Intinti Ramayanam Today Episode july 26th : నిన్నటి ఎపిసోడ్ లో.. కమల్ అన్నట్లే కాసేపట్లో భానుమతి ఎదురుగా కమలాకర్ వచ్చి నిలబడతాడు. అక్షయ అవనీల గురించి అడిగి ఒళ్ళు వాయించేస్తాడు. వాళ్ళిద్దరూ కలిసేలా చేయమని చెప్పాను కదా మరి దూర దూరంగా ఉన్నారు అంటావేంటి అని దారుణంగా కొట్టేస్తాడు. అక్షయ దగ్గరికి ఆరాధ్య వచ్చి అమ్మానాన్న కూడా దండలు మార్చుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను నాన్న అని అంటుంది. ఆ మాట వినగానే అక్షయ్ అవని పై సీరియస్ అవుతాడు. నువ్వు నాతో మాట్లాడే దైర్యం లేక చిన్నపిల్ల చేత చెప్పిస్తావా..? ఆ పిల్ల ఏమంటుందో తెలుసా ఈ వయసులోనే అన్ని మాటలు ఎలా వచ్చాయి నువ్వు నేర్పించినవే కదా అని అక్షయ్ సీరియస్ అవుతాడు. చిన్నపిల్లల చేత చెప్పించే అంత మూర్ఖురాలిని నేనైతే కాదు. నువ్వు కచ్చితంగా ఏది అనుకుంటే అది చేసే చూపిస్తాను. ఆ ధైర్యం నాకుంది. ఆరాధ్య కోసం మీరు కోర్టుకెళ్లినట్టు నేను కూడా కోర్టుకెళ్ళి ఉండేదాన్ని.. కుటుంబం కోసం ఆలోచిస్తున్నా.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పార్వతి టెన్షన్ పడుతూ ఉంటుంది. మీరు ఫంక్షన్ అయిపోయేంత వరకు పెళ్లి సంబంధం గురించి ఎవరికీ చెప్పకండి అవని గురించి మీకు తెలుసు కదా? నాకు మాట ఇవ్వండి అని పల్లవి అడుగుతుంది.. పార్వతి పల్లవి కోరిక మేరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పను అంటుంది. మాట ఇస్తుంది. ప్రణతి ఇంకా రెడీ అవ్వలేదు ఏంటి ఫంక్షన్ కి రావట్లేదా అని అడుగుతుంది.. ఆ ఇంటికి రావాలంటే భయంగా ఉంది వదిన. అందుకే రెడీ అవ్వలేదు అని అంటుంది. నాకు అందరి మీద కన్నా నీ మీద నమ్మకం ఎక్కువ వదినా.. నాకు భరత్ నుంచి పెళ్లి చేస్తానని మాటీవీ వదిన అని అడుగుతుంది. అవని మాటిస్తున్నాను కచ్చితంగా మీ పెళ్లి జరుగుతుంది అని అంటుంది. అందరూ కలిసి క్యాబ్లో వెళ్తారు.
అయితే అక్షయ్ మాత్రం.. నేను మీతో వస్తానని అనుకోవద్దు. నేను వేరేగా వస్తాను మీరు వెళ్ళండి అని అంటాడు. మేమిద్దరం బండి మీద వస్తాము బట్టలు తీసుకుని వస్తాము అని అక్షయ్ అవని అంటారు. అందరూ రాజేంద్రప్రసాద్ పాత ఇంటికి వెళ్తారు. రాజేంద్రప్రసాద్ ఆ ఇంటి గుమ్మం బయట నిలబడి ఇంట్లో జరిగిన అవమానాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కమల్ ను ఆరాధ్య పిలుస్తుంది. అమ్మ నాన్న వాళ్ళు వచ్చారు రండి అని పిలుస్తాడు కమల్.
