Bandlaguda Incident: రామాంతపూర్ శ్రీకృష్ణుడి ఊరేగింపు దుర్ఘటన జరిగి ఒక్క రోజు కాకముందే.. ఓల్డ్ సిటీ బండ్లగూడలో అలాంటి ఘటనే మరొకటి జరిగింది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తరలిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే..
గణేష్ చతుర్థి సందర్భంగా, బండ్లగూడ ప్రాంతంలో గణేష్ విగ్రహాన్ని ఒక వాహనంలో మండపానికి తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. విగ్రహాన్ని రవాణా చేస్తున్న బృందం, మండప నిర్మాణంలో భాగంగా ఉపయోగించే లోహ రాడ్ లేదా ఇతర నిర్మాణ సామగ్రి అనుకోకుండా ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలను తాకడంతో విద్యుత్ షాక్ సంభవించినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించిన స్థానికులు
అయితే గాయపడినవారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స కొనసాగుతోంది. ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. వారిని అఖిల్, వికాస్‌గా గుర్తించారు. మరో పలువురికి స్వల్ప గాయాలు అయినట్లు తెలిపారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు.
Also Read: బాబుకు ఝలక్! ఆళ్ల నాని వైసీపీలోకి వెళ్తున్నాడా?
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
విషయం తెలుసుకున్న బండ్లగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి కారణం విద్యుత్ తీగలతో సంబంధం ఉన్న నిర్లక్ష్యం కావచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు స్థానిక విద్యుత్ శాఖ అధికారులతో కలిసి, ఓవర్‌హెడ్ విద్యుత్ తీగల భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తున్నారు. అలాగే, ఈ ఘటనలో నిర్వాహకుల నిర్లక్ష్యం ఉందా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది.
హైదరాబాద్ బండ్లగూడలో వినాయక విగ్రహ ఘటనపై విద్యుత్ శాఖ క్లారిటీ
హైదరాబాద్‌లో బండ్లగూడలో వినాయక విగ్రహ తరలింపు సమయంలో ఇద్దరు కరెంట్ షాక్‌తో చనిపోవడం నిజం కాదని విద్యుత్ శాఖ ప్రకటించింది. వారు వాహనంపై నుంచి కింద పడి చనిపోయారని.. కరెంట్ షాక్ తో కాదని వివరణ ఇచ్చింది. విద్యుత్ అధికారులు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. విద్యుత్ వల్లే చనిపోయినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవన్నారు సూపరింటెండింగ్ ఇంజనీర్. ట్రాలీ మీద వున్న వ్యక్తులు కింద పడటం వల్లే తీవ్ర గాయాలయ్యాయని.. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.. ఘటనా ప్రాంతంలో 33 కెవి విద్యుత్ లైన్ తెగడం గాని వేళాడడం గాని జరగలేదని.. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం లేదని స్పష్టంగా చెప్పింది. సంఘటన ప్రదేశాన్ని విద్యుత్ శాఖ SE, రాజేంద్రనగర్ శ్రీ రామ్ మోహన్. పరిశీలించారు. ట్రాలీపై తరలిస్తున్న వినాయకుడి విగ్రహం ఎత్తు 23 అడుగులు. కరెంటు తీగలు తాకడం వల్లే ఇద్దరని చనిపోయారన్న ప్రచారంలో నిజం లేదని వివరణ ఇచ్చారు.
హైదరాబాద్‌లో మరో విషాదం
గణేష్ విగ్రహాన్ని మండపానికి తరలిస్తున్న సమయంలో ప్రమాదం
విద్యుత్ షాక్ తగిలి ఇద్దరికి తీవ్ర గాయాలు.. పలువురికి గాయాలు
గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలింపు.. కొనసాగుతున్న చికిత్స
పాతబస్తీ-బండ్లగూడలో చోటు చేసుకున్న ఘటన
ఘటనాస్థలికి చేరుకొని, కేసు… pic.twitter.com/d650Pxj4oM
— BIG TV Breaking News (@bigtvtelugu) August 19, 2025