Intinti Ramayanam Today Episode April 4th : నిన్నటి ఎపిసోడ్ లో.. కమల్ భానుమతి పల్లవిలకు మధ్య ఫిట్టింగ్ పెడతాడు. పల్లవిని భానుమతి నా మొగుడు ఫోటో ఎందుకు తీసావ్ అంటూ చితక్కొట్టేస్తుంది. పెద్ద దానివని ఊరుకుంటున్నా అని పల్లవి అంటుంది. నన్ను కొట్టేంత పెద్ద దానివి నువ్వు అనేసి ఇద్దరు ఒకరినొకరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు. కమల్ మాత్రం వీళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటాడు. నేను వేసిన ప్లాను ఇంత బాగా వర్క్ అవుతుందని అని అస్సలు అనుకోలేదు అని అంటారు.. ఆ తర్వాత కమ్మలు వీళ్లిద్దరు చేసిందానికి బాగా తిక్క కుదిరిందని అంటాడు. ప్రణతి మాత్రం అవని వదిన అవమానాలు పడుతుందని బాధపడుతూ ఉంటుంది. అక్షయ్ ఆఫీసులో కొత్త స్టాక్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక అవని ఆఫీస్కు రావడం చూసి షాక్ అవుతాడు. అందరూ చెయ్యికి ఏమైందని అడుగుతారు. అవని మాత్రం అసలు నిజం చెప్పకుండా చిన్న యాక్సిడెంట్ జరిగిందని ఆఫీసులోని స్టాఫ్ తో అంటుంది. యాక్సిడెంట్ అయితే మీరు అతని పట్టుకున్నారా? మీకు యాక్సిడెంట్ చేశాడు అంటే వాడికి ఎంత ధైర్యం ఉండాలి మీకు ఇప్పుడు ఎలా ఉంది మేడం మన అందరూ అడుగుతారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా అని అవనిని అడుగుతారు. కానీ అవని మాత్రం చిన్న యాక్సిడెంట్ నాదే పొరపాటు కింద పడ్డాను అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రణతిని మంచిగా చూసుకోవాలని అవనికి డబ్బులు ఇవ్వబోతాడు. ఈ డబ్బులు ఎందుకు అని అవని అడుగుతుంది. మా చెల్లెలు ప్రెగ్నెంట్ నీ దగ్గర ఇప్పుడు ఉంటుంది కాబట్టి తనకి మంచి హెల్తీ ఫుడ్ పెట్టాలి అందుకే నేను ఈ డబ్బులు ఇస్తున్నానని అక్షయ్ అంటాడు. నేను ఇవ్వడం ఎందుకు మీరే వచ్చి మీ చెల్లెలుకు డబ్బులు ఇవ్వచ్చు కదా అనేసి ఆవని అంటుంది. ఇక ఆ విషయం ప్రణతితో అవని చెప్తుంది. మీ అన్నయ్య నీకోసం చూడ్డానికి వస్తాడు నువ్వు మంచిగా మాట్లాడు అనేసి అంటుంది. నేను చేసిన పాయసం అంటే మీ అన్నయ్యకు చాలా ఇష్టం ఇది నేను చేశాను అని కాకుండా అసలు నేను ఇంట్లో ఉన్నాను అని కూడా కాకుండా నువ్వు చూసుకోవాలని ప్రణతితో అంటుంది. ప్రణతి తన అన్నని ఇంట్లోకి తీసుకెళ్తుంది.
ఇక అవని చేసిన పాయసాన్ని ప్రణతి అక్షయ్కిస్తుంది. ఆ పాయసం తిని ఇది అవని చేసింది కదా నేను నా చెల్లెలు కోసం వచ్చాను మళ్లీ నీ ప్రేమలు నటించాలని అనుకుంటున్నావా అని అంటుంది. నువ్వంటే ఎప్పటికీ నా మనసులో ప్రేమ లేదు అని అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పల్లవి అవని ఇంటికి తీసుకొచ్చి శాశ్వతంగా ఇంటి నుంచి దూరం చేయాలని అనుకుంటుంది. పార్వతికి ఈ విషయం చెప్పి ఎలాగైనా ఒప్పించాలని అనుకుంటుంది.
ఇక ఇంట్లోని వాళ్ళందరూ ఒకచోట కూర్చుని బాధపడుతూ ఉంటారు ఇందంతా గద్దర్గోలగా మారింది. ఈ గొడవలు ఏంటో అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటారు.. రాజేంద్రప్రసాద్ అక్షయ్ఎప్పుడు వస్తున్నాడో తెలియట్లేదు ఆరాధ్య మనసు అస్సలు బాగోలేదు. మనం పలకరిస్తే తప్ప తాను వచ్చి పలకరించడం అందరితో సరదాగా నవ్వుతూ మాట్లాడటం చేయడం లేదు. తన కోసమైనా నేను ఇక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నానని రాజేందర్ ప్రసాద్ అంటాడు. మళ్లీ ఇండ్లు ముందులాగా మారాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తాడు.
దానికి పల్లవి అవని అక్కని క్షమించి ఇంటికి తీసుకొస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి మావయ్య ప్రణతి కూడా ఇంటికి వచ్చేస్తుంది కదా మన కళ్ళ ముందే ఉంటుంది కదా అనేసి అంటుంది. అప్పుడే అక్షయ్ ఇంటికి వస్తాడు. ఎక్కడికెళ్లావ్ రా ఇంతవరకు ఆలస్యమైంది ఏంటి అని పార్వతి అడుగుతుంది. ప్రణతిని చూడడానికి వెళ్ళాను అమ్మ అని అక్షయ్ అనగానే అందరూ షాక్ అవుతారు. మనల్ని కాదనుకుని వెళ్లిపోయిన దానికోసం నువ్వు ఎందుకు వెళ్లావు రా అని భానుమతి అడుగుతుంది. మనల్ని కాదనుకొని వెళ్ళిపోతే మనం వదిలేస్తామా అది మన చెల్లెలు కదా దాన్ని ఎంత ప్రేమగా చూసుకున్నామని అందరికీ అక్షయ అంటాడు.
అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చానని రాజేంద్రప్రసాద్ అంటారు.. అవని నీ మళ్లి ఇంటికి తీసుకురావాలని అనుకుంటున్నామని అక్షయ్ తో అంటాడు. ఆ మాట వినగానే అందరూ సంతోషిస్తారు ఇక పల్లవి ఆ మాట చెప్పగానే కమల్ చాలా సంతోష పడతాడు. పల్లవి దగ్గరికి వెళ్లి నువ్వేనా ఇలా మాట్లాడుతుందని షాక్ అవుతారు. అక్షయ దగ్గరికి ఆరాధ్య వచ్చి నిజంగానే అమ్మ ఇంటికి వస్తుందని అడుగుతుంది దానికి అక్షయ్ అనగానే ఆరాధ్య సంతోషపడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో కమల్ అవనీ దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి