Homemade Face Pack: ముఖం అందంగా.. ఎలాంటి మచ్చలు లేకుండా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది చర్మ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. దుమ్మూ, ధూళి, స్ట్రెస్, సరైన ఆహారం తినకపోవడం.. ఇతర కారణాల వల్ల కూడా చర్మ సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇందుకోసం బ్యూటీ పార్లర్‌కి వెళ్లి వేలకు వేలు ఖర్చు చేసి ఫేషియల్స్ చేపిస్తారు. మరికొందరు బయట మార్కెట్లో రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు.
అందం సంగతి దేవుడెరుగు.. అవి ఎక్కువగా కెమికల్స్‌తో తయారై ఉంటాయి కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఎలాంటి సమస్యలు లేకుండా ముఖం అందంగా మారాలంటే ఈ ఫేస్ ప్యాక్‌లు ట్రై చేయండి. అసలే పెళ్లిళ్ల సీజన్ స్టార్ అయింది. అందరూ అందంగా, ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటారు. మీరు కూడా అందంగా కనిపించాలంటే.. ఈ క్రీమును ట్రై చేయండి. ఇది మీ అందాన్ని మరింత హైలెట్ చేస్తుంది.
కావాల్సిన పదార్ధాలు..
గులాబీ రేకులు
పాలు
అలోవెరా జెల్
విటమిన్ ఇ కాప్యూల్స్
బాదం నూనె
తయారు చేసుకునే విధానం..
ముందుగా వేడి పాలల్లో గులాబీ రేకులను వేసి ఐదు నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత పాలను వడకట్టి అందులో టీ స్పూన్ బాదం నూనె, మూడు నుంచి నాలుగు చెంచాలు అలోవెలా జెల్, మూడు విటమిన్ ఇ క్యాప్యూల్స్ కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఈ క్రీమును ప్రతిరోజు రాత్రి రాసుకొని పడుకోండి. కొద్దిరోజుల్లోనే మీ ముఖంపై ఉన్న మచ్చలు, పిగ్మెంటేషన్ పోయి చాలా అందంగా కనిపిస్తారు. మీ చర్మం గ్లాసీ లుక్‌లో కనిపిస్తుంది కూడా.
Also Read: తలస్నానం చేసేటప్పుడు మీరూ.. ఈ పొరపాట్లు చేస్తున్నారా ? జాగ్రత్త
శెనగ పిండి, నెయ్యి ఫేస్ ప్యాక్
ముఖం అందంగా, మచ్చలు లేకుండా కనిపించేందుకు శెనగపిండి, నెయ్యి అద్బుతంగా పనిచేస్తాయి. ఇవి చర్మంపై మురికిని తొలగించి తేమగా ఉంచేందుకు సహాయపడతాయి. ఇందుకోసం మూడు టేబుల్ స్పూన్ శెనగపిండిలో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి కలిపి వాటిని బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్నిముఖంపై అప్లై చేసి అరగంట తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. మీ స్కిన్ చాలా గ్లోయింగ్‌గా కనిపిస్తుంది.
నెయ్యి, పసుపు ఫేస్ ప్యాక్..
చర్మంపై ట్యాన్‌ని తొలగించి, మచ్చలు లేకుండా చేసేందుకు ఈ ఫేస్ ప్యాక్ చక్కగా పనిచేస్తుంది. ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ నెయ్యిలో టీ స్పూన్ తేనె కలిపి ముఖంపై అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో వాష్ చేయండి మంచి ఫలితం ఉంటుంది. ఇలా ప్రతిరోజు చేస్తే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వారం రోజుల్లోనే మంచి రిజల్ట్ కనిపిస్తాయి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.