Brahmamudi serial today Episode: ఇక నుంచి ఇంట్లో నేను చెప్పింది జరగాలి.. ఎనీ డౌట్స్ అంటుంది కావ్య. దీంతో ధాన్యలక్ష్మీ విన్నారా అత్తయ్య మీ పెద్దరికాన్ని పక్కన పెట్టి మీ మనవరాలు ఎలా మాట్లాడుతుందో విన్నారా..? అంటుంది. ధాన్యలక్ష్మీ నా పెద్దరికాన్ని నువ్వు ఎప్పుడు గౌరవించావు. నీ మూలంగా నా భర్త హాస్పిటల్ పాలయ్యాడు. ఆయన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే.. నువ్వేం చేశావు. పుట్టెడు దుఃఖంలో నేను ఉంటే.. కనీసం నన్ను ఓదార్చావా అంటూ ప్రశ్నిస్తుంది ఇందిరాదేఇ. నోటి దాకా వెళ్లిన అన్నం ముద్ద కూడా వదిలేలా చేశావు. సరే అది మీ ఇష్టం మా ఆయన ముందే ఊహించి ఆస్థి మొత్తం కావ్య పేరు మీద రాశాడు.
నేను నీకు ఏం సమాధానం చెప్తాను అమ్మా నేను నిమిత్తరాలిని అంటుంది ఇందిరాదేవి. దీంతో ధాన్యలక్ష్మీ అక్కా నీ కోడలు అలా మాట్లాడటం ఎంత వరకు సమంజసంగా ఉంది అంటూ ప్రశ్నిస్తుంది. నిజమే కావ్య సమంజసంగా లేదు. ధాన్యలక్ష్మీకి కూడా అవసరాలు ఉంటాయి కదా..? బొట్టు బిల్లలు, గాజులు, పౌడర్ డబ్బాలు అలాంటి వాటికి అడిగితే ఇవ్వాలి కదా..? అప్పుడు కూడా షాప్ నుంచి బిల్లు తెస్తేనే ఇద్దువు గానీ… అని అపర్ణ చెప్పగానే ఏంటి మేమిప్పుడు ప్రతి చిన్నదానికి నీ కోడలి మీద ఆధారపడాలా..? అని రుద్రాణి కోప్పడుతుంది.
మరేం చేస్తావు రుద్రాణి ఆస్థి మొత్తం నా కోడలి పేరు మీద ఉంది నా కొడుకు కూడా ఏం కావాలన్నా కావ్య మీదే ఆధారపడాలి. ఏం రాజ్ అని అపర్ణ అడగ్గానే అవును మమ్మీ ఇందాకా నా ఫోన్ బిల్లు కూడా కావ్యనే పే చేసింది అని రాజ్ చెప్పగానే రుద్రాణి షాక్ అవుతుంది. ఏంటి రాజ్ ఆఖరికి నువ్వు కూడా అనగానే నాన్నమ్మే ఏమీ అనలేకపోయింది నేను మాత్రం ఏమంటాను అత్తా కళావతి చేతిలో తాళాల గుత్తి ఉంది. తను ఎలా చెప్తే అలా నడుచుకుందాం అంటాడు రాజ్. సారీ అత్తయ్య ఈ విషయంలో నేను ఏమీ చేయలేను అని వెళ్లిపోతాడు. ఇంకా ఎవరికైనా ఏమైనా డైట్స్ ఉన్నాయా…? అని కావ్య అడగ్గానే ప్రకాష్ డౌటే లేదు.. ఆటే మొదలైనట్టు ఉంది అంటాడు. కావ్య వెళ్లిపోతుంది.