రాజేంద్రప్రసాద్ నీ చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకొని వెళుతుంది పార్వతి. అయితే ఇంట్లోకి వెళ్ళగానే రాజన్న ప్రసాద్ ఇంటిని వింతగా చూస్తూ ఉంటాడు. పార్వతి మీకోసం కాఫీ తీసుకుని వచ్చాను అని తీసుకోండి అని అడుగుతుంది. బాగున్నానండి. రాజేంద్రప్రసాద్ మాత్రం కాఫీ నాకొద్దు అని అంటాడు. మీరు ఇన్ని రోజులు నాకు దూరంగా ఉన్నారు కదా నా చేత్తో కాఫీ ఇచ్చి చాలా రోజులైంది ఈ కాఫీ తీసుకోండి అని అడుగుతుంది.. ఒక భార్య తన భర్తకి దూరంగా ఉంటుంది ఆ విషయాన్ని నువ్వు మర్చి పోతున్నట్టు ఉన్నావ్.
మీరు మాట్లాడేది అవని గురించి కదా.. చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత అని రాజేంద్రప్రసాద్ అంటాడు. ఇక శ్రీకర్ కమల్ వచ్చి ఆ కాఫీని తాగండి నాన్న అమ్మ ఎంతో ప్రేమగా తీసుకచించింది కదా అని అంటారు.. మీరిద్దరూ ఇలా సంతోషంగా కాఫీ ని పంచుకుంటే చూడాలనిపిస్తుంది. మీరిద్దరూ కాఫీ ని పంచుకోండి అని అడుగుతారు. కొడుకుల కోరిక మేరకు రాజేంద్రప్రసాద్ పార్వతి ఇద్దరూ కాఫీ పంచుకొని తాగుతారు. మీరిద్దరి ఇంత సంతోషంగా ఉంటే మాకు చూడాలనిపిస్తుంది అని అంటారు.
అవని బట్టల షాప్ కెళ్ళి తీసుకొని వస్తూ ఉంటే ఎదురుగా పక్క వీధి వాళ్ళు వచ్చి ఆమెను అల్లరి చేసే పని చేస్తారు.. ఈ వయసులో నువ్వు భర్తకు దూరంగా ఉన్నావు అనుకుంటా మా తోడు నీకు కావాలనుకుంటా.. నువ్వు అను నీకు స్వర్గాన్ని చూపిస్తామని అవన్నీ తో పిచ్చిపిచ్చిగా మాట్లాడతారు.. ఏంటి పిచ్చి పట్టిందా ఏం మాట్లాడుతున్నావ్ రా అని అవని కొట్టబోతుంటే వాడు చేయి పట్టుకుంటాడు. ఆ దృశ్యాన్ని చూసిన అక్షయ్ నా భార్య చేయి పట్టుకుంటావా నువ్వు అని వాడిపై రెచ్చిపోతాడు.
Also Read: రోహిణికి శృతి క్లాస్.. ప్రభావతికి దిమ్మతిరిగే షాక్.. మీనాపై రోహిణి రివేంజ్..
అక్షయ్ నా భార్య చేయ పట్టుకుంటారా మీరు అని వాళ్ళని చితగ్గొట్టేస్తాడు. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏమో అనుకున్నాను నామీద మీకు ప్రేమ ఉందన్నమాట అని అవని వెటకారంగా మాట్లాడుతుంది.. ఇద్దరు కలిసి ఫంక్షన్ కి బయలుదేరుతారు. పార్వతి ఇంటికి చక్రధర్ రావడం చూసి కమల్ శ్రీకర్ ఇద్దరు నిన్ను ఎవరు పిలిచారు? నువ్వు ఎందుకు వచ్చావు? మా ఇంటికి? పిలువని పేరంటానికి రావాల్సిన అవసరం నాకు లేదు మీ అమ్మ రమ్మని పిలిస్తేనే నేను వచ్చాను అని చక్రధర్ అంటాడు. ఫంక్షన్ స్టార్ట్ అవ్వకముందే గొడవ ఎలా ఉంది అని పల్లవి పార్వతితో చెబుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..