Intinti Ramayanam Today Episode December 6th : నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతి చెప్పినట్లు పల్లవి అందరికీ కాఫీ చేయడానికి లోపలికి వెళుతుంది పల్లవి . అక్కడ నెయ్యి కుండ ఉండడం చూసి హోమానికి కావాల్సిన నెయ్యి.. ఎలాగైనా పాడు చేస్తే హోమం ఆగిపోతుందని ఆ కుండకు హోల్ పెడుతుంది. ఇక అందరికీ కాఫీ ఇస్తుంది. అక్షయ్ రాజేంద్రప్రసాద్ అక్కడికి వస్తారు. స్వామీజీ వస్తే పూజకి అవి ఇవి లేవంటే కోప్పడతారు మరి అన్ని ఉన్నాయో లేదో ఒకసారి లిస్టులో చెక్ చేస్తే బెటర్ కదా అనేసి అంటాడు. లిస్ట్ ప్రకారం అన్ని చదువుతాడు అయితే ఆవు నెయ్యి అక్కడ లేదని అనగానే అవని నేను వెళ్లి తీసుకొని వస్తాను లోపలే పెట్టాను అనేసి అంటుంది. ఇక లోపలికి వెళ్లి చూడగానే నెయ్యికుండకు హోల్ పడి కారుతూ ఉంటుంది. బయటికి వచ్చి నెయ్యకుండా హోల్ పడి కారుతూ ఉంది. ఏం చేయాలి అనేసి అడుగుతుంది. పొద్దున్నే నెయ్యి దొరకదు కదా అండి ఏం చేయమంటారు అని పార్వతి అంటుంది. కంగారు పడకండి అత్తయ్య నేను వెళ్లి ఎలాగోలాగా తీసుకొని వస్తాను అనేసి అవని అంటుంది. నావల్ల జరిగిన తప్పుని నేనే సరిదిద్దుకుంటా అనేసి అవని నెయ్యి కోసం బయటకు వెళ్తాను అంటుంది. కమల్ నేను కూడా తోడుగా వస్తాను వదిన అనేసి అంటాడు. భానుమతి మాత్రం కోపంతో అందరిపై అరుస్తుంది. ఏ దానిమీద దృష్టి పెట్టదు కానీ మీరు నెత్తినెక్కి కూర్చోబెట్టుకున్నారు అందుకే ఇలా శ్రద్ధ లేకుండా చేస్తుంది అనేసి అందరి ముందర అవనిని తిడుతుంది. నెయ్యి కోసం బయటకు వెళ్లిన అవని అక్కడ పడిపోతుంది. ఇక పూజ ఆగిపోతుంది. అవని ఇంటికి రాగానే అందరు అడుగుతారు. అవని నిజం చెప్తుంది. అక్షయ్ అవని పై అనుమానం పెరుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇంట్లో పూజ చెడిపోయినందుకు పల్లవి బయటకు వచ్చి సంతోషంతో డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇలాగే అందరూ బాధపడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుందంటూ పాటలు పెట్టుకొని డాన్స్ చేయడం అవన్నీ చూస్తుంది. అందరూ మంచి కోసం చేస్తున్న పూజ చెడిపోతే నీకు సంతోషంగా ఉందా నువ్వెందుకు డాన్స్ చేస్తున్నావ్ అనేసి అవని అడుగుతుంది. ఈ పల్లవి నాకు టెన్షన్ గా ఉంటే డాన్స్ చేస్తానని మీ అందరికీ తెలుసు కదా అక్క అనేసి అంటుంది. నువ్వు ఈ పూజ చెడిపోవడానికి కారణం నువ్వే కదా.. రాత్రి కుండలో పోసిన నెయ్యి బాగానే ఉంది పొద్దున చూసినప్పుడు నెయ్యి ఉంది. నువ్వు కాఫీ చేయడానికి వంట గదిలోకి వెళ్లావు అప్పుడే కుండకి చిల్లు పెట్టావని అర్థమవుతుంది నువ్వు తప్ప వంటగదిలోకి ఎవరు వెళ్ళలేరు అని అవని అడుగుతుంది. ఆ మత్తుమందు స్ప్రే చేసిన ఆవిడ నువ్వు పంపించిన ఆవిడే కదా నిజం చెప్పు అనేసి అవని అడగ్గాని పల్లవి నువ్వు చాలా ఇంటలిజెంట్ అక్క నీ తెలివికి జోహార్లు అనేసి అంటుంది. నువ్వు చేసే పూజ మంచి జరుగుతుందంటే అందరూ నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు కానీ పూజ ఆగిపోతే అందరూ నిన్ను తిడతారు నాకు కావాల్సింది అదే కదా అనేసి అంటుంది.
