Curd For Skin: ముఖ సౌందర్యం కోసం తేనెతో పాటు పెరుగు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిలోని పోషకాలు ముఖాన్ని కాంతివంతంగా మారుస్తాయి. పెరుగు, తేనె రెండూ చర్మానికి తేమను అందించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇవి చర్మాన్ని మృదువుగా మార్చడంతో పాటు మెరుసేలా చేస్తాయి. పెరుగు మీ చర్మానికి ఎక్కువ కాలం తేమను అందిస్తుంది. శీతాకాలంలో ముఖం పొడిబారకుండా కాపాడుతుంది.
పెరుగు, తేనె కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల మీ చర్మం మెరుస్తుంది.తేనె,పెరుగు పేస్ట్ మీ ముఖానికి అప్లై చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు దీన్ని చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకుని ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవచ్చు. ఇలా చేస్తే 15 నిమిషాల్లోనే మంచి ఫలితం ఉంటుంది.
పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మీ చర్మాన్ని శుభ్రపరచడంతో పాటు చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. మీరు ఈ పేస్ట్‌ను తరుచుగా ముఖానికి పాటు అప్లై చేస్తే మీ చర్మంపై గ్లో తిరిగి వస్తుంది. ముఖాన్ని మెరిసేలా చేస్తుంది.
తేనెలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది మీ చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. మీ చర్మం కూడా ఈ సమయంలో మెరుస్తుంది.
ముడతలను తొలగిస్తుంది:
పెరుగు, తేనె పేస్ట్ మీ చర్మం నుండి ముడతలను తొలగిస్తుంది. చర్మాన్ని ఒత్తిడి లేకుండా చేయడంలో సహాయపడతాయి. దీని వల్ల చర్మం మెరిసిపోతుంది. మీరు ఈ ఫేస్ మాస్క్‌ని క్రమం తప్పకుండా అప్లై చేస్తే, మీ ముఖంపై ముడతలు మాయమవుతాయి.
పెరుగు, తేనె పేస్ట్ ఎలా తయారు చేయాలి ?
– 2 టేబుల్ స్పూన్ల పెరుగు
– 1 టేబుల్ స్పూన్ తేనె
– 1 టీస్పూన్ నిమ్మరసం (ఇష్టమైతే)
Also Read: ఇలా చేస్తే.. ముఖంపై మంగు మచ్చలు పూర్తిగా మాయం
పేస్ట్ చేసే విధానం:
1. గిన్నెలో పెరుగు, తేనె వేసి కలపండి.
2. మీరు తర్వాత ఇందులోని నిమ్మరసం కలపండి.
3. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.
4. ఆ పేస్ట్‌ని మీ ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి.
5. గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.