E-Paper
Advertisement

Rashid Khan: T20 క్రికెట్‌లో రషీద్ ఖాన్ సంచలన రికార్డు.. చరిత్రలోనే తొలి ప్లేయర్!

Rashid Khan: T20 క్రికెట్‌లో రషీద్ ఖాన్ సంచలన రికార్డు.. చరిత్రలోనే తొలి ప్లేయర్!
Advertisement

Rashid Khan: ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ ప్రపంచ క్రికెట్ లో చరిత్ర సృష్టించాడు. టి-20 ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న SA-20 లీగ్ లో ఎమ్.ఐ కేప్ టౌన్ జట్టుకు 26 ఏళ్ల రషీద్ ఖాన్ {Rashid Khan} ప్రతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో పార్ల్ రాయల్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రెండు వికెట్లు పడగొట్టి ఈ రికార్డ్ క్రియేట్ చేశాడు.

Also Read: Bumrah – Varun: ఇంగ్లాండ్, ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా ఔట్.. అతను వస్తున్నాడు !

Advertisement

దీంతో టి-20 ల్లో తన కెరీర్ లో అంతర్జాతీయ, లీగ్ లు మొత్తం కలిపి 633 వికెట్లు సాధించాడు. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ జట్టు తరపున 161 వికెట్లు పడగొట్టగా.. మిగిలిన 472 వికెట్లు దేశవాళి క్రికెట్ తో పాటు వివిధ లీగ్ లలో తీశాడు. ఈ క్రమంలో అతడు దిగ్గజ ఆటగాడు డ్వేన్ బ్రావో రికార్డును బ్రేక్ చేశాడు. డ్వేన్ బ్రేవో 582 మ్యాచ్ లలో 631 వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్ {Rashid Khan} కేవలం 461 మ్యాచ్ లలోనే 633 వికెట్లు పడగొట్టాడు.

ఇక క్రికెట్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, అడిలైడ్ స్ట్రైకర్స్, ససెక్స్ షార్క్స్, ట్రెంట్ రాకెట్ వంటి జట్ల తరఫున రషీద్ ఖాన్ {Rashid Khan} ఆడాడు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో సునీల్ నరైన్ 536 టి-20 ల్లో 574 వికెట్లతో రషీద్ ఖాన్ కి దగ్గరగా ఉన్నాడు. తాజాగా జనవరి నెలలో కూడా టెస్టుల్లో రషీద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. ఆరు టెస్ట్ ల తర్వాత అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ గా {Rashid Khan} రికార్డు నెలకొల్పాడు.

Advertisement

6 టెస్ట్ ల అనంతరం 45 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ స్పిన్నర్ అల్ఫ్ వాలెంటైన్, శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ఆరు టెస్ట్ ల అనంతరం 43 వికెట్లు పడగొట్టి రషీద్ ఖాన్ {Rashid Khan} తర్వాతి స్థానంలో ఉన్నారు. ఇక ఈ అఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారన్న విషయం తెలిసిందే. ఇతడికి భారతదేశంలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది.

Also Read: Shivam Dube: టీమిండియా కు లక్కీ క్రికెటర్ గా దూబే.. ఇప్పటి వరకు 30 మ్యాచ్ ల్లో గెలుపు !

ముఖ్యంగా తెలుగు క్రికెట్ అభిమానులకు ఇతడు {Rashid Khan} సుపరిచితుడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎన్నో సంవత్సరాలు ప్రాతినిథ్యం వహించిన రషీద్ ఖాన్.. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నాడు. రషీద్ ఖాన్ 461 మ్యాచ్ లలో 18.08 తో ఈ ఘనత సాధించాడు. దీంతో ప్రస్తుతం మాజీ క్రికెటర్లతోపాటు, క్రీడాభిమానులు రషీద్ ఖాన్ పై ప్రశంశాల వర్షం కురిపిస్తున్నారు. రషీద్ ఖాన్ 26 ఏళ్లకే ఈ ఫీట్ నమోదు చేయడం విశేషమని, త్వరలోనే వెయ్యి వికెట్లకు చేరుకోవడం ఖాయమని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×