ఈ ఇల్లు చెడిపోవాలని నేను అనుకున్నాను అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నాను నా ప్లాన్ చేంజ్ అయింది అని పల్లవి అంటుంది. నాకు ఇండ్లు కావాలి ఇంటి ఆస్తికి నా కొడుకు ఒక్కడే వారసుడవ్వాలి అంటే శ్రీకర్ బావ లాగే నువ్వు అక్షయ్ బావ కూడా బయటికి వెళ్లాలి నీ బిడ్డ ఈ ఆస్తికి అడ్డు రాకూడదు అనేసి పల్లవి అంటుంది. పల్లవి మాటలు విన్న అవని షాక్ అవుతుంది. నీకు ఇలాంటి బుద్ధి పుడుతుందని అస్సలు ఊహించలేదు నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాటిని వృధా చేస్తూనే ఉన్నావు. ఇకమీదట నీకు అవకాశాలు ఇచ్చేదే లేదు అని అవని అంటుంది. అనుకుంటున్నవేవి జరగవు జరగనివ్వను అనేసి అవని పల్లవితో అంటుంది. ఇక అక్షయ్ ఆరాధ్యను తీసుకుని వచ్చి పాలు తీసుకొస్తాను తాగు అనేసి అంటాడు. పాలు తీసుకురాగానే ఆరాధ్య మమ్మీ తీసుకొస్తుంది కదా నువ్వెందుకు తీసుకొచ్చావు నాన్న అనేసి అంటుంది. మీ మమ్మికి చాలా పనులు ఉంటాయి నిన్ను చూసుకునే అంత పని లేదులే అనేసి వెటకారంగా అంటాడు. అప్పుడే అవని వచ్చి ఆ పాలు నేను తాగిస్తాను ఇవ్వండి అనేసి అంటుంది. కానీ నేను చూసుకుంటానని ఆరాధ్యన్ని తీసుకొని బయటికి వెళ్తాడు.
పల్లవి తన బెడ్ రూమ్ నిండా అబ్బాయిల ఫోటోలు పెడుతూ ఉంటుంది. కమల్ లోపలికి రాగానే ఫోటోలు చాలా బాగున్నాయి పల్లవి అని అడుగుతాడు. నాకు బాబు అంటే నీ ఇష్టం బావ అందుకే అబ్బాయి ఫోటోలు పెట్టాను అనేసి అంటాడు. కమల్ నాకు అమ్మాయే కావాలి అని ఇద్దరు గొడవ పడతారు. భానుమతి అక్కడికొస్తుంది. నువ్వు గేమ్ ఆడుకోడానికి నా ఫోన్ ఇస్తాను నువ్వు అబ్బాయి పుడతాడు అని చెప్పాలి అని పల్లవి అంటుంది. భానుమతికి చుక్కలు చూపిస్తాడు కమల్. నీకు అబ్బాయి కావాలంటే అబ్బాయి ఫోటోలు చూసుకో అమ్మాయి కావాలంటే మా వదిన మొహం చూడు అనేసి కమల్ పల్లవికి కోపం తెప్పిస్తాడు. ఇంట్లో పూజ చెడిపోవడంతో అక్షయ్ అవని పై కోపంగా ఉంటాడు. అవన్నీ మర్చిపోవాలని తాగుదామని బాటిల్ చేతిలో పట్టుకుంటాడు. అది చూసిన అవని మిమ్మల్ని తాగనివ్వను అనేసి అంటుంది. నాకు చాలా బాధలున్నాయి నువ్వు చేసిన దానికి కోపంగా ఉన్నాను నిద్ర పట్టట్లేదు కనీసం ఇది తాగితే నిద్రపోతాను అనేసి అక్షయ్ అంటాడు. మీరన్న మాటలకి నాకు ఇంకా బాధగా ఉంది మరి నేను తాగాలి కదా నేను మీలాగా బరితెగించలేదు. మీరు తాగేసి ఇంటికి వస్తారు నా ముందరే తాగుతారు కానీ నేను మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను అందుకే వాష్ రూమ్ లోకి వెళ్లి తాగుతాను అనేసి బాటిల్ తీసుకొని అవని వాష్ రూమ్ లోకి వెళుతుంది. అక్కడ సింక్లో బాటిల్ మొత్తాన్ని పోసేస్తుంది. ఆ బాటిల్ మొత్తం తానే తాగినట్టు కవరింగ్ ఇస్తుంది. ఇక అక్షయ్ జన్మలో తాగకూడదని ప్లాన్ చేస్తుంది. తాగినట్టు నటిస్తూ అక్షయ్కి చుక్కలు చూపిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో అక్షయ్ కు అవని నిజం చెప్తున్నా నిజం తెలుసుకునేలా చేస్తుందా అనేది చూడాలి..