E-Paper
Advertisement

రోజుకు రూ.7.60లక్షలు.. బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న కంటెస్టెంట్?

రోజుకు రూ.7.60లక్షలు.. బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న కంటెస్టెంట్?
Advertisement

Bigg Boss: కనీవినీ ఎరుగని రీతిలో బిగ్ బాస్ చరిత్రలోనే ఒక్కో రోజుకు ఏకంగా రూ.7.60 లక్షలు రెమ్యునరేషన్ అందుకోవడం ఒక ఎత్తు అయితే .. సెలబ్రిటీలను మించి ఒక కామనర్ ఈ రేంజ్ రెమ్యూనరేషన్ అందుకొని చరిత్ర సృష్టించడం మరో విశేషం. పదేళ్ల బిగ్ బాస్ చరిత్రలో ఇలాంటి సంచలనం సృష్టించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆయన ఎవరో కాదు మిథిలేష్ రెడ్డి (Mithilesh Reddy).

ఆటలో సవాల్ కాదు ఆటే సవాల్..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభం కాకముందే ఆటలో సవాల్ కాదు ఆటే సవాల్ అంటూ హోస్ట్ నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఊహించని మలుపులు, నాటకీయ పరిణామాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మొదటి రోజు నుంచి గొడవలతో రచ్చ సాగుతూ అటు కంటెస్టెంట్స్ కూడా మొదటి రోజు నుంచే తమ స్ట్రాటజీలతో గేమ్ ప్లే చేస్తున్నారు.

బిగ్ బాస్ చరిత్రలో అరుదైన రికార్డు..

Advertisement

ముఖ్యంగా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అపూర్వ , మిథిలేష్ అడుగుపెట్టారు. ఎంట్రీ తోనే కంటెస్టెంట్స్ ను తమ మాటలతో కడిగిపారేశారు. ఇక హౌస్ లోకి వచ్చిన రెండవ రోజే ఏకంగా 15 లక్షలు తీసుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి మిథిలేష్ బయటకు రావడం సంచలనంగా మారింది. అటు టెలివిజన్ వర్గాలలోనూ .. ఇటు సోషల్ మీడియాలోనూ ఈ విషయం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది కేవలం రెండు రోజుల్లోనే ఆయన సాధించిన ఈ సంపాదన బిగ్ బాస్ చరిత్రలోనే అరుదైన మైలురాయి అని చెప్పవచ్చు.

రెండు రోజుల్లోనే రూ.15.20లక్షలు..

సాధారణంగా వారానికి రూ.1లక్ష నుండి రూ.4 లక్షల వరకు సెలబ్రిటీల డిమాండ్ ను బట్టి రెమ్యూనరేషన్ చెల్లిస్తూ ఉంటారు. అలాంటిది బిగ్ బాస్ నిర్వాహకులు ఆఫర్ చేసిన క్రేజీ డీల్ ను స్వీకరించి, కేవలం రెండు రోజులు హౌస్ లో ఉన్నందుకు మిథిలేష్ ఏకంగా రూ.15 లక్షల నగదు తో బయటకు వచ్చారు. దీన్ని బట్టి చూస్తే హౌస్ లో గడిపిన ప్రతి రోజుకు లభించిన పారితోషకం అక్షరాల ఏడున్నర లక్షల పైమాటే.

Advertisement

also read: 2027 అసలైన పొంగల్ వార్.. లిస్టులో చేరిన రజనీకాంత్!

ఎంతోమంది ప్రముఖ సెలబ్రిటీలు వారాల తరబడి హౌస్ లో కష్టపడి సంపాదించిన మొత్తాన్ని మిథిలేష్ కేవలం 48 గంటల్లోనే దక్కించుకోవడం అంటే నిజంగా ఇదొక రికార్డు అని చెప్పాలి. ఇకపోతే మిథిలేష్ కి బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ రూ.15 లక్షలతో పాటు కామనర్ కంటెస్టెంట్ కావడంతో వారానికి రూ.70,000 చొప్పున హౌస్ లోకి అడుగుపెట్టాడు. అంటే రోజుకు పదివేల చొప్పున ఆయనకు రెండు రోజులకు 20,000 లభించింది. దీన్ని బట్టి చూస్తే సగటున మొత్తంగా 7.6 లక్షలు అందుకున్నట్లే .. ఏది ఏమైనా అతి తక్కువ సమయంలో ఇంత మొత్తం సంపాదించడం మిథిలేష్ అసలైన స్ట్రాటజీ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Related News

మిథిలేష్ స్మార్ట్ స్ట్రాటజీ.. రామ్ ప్రసాద్ గేమ్ స్టార్ట్ చేశాడా?

కాలికి గాయంతో నటి ప్రియ..నెటిజన్స్ కి రిక్వెస్ట్.. అసలేమైందంటే?

విడాకుల దిశగా బుల్లితెర నటి.. అసలేమైందంటే?

Podarillu Today Episode : గోపికను అవైడ్ చేస్తున్న చక్రీ.. సత్య మాటతో షాక్..నారాయణకు సీరియస్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం.. భానుమతి.. పార్వతికి నిజం తెలుస్తుందా..? పల్లవికి షాక్..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు నిజం చెప్పిన సుమతి.. బాలు మాస్టర్ ప్లాన్.. చింతామణికి షాక్..

Nindu Noorella Saavasam Serial Today Episode September 27th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  వీరు, ఇషికలను అనుమానించిన మిస్సమ్మలోని ఆరు  

Big Stories

Advertisement
×