ్చాము అని నర్మదా లొకేషన్ అడ్రస్ ని చూపిస్తుంది. అది చూసిన ఆనంద్ రావు భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో భాగ్యం బండారాన్ని నర్మదా రామరాజుకి చెప్పేస్తుందా? శ్రీవల్లి బాగోతం బయటపడుతుందా..? తెలియాలంటే రేపటి ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..