Indian Railways: సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కీలక ప్రకటన చేశారు. విశాఖపట్నం వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తాడి- దువ్వాడ స్టేషన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ తో పాటు ట్రాక్ పునరుద్దరణ పనుల చేస్తున్నట్లు ప్రకటించారు. నేపథ్యంలో ఆ మార్గంలో నడుస్తున్న పలు రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు తెలిపారు. అటు విశాఖ మీదుగా నడిచే పలు ఎక్స్ ప్రెస్ రైళ్లలో ప్రయాణీకుల డిమాండ్ కు అనుగుణంగా అదనపు కోచ్ లు జత చేయనున్నట్లు తెలిపారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో నడిచే పలు రైళ్లను పొడిగించినట్లు వెల్లడించారు.
రద్దు అయిన రైళ్ల వివరాలు ఇవే!
నాన్ ఇంటర్ లాకింగ్, ట్రాక్ పునరుద్దరణ పనుల్లో భాగంగా రద్దు అయిన రైళ్ల వివరాలను రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ నెల26,28,30 తేదీల్లో విశాఖ – విజయవాడ రత్నాచల్ ఎక్స్ ప్రెస్ (12717), విజయవాడ – విశాఖ రత్నాచల్ ఎక్స్ ప్రెస్ (12718), రాజమండ్రి – విశాఖ మెము ప్యాసింజర్ (67285), విశాఖ – రాజమండ్రి మెము ప్యాసింజర్ (67286), కాకినాడ – విశాఖ మెము ప్యాసింజర్ (17267), విశాఖ కాకినాడ మెము ప్యాసింజర్ (17268) రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అటు ఈ నెల 26,30 తేదీల్లో గుంటూరు – విశాఖ ఉదయ్ ఎక్స్ ప్రెస్ (22875)ను క్యాన్సిల్ చేసినట్లు తెలిపారు.
కాచిగూడ-మైసూర్ ఎక్స్ ప్రెస్ రైలు పొడిగింపు
ప్రయాణీకుల డిమాండ్ మేరకు కాచిగూడ – మైసూరు ఎక్స్ ప్రెస్ రైలు (12785, 12786)ను అశోకపురం వరకు పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కాచిగూడ- మైసూరు-కాచిగూడ మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ రైలు ఇక నుంచి కాచిగూడ-అశోకపురం-కాచిగూడ మధ్య నడపడానికి రైల్వే బోర్డు అనుమతి ఇచ్చినట్లు వివరించారు.
Read Also: నీటితో నడిచే రైలు.. ప్రయోగం సక్సెస్.. పరుగులు తీసే తొలి మార్గం ఇదే!
పలు రైళ్లకు అదనపు స్లీపర్ బోగీలు
ఇక ప్రయాణీకుల నుంచి డిమాండ్ పెరుడుతున్న నేపథ్యంలో పలు రైళ్లకు అదనపు స్లీపర్ బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 23 నుంచి హైదరాబాద్-సీఎస్టీ ముంబై (22731), 26 నుంచి సీఎస్టీ ముంబై-హైదరాబాద్ (22732), 24 నుంచి సీఎస్టీ ముంబై-హైద రాబాద్ (12701), 25 నుంచి హైదరాబాద్-సీఎస్టీ ముంబై(12702) రైళ్లకు అదనంగా రెండు స్లీపర్ కోచ్ లను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. 23 నుంచి సికింద్రాబాద్-భువనేశ్వర్ (17016), 25 నుంచి భువనేశ్వర్-సికింద్రాబాద్ (17015) రైళ్లకు అదనంగా మూడు స్లీపర్ కోచ్‌లను జత చేయనున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. మధ్య తరగతి ప్రయాణీకులకు అనుగుణంగా ఈ బోగీలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ప్రయాణీకులు ఇకపై మరింత సౌకర్యవంతంగా ప్రయాణం చేసే అవకాశం ఉందన్నారు.
Read Also: 2.5 కోట్ల IRCTC యూజర్ ఐడీలు ఔట్, మీ అకౌంట్ ఉందో లేదో చెక్ చేసుకోండి!