Intinti Ramayanam Today Episode December 15th : నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ ఇంటికి వచ్చిన ఆనందంలో అందరు ఉంటారు. పల్లవి మాత్రం ప్లాన్ ఫెయిల్ అయ్యిందని టెన్షన్ గా, చిరాగ్గా ఉంటుంది. ఇక ఉదయం లేవగానే అవని మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటుంది. ఆ సమయంలోనే అనాధశ్రమం నుంచి వార్డెన్ అక్కడికి వస్తుంది. వార్డెన్ చూసినా అవని ఏమైందండీ ఏదైనా అవసరమా ఇలా వచ్చారా అనేసి అడుగుతుంది. ఆమె అవునండి చాలా పెద్ద అవసరం వచ్చాయి ఇక్కడికి వచ్చాను అనేసి అంటుంది. అంత పెద్ద అవసరం ఏమి వచ్చిందండి, డబ్బులు కావాలా అని అడుగుతుంది. దగ్గర ఒక 10, 12వేలు ఉంటాయి అవి ఇస్తాను అవి తీసుకెళ్లండని అవని అంటుంది.. వేలు కాదండి లక్షలతో కూడిన సమస్య వచ్చింది ఆశ్రమంలో ఒక పాపకి గుండె సమస్య వచ్చింది. ఆపరేషన్ చేయాలంటే 10 నుంచి 20 లక్షలు అవుతాయని డాక్టర్లు చెప్తున్నారు అనేసి ఆవిడ చెప్తుంది. నాకు తెలిసిన పెద్ద పెద్ద వాళ్ల దగ్గరికి వెళ్తే ఎంతో కొంత ఇస్తున్నారు అవన్నీ కలిపిన లక్ష రూపాయలు కాలేదనేసి ఆవిడ అంటుంది. దానికి కరిగిపోయిన అవని లోపలికి వెళ్లి మా ఆయన అడిగి ఒకసారి చెప్తానని అంటుంది..
అమెరికా కాల్ తో బిజీగా ఉన్నానని అవనిపై అరుస్తాడు. అవని చెప్పాలనుకున్న విషయాన్ని వినే స్థితిలో కూడా అక్షయ లేడు. బయటకొచ్చి ఆ విషయాన్ని చెప్పలేక ఆయన బిజీగా ఉన్నాడు ప్రస్తుతానికైతే ఈ గాజులు తీసుకెళ్లండి వీటిని నమ్ముతారు తాకట్టు పెడతారు ఏదో ఒకటి చేసి ట్రీట్మెంట్ అయితే చేయించుకోండి అనేసి అంటుంది. అది విన్న పల్లవి భానుమతికి చెప్తుంది. అవునా గాజులు ఇచ్చేసిందా ఎలాగైనా ఇరికించాలని పల్లవి భానుమతిలు ప్లాన్ చేస్తారు. సేటు రమ్మని బంగారం ఇవ్వమని చెప్తారు. గాజులు లేవని నిజం చెప్పేస్తుంది. నీకే ఒక దిక్కు లేదు నువ్వు అనాధలకు సాయం చేస్తావా అసలు ఇంట్లో వాళ్లకు చెప్పకుండా నువ్వు అలా ఎందుకు చేస్తున్నావ్ అనేసి భానుమతి అవని పై కోపంగా అరుస్తుంది. రాజేంద్రప్రసాద్ అది మంచిపనే కదా మా అన్న గాని నువ్వు ఊరుకో రాజేంద్ర నీకేం తెలియదు ఇంట్లో ఉన్నంత ఊడ్చి పెడుతుంది అనేసి అరుస్తుంది. భానుమతికి ఎవరు ఏం చెప్పలేక అందరు మౌనంగా ఉంటారు.
అవని మాత్రం బాధపడుతూ ఉంటుంది.. ఇక రాత్రి కమల్ సోఫాలో పడుకుని నిద్రపోతుంటాడు. ఆరాధ్య సైలెంట్ గా ఉండమని చెప్పిన గాడ నిద్రలో గురక పెడుతూ ఉంటాడు. అది భరించలేని ఆరాధ్య కమల్ ను లేపుతుంది. ఇంకాస్త గట్టిగా గురక పెడతాడు. ఉండు నీ పని చెప్తానని ఆరాధ్య కమల్ ని జోకర్ లాగా రెడీ చేస్తుంది. భానుమతి అక్కడికొచ్చి రిమోట్ కోసం వెతుకుతూ కమల్ ను లేపుతుంది. కమల్ అవతారం చూసి ఒక్కసారిగా కేకలు పెడుతుంది. ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు. కమల్ అవతారం చూసి అందరూ నవ్వుకుంటారు. ఇక ఇది ఆరాధ్య పని అని తెలుసుకున్న కమల్ ఆరాధ్యను నువ్వు పట్టుకోవాలని చూస్తాడు. అప్పుడే అక్షయ్ ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే భానుమతి తన భార్య చేసిన పనిని చెప్తుంది. ఇక అక్షయ్ వెళ్లి అవన్నీ అడుగుతాడు. ఒక మాట చెప్పి చేసుంటే ఇదంతా వచ్చేది కాదు కదా ఇప్పుడు నువ్వే తప్పు చేశావని అందరూ అంటున్నారు అనేసి అవనితో అనగానే అవని నేను మీకు చెప్పాలని వచ్చాను మీరు బిజీగా ఉన్నారు నేను చెప్పాలనుకున్న కానీ మీరు విని పరిస్థితిలో లేరు అవసరం అంటేనే ఇచ్చాను కావాలని నేను ఏదీ చేయలేదండి అనేసి అంటుంది.
ఇకమీదట నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే నేను బిజీగా ఉంటే అమ్మతోనో నాన్నతో నువ్వు చెప్పు అనేసి అంటాడు. ఇక అక్షయ్ ఇచ్చిన ఆస్తి పత్రాలను పార్వతీ రాజేంద్రప్రసాద్కిస్తుంది. పిల్లల పేరు మీద ఆస్తులు రాసి పెట్టాను అని చెప్పేసి పార్వతితో అంటాడు. అక్షయ్ కు సగం ఆస్తి రాస్తాడు. అది చూసినం పార్వతి ఏడుస్తుంది. మన బిడ్డ కాకపోయినా అంత ఆస్తి ఇచ్చానని బాధపడుతున్నావా అనేసి అడుగుతాడు. అక్షయ్ ఎప్పుడు నా బిడ్డగానే చూసాను నా బిడ్డ కాదని నేను ఎప్పుడూ అనుకోలేదు అనేసి ఎమోషనల్ అవుతుంది. బయట పాలు తీసుకొచ్చిన అవని ఆ మాట వింటుంది. అక్షయ్ అత్తయ్య మావయ్య సొంత కొడుకు కాదా అనేసి ఆలోచిస్తుంది. అక్షయ్ ఎవరి కొడుకు ఎందుకు మామయ్య వాళ్ళ దగ్గర ఉన్నాడు అనేసి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..