Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మ, అమర్ ఫిజికల్ గా ఒక్కటయ్యారు అన తెలుసుకున్న మనోహరి ఏడుస్తూ తన రూంలోకి వెళ్లి చేయిని గోడకేసి కొడుతుంది. బ్లడ్ వస్తుంది. అయినా ఆగకుండా రూంలో వస్తువులన్నీ తీసి పడేస్తుంది. కోపంగా చూస్తుంది. మరోవైపు హాస్టల్‌లో సరస్వతి మేడంను చూస్తున్న రాజు ఏంటి మేడం ఇది నేను సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది. మిమ్మల్ని తప్పించాను కాబట్టి ఏం కాలేదు లేదంటే ఆ మనోహరి మిమ్మల్ని చంపేసేది అంటాడు. దీంతో సరస్వతి నేను చావుకు సిద్దపడే అక్కడికి వెళ్లాను రాజు గారు కానీ నేను అమరేంద్ర గారికి భాగీ గారికి నిజం చెప్పలేకపోయాను అంటుంది. మీరు అన్ని సార్లు ప్రయత్నించినా నిజం చెప్పలేకపోయారు అంటే ఇక సాధ్యం కాదు మేడం వదిలేయండి అంటాడు రాజు.
వదిలేస్తే ఎలా రాజుగారు వాళ్లకు నిజం తెలియాలి కదా..? ఆ రాక్షసి ఆ పిశాచి గురించి అది చేసిన దారుణాల గురించి పాపాల గురించి నేను చెప్పాలి కదా రాజు గారు అనగానే.. మిమ్మల్ని నమ్ముకుని ఇంత మంది అనాథ పిల్లలు బతుకుతున్నారు మేడం మీకు ఏదైనా అయితే ఈ ఆశ్రమం గతి ఏం కావాలి.. అంటాడు రాజు. ఈ ఆశ్రమం ఈ పిల్లలు మనము సంతోషంగా ఉన్నామంటే అందుకు కారణం ఆ కుటుంబమే రాజు గారు.. ఆ మంచి మనుషులు చేసిన సాయం వల్లే ఇక్కడ అందరం ఆనందంగా ఉన్నాము నందనవనం లాంటి ఆ ఇంట్లోకి ఒక చీడ పురుగు చేరింది. అమాయకంగా నమ్మిన అరుంధతిని పొట్టన పెట్టుకుంది.
అభం శుభం తెలియని ఆ పసిపాప ప్రాణాలు తీయాలనుకుంది. ఆ దెయ్యం అక్కడే ఉంటే ఇంకెందరిని బలి తీసుకుంటుందో నాకు ఏమైనా అయితే ఈ ఆశ్రమాన్ని చూసుకోవడానికి మీరు ఉన్నారు రాజు గారు. కానీ ఆ కుటుంబానికి ఏమైనా అయితే ఇలాంటి ఆశ్రమాలకు ఆశ్రయమే లేకుండా పోతుంది. అందుకే నా ప్రాణం పోయినా సరే వాళ్లకు నిజం చెప్తాను.. అనగానే.. సరే మేడం మీరు ఇక్కడే ఉండండి.. నేను ఆ ఇంటికి వెళ్లి అమరేంద్ర గారినో భాగీ మేడం గారినో ఇక్కడికి తీసుకొస్తాను అని చెప్తాడు రాజు. వాళ్లను ఇక్కడికి తీసుకొస్తారా..? బాగోదేమో రాజు గారు అంటుంది సరస్వతి. దీంతో మీరు బయటకు వెళితే ప్రమాదం మేడం.. అంతే కాకుండా ఈ ఆశ్రమంలో పెరిగిన ఆ మనోహరి గురించి ఆ ఒక్కరికి నిజం తెలియడం మంచిది ఒప్పుకోండి మేడం… అంటాడు. దీంతో సరే రాజు గారు జాగ్రత్త మీరు నా మనిషని ఆ మనోహరికి తెలుసు మీరు తన కంట పడకుండా జగ్రత్తగా వెళ్లి రండి అని చెప్పగానే.. రాజు వెళ్లిపోతాడు.
యముడు వచ్చి గుప్తను హెచ్చరిస్తాడు. త్వరలోనే పెను ప్రమాదం జరగబోతుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. ఏం జరగబోతుంది ప్రభూ అంటూ గుప్త అడిగినా యముడు చెప్పకుండా వెళ్లిపోతాడు. దీంతో గుప్త ప్రభువుల వారు వచ్చి హెచ్చరించారు అంటే అదేదో పెద్ద విపత్తే ఉండొచ్చు అనుకుంటూ అదేంటో తెలుసుకుందామని మంత్రం చదవగానే మాయాపేటిక వస్తుంది. మాయా పేటికలో ఏం జరుగుతుందో చెప్పమని మంత్రం వేస్తాడు. మాయాపేటిక ఓపెన్ అవుతుంది. అందులో మిస్సమ్మ కిందకు వెళ్తూ ఆరు రూం డోర్ తెరుచుకుని ఉండటం చూస్తుంది. వెంటనే డోర్ దగ్గరకు వెళ్లి చూస్తుంది. లోపల ఆరు ఫోటో కనిపిస్తుంది. లోపలికి వెళ్లి ఫోటో చూసి షాక్ అవుతుంది. ఇన్ని రోజులు తనతో మాట్లాడిన పక్కింటి అక్కే ఆరు అక్కా అని భయపడుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.