Intinti Ramayanam Today Episode December 24th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని ఉదయం జరిగిన దాని గురించి బాధపడుతూ ఉంటుంది అసలు లాకర్ లోకి డబ్బులు ఉండడం చూసి అత్తయ్య నన్ను అపార్థం చేసుకుంది. ఇప్పుడు నా మొహం కూడా చూడటం లేదు అనేసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్షయ్ లోపలికి వస్తాడు. అక్షియన్ చూసిన అవని ఆరాధ్యను ఇటుపక్క నుంచి అటువైపు మారుస్తుంది. ఎందుకు ఆరాధిని అటువైపు పడుకో పెట్టుకున్నావంటే నా కూతురు నా ఇష్టం అనేసి అంటుంది. నీ ఒక్కదానికి పుట్టిందా కూతురు అనేసి అక్షయ్ అంటాడు. ఒక్కరోజు నీ కూతుర్ని నీ పక్కన పడుకోబెట్టకుండా అటు సైడ్ పడుకో పెట్టినందుకు నువ్వు ఇంత ఫీలవుతున్నావే నా కొడుకు లాంటి కన్నయ్యకు నువ్వు ఎంత బాధ పెట్టావో ఆలోచించావా అసలు కన్నయ్య కొన్ని ఎందుకు ఫ్రీజ్ చేయించారు. అది చెప్పండి అనేసి అడుగుతుంది. వాడికి డబ్బు విలువ తెలియట్లేదు తన ఫ్రెండ్ అని నమ్మి వేరే వాడికి 20 లక్షలు ఇచ్చి మోసపోయాడు ఆ విషయం నాన్నకు తెలిస్తే వాడిని అసలు ఊరుకుంటాడా అనేసి అక్షయ్ అవనీతో అంటాడు. అందుకే నేను డబ్బులు ఫ్రీజ్ చేయించాను అంతేకానీ నాకు వాడి మీద ఎటువంటి కోపం లేదు ఏదీ లేదు నాన్నకి తెలిస్తే వాడి మీద కోప్పడతాడని నేను అలా చేశాను అంతే అనేసి అంటాడు.. ఇక పార్వతి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుకుంటారు. అవని గురించి చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రాజేంద్రప్రసాద్ ఏదో బిజినెస్ డీల్ గురించి మాట్లాడుతాడు అవని అతనికి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. రాజేంద్ర ప్రసాద్ ని ఒప్పించి గుడికి తీసుకెళ్లమని చెబుతాడు. పల్లవిని కూడా గుడికి రమ్మని పార్వతి అంటుంది. ఇక ముగ్గురు కలిసి గుడికి వెళ్తారు. అవని మాత్రం బాధపడుతూ ఉంటుంది. రాజేంద్రప్రసాద్ పార్వతి తో మాట్లాడుతాడు. ఆ దేవుని ఏం కోరుకున్నావు పార్వతి అని అడుగుతాడు. నా నుంచి అక్షయ్ ఎప్పటికీ దూరం కాకూడదు ఎవరు దూరం చేయకూడదనేసి కోరుకున్నాను అంటుంది. అక్షయ్ నా కన్నా కొడుకు కాదన్న విషయం ఈ జన్మలో ఎవరికీ తెలియకూడదు అనేసి కోరుకున్నానని అంటుంది. అప్పుడే పల్లవి ఆరాధ్యను తీసుకుని వస్తుంది.. ఇక పల్లవి ఏంటి అత్తయ్య తప్పు చేశాను అంటున్నారు మావయ్య అత్త ఏం తప్పు చేసిందని అడుగుతుంది. ధ్వజస్తంభం దగ్గర దీపం పెడతానని మొక్కుకునిందంట కానీ ఇప్పుడు పెట్టలేకపోతున్నానని తప్పు చేశానని అనుకుంటుంది.. మరేం పర్లేదు పార్వతి ఈసారి గుడికి వచ్చినప్పుడు దీపం పెట్టేసే అనేసి అంటాడు. ఇక పల్లవి తో రేపు మీ అక్షయ బావ బర్తడే మనము చాలా గ్రాండ్ గా చేయాలి ఈ విషయాన్ని నువ్వు అవనితో చెప్పు అనేసి చెప్తుంది.
కానీ అవని మాత్రం ఇంటికి వచ్చిన తర్వాత రివర్స్ ప్లాన్ ఇస్తుంది. తన బామ్మతో కలిసి అత్తయ్య అక్షయ బావ పుట్టినరోజు చేయడం లేదు నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని పెద్ద డ్రామా ని మొదలు పెడతారు. నిజమే అనుకొని అవని నమ్ముతుంది ఇక పార్వతిని అడగడానికి పార్వతి దగ్గరికి వెళ్తుంది. పార్వతి మాత్రం వాళ్ళు చెప్పినట్లు కాకుండా తన కొడుకు బర్త్డే ని చాలా గ్రాండ్గా చేయాలని కేక్ గురించి మాట్లాడుతుంది. ఫోన్ మాట్లాడిన తర్వాత అవని పార్వతి దగ్గరికి వచ్చి బర్త్డే గురించి అడుగుతుంది కానీ పార్వతి ఇష్టం లేకుండా మాట్లాడి వెళ్లిపోతుంది. ఇక రాత్రి అక్షయకి ఆరాధ్య అవని విష్ చేస్తారు. ఇక ఇంట్లోని వాళ్ళందరూ విష్ చేస్తారు ఒక పార్వతి రాలేదని అవని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఉదయం లేవగానే పార్వతి అక్షయ్ కి నూనె పెట్టే స్నానం చేయించాలని వస్తుంది కానీ అప్పటికే అవని బయట గార్డెన్లో అక్షయ్ కి స్నానం చేస్తుంది.
అది చూసిన పార్వతీ కోపంతో రగిలిపోతుంది. రాతి నాకు అవని చెప్పాలనుకున్న విషయం ఇదేనేమో నేను చేస్తాను అని అనుకుంటే ఈ బర్త్డే తానే చేద్దామని చెప్పాలనుకునిందేమో అని మనసులో ఆలోచిస్తుంది. అప్పుడే భానుమతి పల్లవి పార్వతి దగ్గరికి వస్తారు. ఇక భానుమతి ప్రతి ఏడాది అక్షయకు నువ్వే తలకు నూనె పెట్టి స్నానం చేయించి బర్త్డేని గ్రాండ్గా చేస్తావు ఈసారి అవకాశం కూడా నీకు నీ కోడలు ఇవ్వలేదు. ఎప్పుడు నేను అవని నేను ఏదైనా అంటే నన్ను అపార్థం చేసుకుంటున్నామని తిట్టేది ఇప్పుడేంటి అర్థమైందా అనేసి అడుగుతుంది. దానికి పల్లవి మాత్రం స్నానం ఒక్కటి అక్క చేయిస్తుంది. మిగిలిన సెలబ్రేషన్స్ అంతా అత్తయ్య చేస్తుంది కదా అందులో తప్పేంటి అని అంటుంది. అప్పుడు భానుమతి ఏమో ఎవరికి తెలుసు అనేసి అనగానే పార్వతి లోపలికి వెళ్ళిపోతుంది. ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో అక్షయ్ సొంత మామ పార్వతికి ఫోన్ చేస్తాడు. పార్వతి షాక్ అవుతుంది. మరి రేపటి ఎపిసోడ్లో అక్షయ్ అసలు తల్లి ఎవరో తెలిసిపోతుందా చూడాలి..