Intinti Ramayanam Today Episode February 22nd : నిన్నటి ఎపిసోడ్ లో.. స్వరాజ్యం దయాకర్ ఇద్దరు అవని గురించి బాధపడుతూ ఉంటారు. ఏమైంది ఇంకా అవన్నీ రాలేదు ఎప్పుడో అనగా వెళ్లింది అని స్వరాజ్యం టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అవని ఇంట్లోకి వస్తుంది. విడాకుల గురించి నీ వాళ్ళతో మాట్లాడవా అని స్వరాజ్యం అడుగుతుంది. కానీ వాళ్లకి దగ్గరగా ఉండాలని నేను అనుకుంటున్నాను కానీ వాళ్ళు నన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నారు ఈ గొడవలు ఇవి ఎంత వరకు వెళ్తాయో ఎప్పుడూ ముగుస్తాయో తెలియట్లేదు పిన్ని అని అవని బాధపడుతూ ఉంటుంది. నేను ఎంత ఆ ఇంటిని కాపాడుకోవాలని చూస్తున్న సరే ఆ ఇంట్లో వాళ్ళు నాకు ఇలా చేయాలని అనుకుంటున్నారని అవని బాధపడుతుంది. ఇక తర్వాత అక్షయ్ విడాకులు నోటిఫికేషన్ పంపించినట్టు రాజేంద్రప్రసాద్ కు శ్రియ శ్రీకర్ కమల్ పల్లవిలు చెప్తారు. అది విని రాజేంద్రప్రసాద్ షాక్ అవుతాడు.. అక్షయ్ ఇలా చేస్తాడు నేను అసలు ఊహించలేదు అని రాజేంద్రప్రసాద్ బాధపడతాడు. అక్షయ్ ను పిలిచి ఆ విషయాన్ని అడగాలని అనుకుంటారు. ఏది చెప్పడు నాకు ఏ సంబంధం లేదని అడుగుతారు .. కానీ అక్షయ్ మాత్రం నాకు సంబంధం లేదు నేను పంపించలేదని అంటాడు. ఇక అప్పుడే కమల్ పల్లవికి విడాకులు పంపిస్తాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. అక్కడితో
ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ అవని దగ్గరికి వెళ్లి నిజం చెప్పాలనుకుంటాడు. కానీ అవని మాత్రం తనకు విడాకులు పంపించిన విషయం తెలిసి కూడా నాతో మాట్లాడాలని అనుకుంటున్నాడు అని కావాలని మాట మార్చి జాబ్ గురించి మాట్లాడుతుంది. నేను నీకు విడాకులు పంపించలేదు అవని ఇంట్లో పరిస్థితులు బట్టి నీకు దూరంగా ఉన్నాను నిన్ను జీవితంలో ఎలా వదులుకుంటున్నాను అనుకుంటున్నావు అని అవనిత అంటాడు. నాకు తెలుసండి మీరు ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను నమ్మలేదు నువ్వు వెళ్లినప్పటి నుంచి ఇంట్లో ఒకదాని తర్వాత ఒకటి సమస్య వచ్చి పడుతూనే ఉంది అని అక్షయ్ అనగానే అవని ఏమైంది ఇప్పుడు ఏం జరిగిందని అడుగుతుంది.. విడాకులు నోటీస్ పంపించడానికి పల్లవి హస్తము ఉందని కమల్ పల్లవికి విడాకులు పంపించాడు అనగానే అవని షాక్ అవుతుంది. కన్నయ్య ఎందుకిలా చేశాడు అని అవని అంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ కమ్మలు తప్పని విడాకులు వెనక్కి తీసుకోవాలని తిడతారు. ఎన్ని చెప్పినా నేను విడాకులు వెనక్కి తీసుకొనని కమలంటాడు.
ఇక పల్లవి పార్వతిని తీసుకొస్తుంది. అత్తయ్య చెప్పింది చేశాను నేను ఏమైనా కావాలని అవని అక్కని విడాకులు ఇప్పించి ఇంట్లోంచి గెంటే అని అనుకుంటున్నాను అని పల్లవి అంటుంది. అమ్మ నువ్వు విడాకులు ఇవ్వమని చెప్పావంటే అవును నేనే చెప్పాను అందుకే ఇచ్చింది ఇప్పుడు నువ్వు ఈ విడాకులు వెనక్కి తీసుకుంటావా లేదా అని అంటుంది పార్వతి. మీరందరూ ఇంతగా చెబుతున్నారు కాబట్టి నేను పల్లవికి ఇచ్చిన విడాకులను వెనక్కి తీసుకుని చించేస్తున్నానని పల్లవి మొహానే విసిరికొడతాడు కమల్.. ఇక తర్వాత పల్లవి అవని దగ్గరికి వెళ్తుంది. అవని వెళ్తుంటే ఆపుతుంది. విషయం చెప్పాలి నాకు కమ్మలు నోటీస్ పంపించేలా చేసావ్ మళ్ళీ నా తెలివితో ఆ నోటీస్ నీట్ చించేలా చేశాను అది నా తెలివి అని సంబరపడిపోతుంది. దానికి అవని ఇదంతా నీకు తెలివితో జరిగిందని నువ్వు ఆలోచిస్తున్నావు కదా ఇదంతా నేను చెప్పడం వల్ల జరిగింది కన్నయ్య తో మాట్లాడి విడాకులు వెనక్కి తీసుకోమని నేను చెప్తేనే తీసుకున్నాడు నువ్వు కేవలం విడాకులు పంపించడానికి కారణమని అనుమానంతోనే నీకు విడాకులు పంపించాడు నువ్వు మా కుటుంబాన్ని విడిపోయేలా చేయాలని మా కుటుంబ నాశనం కోరుకుంటున్నాం అని తెలిస్తే ఇక మా కన్నయ్య కోపానికి నిన్ను ఇంట్లోంచి పంపించడం కాదు నీ మెడ మీద తలకాయ లేకుండా చేస్తాడని అవని వార్నింగ్ ఇస్తుంది. ఇలాంటి పనులు ఇక మీద నుంచైనా బుద్ధిగా ఉండి చేయకుండా ఉంటే మంచిదని చెప్తుంది.
అటు పల్లవి ఇంటికి వచ్చి ఎలాగైనా అవని ఇంటికి రాకుండా చేయాలి ఇలా చేస్తే అవని మళ్లీ ఇంటికి వచ్చేలా చేసుకుంటుంది తను ధీమాగాంధీ నాకు ఇంట్లో ఒక సపోర్ట్ దొరికితే నేను అవి నేను శాశ్వతంగా ఇంటికి రాకుండా చేస్తానని అంటుంది. ఈ ముసలి దాన్ని అడ్డుపెట్టుకోవాలని అనుకోని అడుగుతుంది. నేను ఇంటికి పెద్దదాన్ని కానీ నా మాట ఎవరు వినరు నువ్వు నీ తోడికోడలు శ్రీయను నీ వైపు తిప్పుకో రేపు ఏదైనా తప్పు జరిగిన దానిమీద తోసేసి నువ్వు బయటపడొచ్చు అని భానుమతి సలహా ఇస్తుంది. శ్రియా రావడం చూసి పల్లవి డ్రామాలు మొదలు పెడుతుంది.. శ్రీయను బుట్టలో వేసుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి…