Intinti Ramayanam Today Episode January 14th : నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ లాయర్ చెప్పిన దాన్ని ఇంట్లో అడుగుతాడు. రాజేంద్రప్రసాద్ మాత్రం ఎవరికి సమాధానం చెప్పుకునే అవసరం నాకు లేదు అంటూ మొండిగా కూర్చుంటాడు. పార్వతి రాగానే పార్వతిని అక్షయ్ అడుగుతాడు. అసలు ఆస్తిని సగం నా పేరు మీద ఎందుకు రాస్తారు నీకు తెలుసు కదా అమ్మ నువ్వు నాకు చెప్పాల్సిందే అని అక్షయ్ అడుగుతాడు. నాకేం తెలీదురా నన్ను అడగద్దు అని పార్వతి అంటుంది. ఆస్తి గురించి నిజం నీకు తెలుసా అని నాకు అర్థం అయిపోయింది నువ్వు నా మీద ఒట్టేసి నిజం చెప్పాల్సిందే అని అంటాడు. దానికి పార్వతి నువ్వు నా కొడుకువి కాదు. మీ నాన్నగారి మొదటి భార్య కొడుకువి అనగానే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు పల్లవి సంతోషంలో ఎగిరి గంతేస్తుంది. నేను నీ కొడుకు కాకపోవడమేంటమ్మా అని అక్షయ్ గుండెలు పగిలేలా ఏడుస్తాడు.. అవని అక్షయ దగ్గరకొచ్చి ఈ నిజాన్ని నేను జీర్ణించుకోలేక పోతున్నానండి ఇదంతా జరిగింది నా వల్లే నేను ఆస్తిని పంచడం వరకు తీసుకెళ్లడం వల్లనే ఇదంతా జరిగిందని అక్షయ్ తో అంటుంది.. ఇంట్లో అందరు బాధపడుతూ ఉంటారు. ఇక పల్లవి మాత్రం ఆస్తి మిస్ అయ్యిందని కోపంగా ఉంటుంది.. ఇంట్లో ఆస్తి విషయం గురించి తన తండ్రి చక్రవర్తికి చెప్తుంది. ఇక తాను ఒక ప్లాన్ చేస్తానని చెప్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికివస్తే.. అవని అక్షయ్ బాధని చూసి బాధపడుతుంది. ఇంట్లో ఇంత అనర్ధాలు జరగడానికి కారణం నేనే ఆస్తి విషయం తీసుకురాకుండా ఉంటే ఇదంతా తెలిసేది కాదు మీ మనసు ముక్కలయ్యేది కాదు మీరు అసలు ఇంత బాధ పడేవారు కాదు ఇదంతా నా తప్పే ని అవని అంటుంది. అసలు అత్తయ్య గారు ఇంత భయంకరమైన విజయాన్ని తన గుండెలోని దాచుకొని ఇన్నాళ్లు ఎంత సంతోషంగా ఉన్నారు. ఆమె గొప్పతనం అది అని అవని అంటుంది. అమ్మ నాకు నిజం చెప్పకుండా ఎంత ప్రేమగా చూసుకున్నారు. ఎక్కడ అనుమానం రాకుండా వాళ్ళిద్దరూ సొంత కొడుకు కన్నా ఎక్కువగానే చూసుకున్నారని అక్షయ్ అంటాడు.. ఇక ఆరాధ్య అక్షయ్ అవని మాట్లాడుకోవడం విని పార్వతి దగ్గరికి వెళుతుంది. అమ్మ నీకు మా నాన్న సొంత కొడుకు కాదా అయితే నువ్వు నాకు సొంత నానమ్మవు కాదా తాతయ్య కూడా సొంత తాతయ్య కాదా అని అడుగుతుంది. మేమిద్దరము మీకు తాతయ్య నానమ్మలమే ఎవరేమనుకున్నా ఇది తప్పదు అని రాజేంద్రప్రసాద్ అంటాడు.
అటు కమల్ భానుమతితో చెప్పి బాధపడతాడు. అన్నయ్య అమ్మకు సొంత కొడుకు కాదా ఇన్నాళ్లు ఈ నిజం తెలియదు ఇప్పటికి కూడా చెప్పకుండానే బాగుండేది. అందరం చాలా సంతోషంగా ఉండే వాళ్ళం అన్నయ్య అంతగా ఏడవటం బాధపడటం నేనెప్పుడూ చూడలేదు నానమ్మ అని బాధపడతాడు. ఈ విషయం నీకు ముందే తెలుసు కదా నానమ్మ నువ్వు ఎందుకు చెప్పలేదు. ఇప్పుడే చెప్పింటే ఇంత బాధ పడే వాళ్ళు కాదు కదా అని కమలడుగుతాడు. మీ అమ్మ సవతి తల్లి లాగా కాకుండా సొంత బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకునింది. అలాంటప్పుడు నేను ఎలా చెప్పగలను అనేసి భానుమతి కమల్ తో అంటుంది.. ఏదేమైనా గాని ఈ నిజం అమ్మ బయట పెట్టుకున్నాను అంటే బాగుండేది ఇంట్లో అందరూ అన్యాయం చూసి బాధపడుతున్నారని కమలంటాడు. పల్లవి ఇంట్లో అందరు ఏడుస్తుండడం చూసి సంతోషపడుతుంది. అందరూ ఇలాగ బాధపడటం నాకు చాలా బాగుందని పల్లవి మనసులో ఖుషి అవుతుంది. ఈ విషయాన్ని తన తండ్రితో షేర్ చేసుకుంటుంది. ఆస్తి గురించి నేను మాట్లాడుతాను నేను ఇన్వాల్వ్ అయితేనే అది ఎలా ఉంటుందో వేరేలా ఉంటుంది నువ్వేం బాధ పడుకొని పల్లవికి చెప్తాడు..
ఇక అవని పార్వతి రాజేంద్రప్రసాద్ కు కాఫీ తీసుకెళ్లి ఇస్తుంది. అక్షయ్ ఏం చేస్తున్నాడు అని అడుగుతారు. అయినా రాత్రంతా నిద్రపోలేదు మామయ్య మెలకువగానే ఉన్నారని అవని అంటుంది. ఇక పార్వతీ రాజేంద్రప్రసాద్ లు అక్షయ తో మాట్లాడాలని వస్తారు. అప్పటికే హాల్లో ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని బాధపడతారు. మీరు మా అమ్మ కడుపున పుట్టకపోయినా మా సొంత అన్నయ్య కన్నా ఎక్కువే అని అందరూ అనుకుంటారు. అక్షయ్ రాగానే అదే మాటను చెప్తారు.. ఇక పార్వతి అక్షయ తో మాట్లాడుతుంది. నువ్వు నా సొంత కొడుకు కాదని నేను చెప్పకూడదు నా కొడుకుని నువ్వు ఎక్కువే నీ పార్వతి అంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా నువ్వు మా సొంత అన్నయ్యవి అని అంటారు. అందర్నీ చూసి అక్షయ్ పొంగిపోతాడు. కానీ పార్వతిని మా తల్లి ఎలా ఉంటుంది నాకు కన్న తల్లి ఫోటో అయినా కనీసం నాకు చూపిస్తారా అని అడుగుతాడు. దానికి పార్వతీ షాక్ అవుతుంది. అంటే నేను నీ కన్నతల్లిని కాదా రాత్రికి నేను తల్లిని కాకుండా పోతున్న అని పార్వతి అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో చక్రధర్ ఆస్తి పంపకాల గురించి రాజేంద్రప్రసాద్ ని అడుగుతారు. అక్షయ్ చక్రధర్ తో గొడవపడతాడు. ఇక ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి…