Intinti Ramayanam Today Episode December 23rd: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని లాకర్ లోకి డబ్బులు ఎలా వచ్చాయి అని అత్తయ్య అన్న మాటలు గుర్తు చేసుకొని ఏడుస్తుంది. అసలు లాకర్లకి అంత డబ్బులు ఎలా వచ్చాయి ఎవరు పెట్టారు ఇదంతా పల్లవి పనే అనేసి అనుకోగానే పల్లవి ప్రత్యక్షమవుతుంది. అవునక్కా నువ్వు గెస్ చేసింది అక్షరాల నిజం నేనే ఆ డబ్బుల్ని లాకర్లో పెట్టాను నీకు ముందు ముందు ఇలాంటి ఏడుపులు బాధలు చాలానే ఉంటాయి నువ్వు నేను ఇలాంటివన్నీ మానుకోవాలంటే నువ్వు అక్షయ్ బావ ఇంట్లోంచి వెళ్లి పోవాల్సిందే అనేసి అంటుంది. నీ గురించి సాక్షాలతో సహా అందరికీ చెప్పడం నాకు పెద్ద పని కాదు. నీ గురించి చెప్పగానే మావయ్య నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాడు అలా చెప్తే నాకేమీ రాదు బంధాలు బంధుత్వానికి విలువ ఇచ్చాను కాబట్టే నీకు మంచిగా చెప్తున్నాను నా మంచితనాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఇంకొకసారి ఇలా చేస్తే బాగోదు అనేసి వార్నింగ్ ఇస్తుంది.. కొన్ని పల్లవి మాత్రం నువ్వు ఇంట్లోంచి బయటికి పంపించేంతవరకు నేను ఈ ప్రయత్నాలు మానుకొని తెగేసి చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అవని ఉదయం జరిగిన దాని గురించి బాధపడుతూ ఉంటుంది అసలు లాకర్ లోకి డబ్బులు ఉండడం చూసి అత్తయ్య నన్ను అపార్థం చేసుకుంది. ఇప్పుడు నా మొహం కూడా చూడటం లేదు అనేసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్షయ్ లోపలికి వస్తాడు. అక్షియన్ చూసిన అవని ఆరాధ్యను ఇటుపక్క నుంచి అటువైపు మారుస్తుంది. ఎందుకు ఆరాధిని అటువైపు పడుకో పెట్టుకున్నావంటే నా కూతురు నా ఇష్టం అనేసి అంటుంది. నీ ఒక్కదానికి పుట్టిందా కూతురు అనేసి అక్షయ్ అంటాడు. ఒక్కరోజు నీ కూతుర్ని నీ పక్కన పడుకోబెట్టకుండా అటు సైడ్ పడుకో పెట్టినందుకు నువ్వు ఇంత ఫీలవుతున్నావే నా కొడుకు లాంటి కన్నయ్యకు నువ్వు ఎంత బాధ పెట్టావో ఆలోచించావా అసలు కన్నయ్య కొన్ని ఎందుకు ఫ్రీజ్ చేయించారు. అది చెప్పండి అనేసి అడుగుతుంది. వాడికి డబ్బు విలువ తెలియట్లేదు తన ఫ్రెండ్ అని నమ్మి వేరే వాడికి 20 లక్షలు ఇచ్చి మోసపోయాడు ఆ విషయం నాన్నకు తెలిస్తే వాడిని అసలు ఊరుకుంటాడా అనేసి అక్షయ్ అవనీతో అంటాడు. అందుకే నేను డబ్బులు ఫ్రీజ్ చేయించాను అంతేకానీ నాకు వాడి మీద ఎటువంటి కోపం లేదు ఏదీ లేదు నాన్నకి తెలిస్తే వాడి మీద కోప్పడతాడని నేను అలా చేశాను అంతే అనేసి అంటాడు. ఈరోజు తన ఫ్రెండు తనకు ఇష్టమైన బైక్ను తీసుకొచ్చాడు కానీ డబ్బుల అకౌంట్లో ఇవ్వకపోవడంతో ఆ బైక్ ని తన ఫ్రెండ్ తీసుకెళ్లిపోయాడు. కన్నయ్య ఎంత బాధపడి ఉంటాడో ఆలోచించారా అనేసి అడుగుతుంది.