మన మాటకు ఇక విలువే లేదు ధాన్యలక్ష్మీ. ఇంత అవమానం తట్టుకోవడం నా వల్ల కావడం లేదే అని రుద్రాణి బాధపడుతుంది. నువ్వే అలా అంటే మరి నేను ఎవరికి చెప్పుకోవాలి. నా మతిమరుపు మొగుడు కూడా కావ్యకే తానా అంటే తందానా అంటున్నాడు అని చెప్తుంది ధాన్యలక్ష్మీ. ఇంతలో శాంత రావడం చూసి రుద్రాణి ఇది మళ్లీ వస్తుందేంటి దీన్ని పనిలోంచి తీసేశాను కదా అని కోపంగా ఆగవే అంటుంది. శాంత అలాగే లోపలికి వచ్చి ఎందుకు ఆగాలమ్మా వంట మనిషికి కూడా హారతి ఇస్తారా..? అని ప్రశ్నిస్తుంది. ఎక్కడ దిక్కు లేక మళ్లీ మా ఇంటికి వచ్చావా..? అని రుద్రాణి అడగ్గానే నేను ఎక్కడ దిక్కు లేక రాలేదు.
నేనేమీ పరాయి పంచన పడి బతకడం లేదు. మేడం ఫోన్ చేస్తేనే వచ్చాను అని చెప్తుంది. మేడమా ఎవరా మేడం అని రుద్రాణి అడగ్గానే నేనే పిలిచాను రుద్రాణి గారు అంటూ వస్తుంది కావ్య. దీంతో రుద్రాణి కోప్పడుతుంది. శాంతను బయటకు వెళ్లు అని కోప్పడుతుంది. దీంతో కావ్య కోపంగా శాంతను లోపలికి వెళ్లు అంటుంది. ఇద్దరి మధ్య గొడవ జరగుతుంది. ఈ ఇంట్లో నా మాటకు విలువ లేదా..? అంటుంది రుద్రాణి. నౌకర్లను ఉంచాలన్నా తీయాలన్నా మీకు అధికారం లేదు. వాళ్లకు జీతాలు ఇచ్చేది నేను అని కావ్య వార్నింగ్ ఇస్తుంది. అపర్ణను పిలిచి శాంతను ఎవరైనా బయటకు పంపించాలని చూస్తే అని చెప్పబోతుంటే.. నేను చూసుకుంటాను కావ్య అంటుంది అపర్ణ.
సీతారామయ్యకు ట్రీట్‌మెంట్ చేస్తుంటారు. ఇందిరాదేవి వచ్చి మా వారు ఎప్పుడు కోలుకుంటారు అని అడుగుతుంది. మీరు రోజు వస్తున్నారు. చూస్తున్నారు వెళ్తున్నారు. కానీ ఆయనలో ఉలుకు లేదు పలుకు లేదు. ఆయన ఎప్పుడు కోలుకుంటారు అని అడుగుతుంది. కోలుకుంటారు కానీ కచ్చితమైన సమయం అడిగితే మాత్రం మేము చెప్పలేము అంటాడు డాక్టర్. దీంతో ఎందుకు చెప్పలేరు.. పెద్ద పెద్ద చదువులు చదివిన మీరు చెప్పకపోతే ఎలా లక్షలకు లక్షలు బిల్లలు కడుతున్నాము మీరే ఇలా చెప్తే ఎలా అంటూ కోప్పడుతుంది ఇందిరాదేవి. కొంచెం ఓపిక పట్టండి అంతా సర్దుకుంటుంది అని డాక్టర్ వెళ్లిపోతాడు. ఇందిరాదేవి, సీతారామయ్యను చూస్తూ ఏడుస్తుంది. ఇందిరాదేవిని కళ్యాణ్ ఓదారుస్తాడు.
టిఫిన్ చేయడానికి వెళ్లిన ధాన్యలక్ష్మీ, రుద్రాణి, రాహుల్ ఇడ్లీ మాత్రమే చేశారేంటని గొడవ పెట్టుకుంటారు. ఇక నుంచి ఇంట్లో నాలుగేసి టిఫిన్స్ చేయడం కుదరదని కావ్య చెప్తుంది. దీంతో తినకుండా లేచి వెళ్లిపోతారు ధాన్యలక్ష్మీ, రుద్రాణి, రాహుల్. ప్రకాష్ దగ్గరకు వెళ్లిన ధాన్యలక్ష్మీ కావ్య గురించి చెప్పి తిడుతుంది. డైనింగ్ టేబుల్ దగ్గర జరిగిన గొడవ గురించి చెప్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?