Rain Alert: రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్డు అన్ని జలమయమవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు అల్లకల్లోలం అవుతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే బయపడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అయితే అకస్మాత్తుగా వస్తున్న వరదలు.. జనం జీవితాలకు అతలాకుతలం చేస్తున్నాయ్..
తీరం దాటిన వాయుగుండం..
నిన్న పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారాంపట్నంలో 9.33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గరిమెళ్ళపాడు, ఎల్లందు ప్రాంతాల్లో 5.45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 29 ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది.
తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో తెలంగాణలో మూడ్రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వికారాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, జిగిత్యాల, మెదక్, కామరెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రేపు 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ..
ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు..
నిన్న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రా తీర ప్రాంతం మధ్య తీరం దాటడంతో ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. అలాగే విశాఖ, అనకాపల్లి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, అల్లూరి సీతరామరాజు, ఏలూరు, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. మిగత జిల్లాల్లో స్వల్పంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అంతేకాకుండా మరో 3 రోజులు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
Also Read: వైస్ ప్రెసిడెంట్ పోరు.. చివరి నిమిషంలో ట్విస్ట్..! క్రాస్ ఓటింగ్ తప్పదా?
వర్షాల్లో అత్యవసరమైతేనే బయటకు వెళ్లండి!
ఇప్పుడు పడుతున్న వర్షాలకు వరద ప్రవాహాన్ని అంచనా వేయడం కష్టం. అందువల్ల.. నీటిలో ఆటలొద్దు. భారీ వరద ప్రవాహాల్లో ప్రయాణాలు చేయడం, ప్రాణాల మీదకు తెచ్చుకోవడం లాంటివి చేయొచ్దు. వర్షంలో అత్యవసరమైతేనే బయటకు వెళ్లండి. గ్రామాల్లో అయితే.. పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించండి. ముఖ్యంగా.. అధికారులు, ప్రభుత్వం సూచనలను పాటించండి. వర్షాలు కురిసేటప్పుడు.. విద్యుత్ స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండాలి. నాలాలు, మురుగు కాలువలు, డ్రైనేజీలకు దూరంగా ఉండాలి. వాటిలో పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని నిమిషాల సరదా కోసం వెళితే.. ప్రాణాలే పోయే అవకాశం ఉంది. అందుకే.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు.