Gundeninda GudiGantalu Today episode August 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ అందరికి వార్నింగ్ ఇస్తూ నోరు జారి అసలు నిజాన్ని బయట పెట్టేస్తాడు. అదేంటి రోహిణి మీ నాన్న నీ అకౌంట్లో డబ్బులు వేయాలి కానీ ఇలా మనోజ్ అకౌంట్లో డబ్బులు వేయడమేంటి అని శృతి అడుగుతుంది. రోహిణి ఈ ప్రశ్నలు తట్టుకోలేక ఏంటంటే ఇదంతా అని అడుగుతుంది. వదిలేయమ్మా వాడి పుట్టింటి నుంచి వాడికి డబ్బులు రాలేదు కదా అందుకే ఇలా కుళ్ళు కుంటున్నాడు అని ప్రభావతి అంటుంది. ఆ మాటకు మీనా బాలు కోపంతో రగిలిపోతారు. సత్యం ఈ గొడవలు రోజు ఉండేవే ఇక ఆపండి అని అంటాడు. గదిలోకి వెళ్లిన రోహిణి, మనోజ్ ఇద్దరు మరోసారి గొడవపడతారు..మనోజ్ ఈ విషయాన్ని నువ్వు చెప్పేస్తే వాళ్ళు డబ్బులు లాగేసుకుంటారు. మీనాకు వార్నింగ్ ఇస్తే బాలు మన జోలికి రాడు అంటుంది. రోహిణి నీ భర్తను కంట్రోల్ లో పెట్టుకో అని మీనాకు వార్నింగ్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రోహిణి అన్నమాట సీరియస్ అయినా మీనా బాలుకి పెద్ద క్లాస్ పీకుతుంది. ఎవరు ఎలా పోతే నీకెందుకు మీరెందుకు అలా రియాక్ట్ అవుతున్నారు అని నేను అంటుంది. ఇక పూలు డెలివరీ చేయడానికి అర్ధరాత్రి బయటకు వెళ్తుంది. పార్టీలో సంజయ్ అన్న మాటకు బాధపడిన మౌనిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. మౌనిక సంజయ్ అన్న మాటలకు కన్నీళ్లు పెట్టుకుంటూ ఒంటరిగా రోడ్డు మీద నడుస్తూ వస్తుంది. వెనకాల లారీ వస్తున్న సంగతి కూడా గమనించకుండా మౌనిక రోడ్డుపై నడుచుకుంటూ రావడం చూసిన మీనా మౌనికను పక్కకు లాగేస్తుంది. అసలు ఏమైంది మౌనిక అర్ధరాత్రి పూట నువ్వేంటి రోడ్డు మీద నా ఒళ్ళు తెలియకుండా నడుస్తున్నామని మీనా అడుగుతుంది. మౌనిక అసలు విషయం మీనాకు చెప్పేస్తుంది.
మౌనిక అబద్దం చెప్పలేకపోతుంది సంజయ్ పెడుతున్న బాధల గురించి మీనా విని బాధపడుతుంది.. మీనా ఇన్ని రోజులు ఈ బాధని నీలోనే దాచుకున్నావా.. అలాంటి వాడితో నువ్వు ఎలా కాపురం చేస్తున్నావని అడుగుతుంది. మారతాడని అనుకున్నాను కానీ మారలేదు. మౌనిక చెప్పిన మాటలు విని మీనా షాక్ అవుతుంది. వాడి వల్ల నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటున్నావని మీ అన్నయ్యకు తెలిస్తే వాడిని అసలు బతకనివ్వడు అని మీనా అంటుంది.
తొందరపడి నువ్వు అన్నయ్యకు చెప్పద్దు వదిన నేను మార్చుకుంటాను అని మౌనిక అంటుంది. నీకంటూ కన్నీళ్లు వస్తున్నాయని తెలిస్తే దానికి కారణమైన వారిని మీ అన్నయ్య బతకనివ్వడు ఇది గుర్తుపెట్టుకో ఇంకొకసారి నువ్వు ఇలా కనిపిస్తే మీ అన్నయ్యకి కచ్చితంగా చెప్తాను అని నేను అంటుంది.. మౌనిక ఇంకా ఇంటికి రాలేదని సంజయ్ పుట్టింటికి వెళ్ళిపోయింది ఏమో అని ఆనందంతో ఉంటాడు అప్పుడే మౌనిక ఇంటికి వస్తుంది. సంజయ్ మాత్రం దారుణంగా అవమానిస్తాడు.
అటు రోహిణి 45 లక్షలు వచ్చిన విషయాన్ని విజ్జికి చెప్తుంది.. ఆ కల్పనాన్ని చూసి మా ఆయన బెండ్ అయ్యాడు కానీ నేను మధ్యలో సరి చేసాను అని రోహిణి అంటుంది. ఆ కల్పన ఎంత మోసగత్తె మనోజ్ మోసం చేసింది అని అంటుంది రోహిణి. మీ మనోజ్ ఏమన్నా మంచోడా ఏంటి అని బిజీ సెటైర్లు ఇస్తుంది.. అయితే మొత్తానికైతే అలా 45 లక్షల నీకు వచ్చేసేయ్ అనమాట అని విజ్జి అంటుంది. ఆ సమస్య దగ్గర నీకు ఈ సమస్య మాత్రం తగ్గేటట్లు లేదు అని ఎదురుగా ఉన్న దిలీప్ ని చూపిస్తుంది విజ్జి..
దిలీప్ మాత్రం నాకు లక్ష రూపాయలు కావాలి నేను అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి రేపటికల్లా అరేంజ్ చేసుకో కళ్యాణి అని హెచ్చరించి వెళ్తాడు.. ఒకవేళ అరేంజ్ చేసుకోకపోతే నీ బండారం మొత్తం మీ అత్త అంటాడు. అదేంటి నువ్వు ఇన్ని రోజులు అని భరిస్తున్నావు ఎదిరిస్తే సరిపోతుంది కదా అని అంటుంది విజ్జి. ఇప్పుడు నేను లక్ష రూపాయలు తాగకపోతే వాడు రెండు లక్షలు అంటాడు అవసరమా అని నోరు మూసుకొని ఉన్నాను. ఎలాగైనా సరే ఈ లక్ష రూపాయలు ఎలా తీసుకొచ్చి వాడి మొహం కొట్టాలని ఆలోచిస్తున్నా అని రోహిణి.
Also Read: మూవీ లవర్స్ కు జాతరే.. ఒక్కరోజు ఓటీటీలోకి 26 సినిమాలు..!
ఇంటికి వెళ్ళిన రోహిణి మనోజ్ దగ్గర లక్ష రూపాయలు ఎలాగైనా తీసుకోవాలని అనుకుంటుంది.. మోసం చేసి ఏదోలాగా లక్ష రూపాయలు తీసుకుంటుంది. ఇది వెంటనే ఆ దిలీప్ మోహన్ కొట్టేస్తే నాకు ఈ బాధ ఉండదు అని అనుకుంటుంది.. మీనా పూలను డెలివరీ ఇవ్వడానికి వెళ్లి రావడం లేట్ అవ్వడంతో బాలు మీనా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏంటి ఇంకా నువ్వు రాలేదని వెయిట్ చేస్తున్నాను ఏమైనా గొడవ జరిగిందా అలా డల్ గా ఉన్నావేంటి అని అడుగుతాడు. నేను బాగానే ఉన్నానండి నేను అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..