BigTV English

OTT Movie : మిస్టరీ గదిలో ఆత్మలు… గోస్ట్ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్… వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్

OTT Movie : మిస్టరీ గదిలో ఆత్మలు… గోస్ట్ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్… వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్

OTT Movie : హాలీవుడ్ నుంచి వచ్చే హారర్ సినిమాలు ప్రేక్షకులకు వణుకు పుట్టిస్తాయి. అటువంటి సినిమాలు బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి కూడా చాలానే వచ్చాయి. గత ఏడాది అవికా గోర్ ప్రధాన పాత్రలో వచ్చిన ఒక హారర్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను బాగానే భయపెట్టింది. గతం మరచిపోయిన హీరోయిన్, గతంలో జరిగిన మిస్టరీని ఛేదించే క్రమంలో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus hotstar) లో

ఈ బాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బ్లడీ ఇష్క్’ (Bloody Ishq). 2024 లో విడుదలైన ఈ హారర్ థ్రిల్లర్ సినిమాకు విక్రమ్ భట్ దర్శకత్వం వహించాడు. హరేకృష్ణ మీడియాటెక్, హౌస్‍ఫుల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌లపై రాకేష్ జునేజా ఈ మూవీని నిర్మించారు. ఇందులో అవికా గోర్, వర్ధన్ పూరి, జెనిఫర్ పిసినాటో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ జులై 26, 2024 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

నేహా తీవ్ర గాయాలతో సముద్రం ఒడ్డున పడి ఉంటుంది. ఆమెను కొంతమంది హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఈ విషయం తెలిసి ఆమె భర్త హాస్పిటల్ కి వస్తాడు. అయితే నేహ మాత్రం జరిగిన ప్రమాదం వల్ల గతం మర్చిపోతుంది. డాక్టర్లు రోహన్ తో గట్టిగా ప్రయత్నిస్తే గతం వచ్చే అవకాశం ఉందని చెప్తారు. ఆ తర్వాత నేహాను తీసుకుని రోహన్ స్కాట్లాండ్ కు వెళ్తాడు. అక్కడ వీళ్లు ఉండే ఇంటిని ఒక హోటల్ గా మార్చాలనుకుంటుంది నేహా. ఎందుకంటే భర్తకి, కరోనా వల్ల బిజినెస్ లో నష్టం వస్తుంది. సైడ్ బిజినెస్ గా హోటల్ ని రన్ చేయాలనుకుంటుంది. ఈ లోగానే ప్రమాదం జరుగుతుంది. అయితే ఇప్పుడు నేహా కి ఆ ఇంట్లో ఆత్మలు కనపడుతూ ఉంటాయి. ఆమె ఫ్రెండ్ అయేషా తనకి కనబడి, ఇందులో ఆత్మలు ఉన్నాయని, నీ భర్త కూడా మంచివాడు కాదని చెప్పి వెళ్ళిపోతుంది. ఇదే విషయాన్ని రోహన్ కు చెప్తే అవన్నీ పుకార్లని కొట్టి పారేస్తాడు.

అయితే ఆ ఇంట్లో అండర్ గ్రౌండ్ లో ఒక మిస్టరీ గది ఉంటుంది. అందులోకి రోహన్ ఎవరిని రానివ్వడు. అందులో ఏముందో తెలుసుకోవాలనుకుంటుంది నేహా. ఇంతలోనే ఆమెకు డార్క్ నైట్ అనే ఒక బుక్ గుర్తుకు వస్తుంది. ఆ బుక్ ని చూస్తే అందులో గోస్ట్ డిటెక్టివ్ అడ్రస్ ఉంటుంది. అతని దగ్గరికి వెళ్లి గతంలో నేను మీకు ఆత్మల గురించి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పానా అని అడుగుతుంది. అందుకు వాళ్లు అవునని సమాధానం చెప్తారు. చివరికి నేహా కి గతం గుర్తుకు వస్తుందా? ఆత్మలపై ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయమంటుంది? రోహన్ ఆ మిస్టరీ గదిని ఎందుకు రహస్యంగా ఉంచుతాడు? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

OTT Movie : 70 ఏళ్ల వృద్ధుడికి థాయ్ మసాజ్ … రష్యన్ అమ్మాయితో రంగీలా డాన్స్ …

OTT Movie : ఫ్యామిలీ కోసం అడల్ట్ సైట్‌లోకి ఎంట్రీ … CA టాపర్ కూడా అలాంటి పనులు … ఈ సిరీస్ ను ఒక్కసారి చూడటం స్టార్ట్ చేస్తే

Big Stories

×