ఇక పార్వతి బాధపడుతూ ఉంటుంది. ఏమైంది పార్వతి ఎందుకలా ఉన్నావ్ అంటే నేను ఎవరినైతే నమ్మాను వాళ్ళు నన్ను ఇలా మోసం చేస్తారని నేను అస్సలు ఊహించలేదండి అనేసి రాజేంద్రప్రసాద్ తో అంటుంది.. ఈరోజు కమల్ బైక్ ని కొనాలనుకుని అనుకున్నాడు. నా ఫ్రెండు బైక్ ని తీసుకుని వచ్చాడు అయితే అక్షయ్ కమల్ అకౌంట్ ను ఫ్రీజ్ చేయించాడు. ఇంట్లో లాకర్లు డబ్బులు ఉన్నా అవని డబ్బులు లేవని చెప్పింది నేను ఇన్ని రోజులు అవన్నీ గుడ్డిగా నమ్మాను మోసపోయాను అనేసి రాజేంద్రప్రసాద్ తో అంటుంది. అక్షయ్ కమల్ అకౌంట్ ను ఫ్రీజ్ చేయడానికి ఒక కారణమే ఉంటుంది.. అవని డబ్బులు ఇవ్వకపోవడానికి మనం తన మీద ఈ పెట్టిన బాధ్యత అని అనుకోవచ్చు కదా ఎందుకు తప్పుగా ఆలోచిస్తావనేసి రాజేంద్రప్రసాద్ పార్వతి తో అంటాడు. ఇక ఉదయం లేవగానే రాజేంద్రప్రసాద్ ఏదో బిజినెస్ డీల్ గురించి మాట్లాడుతాడు అవని అతనికి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. పార్వతికి కాఫీ ఇస్తే మాట్లాడదు. ఏవండీ ఈరోజు కార్తీక మాసం చివరి రోజు మనము గుడికి వెళ్లి అభిషేకం చేయిస్తానని అనుకున్నాను మీరు రండి వెళ్దాం అనేసి అడుగుతుంది. రాజేంద్రప్రసాద్ ఆ మాటేదో అవని అడిగినప్పుడు కూడా చెప్పొచ్చు కదా పార్వతి అనేసి అంటాడు. కానీ పార్వతి మాత్రం మౌనంగా ఉంటుంది. అప్పుడే అక్షయ్ అక్కడికి వచ్చేసి అమ్మ నిన్న నాకు కాల్ చేసావంట నా ఫోన్ అర్జెంటు మీటింగ్ వల్ల ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేశాను. కమల్ బాధ్యతగా ఉండాలని నేను చెప్పాను కదా అందుకే నేను వాడి అకౌంట్ ని ఫ్రీజ్ చేయను నువ్వు దాని గురించి ఆలోచించకు అనేసి అంటాడు.
ఇక గుడికి వెళ్దామని అంటే నేను చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. దానికి వెళ్లాలి పార్వతి నువ్వు ముందే చెప్పింటే నేను దాన్ని ఫిక్స్ చేసుకోను ఇప్పుడు అతను ఒక కోపిస్తే ఏదైనా చిన్న పొరపాటు దొరికిన దాన్ని కాన్సల్ చేస్తాడు అని అనగానే అక్షయ్ నేను చూసుకుంటాను నాన్న మీరు అమ్మతో గుడికి వెళ్ళండి ప్రాజెక్ట్ వస్తే వచ్చింది లేకపోతే పోతే పోయింది అమ్మ సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని అనగానే పార్వతి కొడుకు ప్రేమకు పొంగిపోతుంది. రాజేంద్ర ప్రసాద్ ని ఒప్పించి గుడికి తీసుకెళ్లమని చెబుతాడు. పల్లవిని కూడా గుడికి రమ్మని పార్వతి అంటుంది. ఇక ముగ్గురు కలిసి గుడికి వెళ్తారు. అవని మాత్రం బాధపడుతూ ఉంటుంది. మనకి గాజులు ఇచ్చానని నా తప్పు అయిపోయింది అని అత్తయ్యకి క్షమాపణలు అడిగాను. నా లాకర్ లో ఉన్న డబ్బులు గురించి నేను అత్తయ్యకు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటుంది. భానుమతి అవని దగ్గరకొచ్చి గుడికి వెళ్ళిన వాళ్ళు ఇంటికొస్తారు ఆకలితో మాడిచావమని అనుకుంటున్నావా? అన్నం చేయాలని బుద్ధి కూడా నీకు లేదా అనేసి కోప్పడుతుంది. కమలొచ్చి వదినని అంటావని భానుమతిపై రాయి తీసుకొని కొట్టబోతాడు. మధ్యలో అవని వచ్చి అడ్డుపడుతుంది. వచ్చి చెప్పింది కాబట్టి నేను వదిలేస్తున్నాననేసి కమల్ కూల్ అవుతాడు. ఇక గుడికి వెళ్ళిన వాళ్ళు పూజ చేయించుకున్న తర్వాత బయటకు వస్తారు. ఆరాధ్య వాష్ రూమ్ అని చెప్పేసి అనగానే పల్లవి నేను తీసుకుని వెళ్తాను అని చెప్తుంది. ఇక రాజేంద్రప్రసాద్ పార్వతి తో మాట్లాడుతాడు. ఆ దేవుని ఏం కోరుకున్నావు పార్వతి అని అడగని నా నుంచి అక్షయ్ ఎప్పటికీ దూరం కాకూడదు ఎవరు దూరం చేయకూడదనేసి కోరుకున్నాను అంటుంది. అక్షయ్ నా కన్నా కొడుకు కాదన్న విషయం ఈ జన్మలో ఎవరికీ తెలియకూడదు అనేసి కోరుకున్నానని అంటుంది. అప్పుడే పల్లవి ఆరాధ్యను తీసుకుని వస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో జరుగుతుందో చూడాలి..