BigTV English

H1B visa Alert : దేశం విడిచి పెట్టి వెళ్లొద్దు.. హెచ్‌1బీ వీసాదారులకు హెచ్చరిక

H1B visa Alert : దేశం విడిచి పెట్టి వెళ్లొద్దు.. హెచ్‌1బీ వీసాదారులకు హెచ్చరిక

H1B visa Alert : ప్రపంచ వ్యాప్తంగా నలబైమూడు దేశాలకు చెందిన పౌరులు అమెరికాలోకి రాకుండా నిషేధం విధించాలని డొనాల్డ్ ట్రంప్ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ కంపెనీలు హెచ్ 1బీ వీసా ఉద్యోగుల్ని అప్రమత్తం చేశాయి. ట్రంప్ ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలకు భయపడి దేశాన్ని విడిచి వెళతారేమో.. ఆ పనిచేయొద్దని సూచిస్తున్నాయి. అమెరికా వీడే హెచ్ 1బీ వీసా దారులు భవిష్యత్‌లో తిరిగి ఇక్కడకి రావడం గానీ, రాదు గానీ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశాయి.


వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. అమెరికాలో దిగ్గజ టెక్ కంపెనీలు అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్ ఐటీ కంపెనీలు తమ హెచ్ 1బీ వీసా ఉద్యోగుల్ని అలెర్ట్ చేశారు. దేశాన్ని విడిచి వెళ్లే ప్రయత్నం చేయొద్దని సూచించాయి. అమెరికా వదలిసే వారు తమ సొంత దేశాలకు వెళితే.. అలాంటి వారిని అమెరికా ఆహ్వానించకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ హైలైట్ చేసింది.

అయితే, హెచ్ 1బీ వీసాల విషయంలో కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుపై భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనితో పాటు, జన్మత: పౌరసత్వాన్ని రద్దు అమలైతే.. వారి పిల్లలకు ఏ దేశంలోనూ పౌరసత్వం లేకుండా పోయే అవకాశం ఉండదనే ఆందోళన చెందుతున్నారు. అమెరికా పౌరసత్వం లేకపోతే, అమెరికాలో అక్రమంగా ఉన్నట్లే కదా అని మాట్లాడుతున్నారు.


ఇటీవల అమెరికా వలస విభాగం అధికారులు కీలక అడ్వైజరీ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎఫ్-1, గ్రీన్‌కార్డు, హెచ్-1బీ వీసా అనుమతులు కలిగిన భారతీయులు ప్రయాణాల్లో అప్రమత్తత పాటించాలని నిపుణులు సూచించారు. ఇతర దేశాల నుంచి అమెరికాలోకి ప్రవేశించే సమయంలో లేదా స్వదేశాలకు స్వల్ప కాలం తిరిగి వెళ్లాలను కునేవారు.. రాకపోకల సమయంలో ఎక్కువగా తనిఖీలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందరూ సహనంగా ఉండాలని పేర్కొన్నారు. విదేశాల్లో ఎక్కువ కాలం ఉండి అమెరికాకు తిరిగొచ్చే వలసదారులు కస్టమ్స్, బార్డర్ అధికారులు అడిగే సుదీర్ఘ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.

Also Read:  వాంతులు, విరోచనాలు.. మరో వైరస్ కలకలం.. బీ అలర్ట్

వలసదారులంతా తమ వద్ద అన్ని దస్తావేజులు పెట్టుకోవాలని సూచన చేశారు. స్వదేశీ పాస్‌పోర్టుతో పాటు వీసా, ఇతర పత్రాలను ఎల్లప్పుడూ అందుబాటులోకి పెట్టుకోవాలని, చెకింగ్ జరిగిన సమయంలో వెంటనే చూపించాలని సూచించారు. రీఎంట్రీ పర్మిట్, ఎంప్లాయ్‌మెంట్‌ వెరిఫికేషన్‌ లెటర్, ఫెడరల్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చెల్లింపులు, గ్రీన్‌కార్డు, వీసా, వేతన స్లిప్పుల వంటి పత్రాలను ప్రభుత్వ అధికారులు తనిఖీ చేసిన సమయంలో చూపించేందుకు సరి చూసుకోవాలని పేర్కొన్నారు. విదేశీ విద్యార్థులైతే సంబంధిత యూనివర్సిటీ లేదా కళాశాల ఇచ్చిన అనుమతి పత్రంతోపాటు, అమెరికా బ్యాంకులో ఉన్న తమ ఖాతా వివరాల వంటివి ధృవీకరణంగా చూపించాలని పేర్కొన్నారు.

అమెరికా ప్రభుత్వం హెచ్ 1బీ ప్రోగ్రామ్ కింద ప్రతి ఏడాది లాటరీ సిస్టం ద్వారా 65,000 వీసాలను విదేశీయులకు అందిస్తుంది. ఈ వీసా ఉన్న ఉద్యోగులు అమెరికాలో ఉన్నత ఉద్యోగులు, ఆ దేశం ఆర్థికంగా వృద్ధి సాధించేందుకు దోహదం చేస్తుంటారు. ఈ వీసా ఎక్కువ మంది భారతీయులకు ఇవ్వగా ఆ తర్వాతి స్థానాల్లో చైనా, కెనడా పౌరులకు అందిస్తుంది. హెచ్ 1బీ వీసా దారుల్ని అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, యాపిల్ కంపెనీలు నియమించుకోవడంలో ముందంజలో ఉన్నాయి. ట్రంప్ కఠినమైన వీసా నియమాల్ని అమలు చేయడం వల్లే ఏర్పడిన అనిశ్చితితో హెచ్ 1బీ వీసా దారులు మరిన్ని కష్టాల్ని ఎదుర్కోనున్నట్లు నివేదకలు తెలిపారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×