Intinti Ramayanam Today Episode January 15th : నిన్నటి ఎపిసోడ్ లో.. అవని అక్షయ్ బాధని చూసి బాధపడుతుంది. ఇంట్లో ఇంత అనర్ధాలు జరగడానికి కారణం నేనే ఆస్తి విషయం తీసుకురాకుండా ఉంటే ఇదంతా తెలిసేది కాదు మీ మనసు ముక్కలయ్యేది కాదు . మీరు అసలు ఇంత బాధ పడేవారు కాదు ఇదంతా నా తప్పే ని అవని అంటుంది. అసలు అత్తయ్య గారు ఇంత భయంకరమైన విజయాన్ని తన గుండెలోని దాచుకొని ఇన్నాళ్లు ఎంత సంతోషంగా ఉన్నారు. ఆమె గొప్పతనం అది అని అవని అంటుంది. అమ్మ నాకు నిజం చెప్పకుండా ఎంత ప్రేమగా చూసుకున్నారు. ఎక్కడ అనుమానం రాకుండా వాళ్ళిద్దరూ సొంత కొడుకు కన్నా ఎక్కువగానే చూసుకున్నారని అక్షయ్ అంటాడు.. ఇక ఆరాధ్య అక్షయ్ అవని మాట్లాడుకోవడం విని పార్వతి దగ్గరికి వెళుతుంది. అమ్మ నీకు మా నాన్న సొంత కొడుకు కాదా అయితే నువ్వు నాకు సొంత నానమ్మవు కాదా తాతయ్య కూడా సొంత తాతయ్య కాదా అని అడుగుతుంది. మేమిద్దరము మీకు తాతయ్య నానమ్మలమే ఎవరేమనుకున్నా ఇది తప్పదు అని రాజేంద్రప్రసాద్ అంటాడు. ఇంట్లో అందరు బాధ పడతారు.. అక్షయ్ గురించి ఇన్ని రోజులు ఈ నిజం తెలియకుండా ఉన్నప్పుడే బాగుంది. అని ఆలోచిస్తారు. ఇక పార్వతి దగ్గరికి అక్షయ్ ను తీసుకుని వెళ్తారు.. అక్షయ్ మా అమ్మ ఎవరమ్మా మా అమ్మ ఫోటో అయినా చూపిస్తావని అడుగుతాడు అక్కడితో ఎప్పుడు పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఇంట్లో అందరూ ఇలాగ బాధపడటం నాకు చాలా బాగుందని పల్లవి మనసులో ఖుషి అవుతుంది. ఈ విషయాన్ని తన తండ్రితో షేర్ చేసుకుంటుంది. ఆస్తి గురించి నేను మాట్లాడుతాను నేను ఇన్వాల్వ్ అయితేనే అది ఎలా ఉంటుందో వేరేలా ఉంటుంది నువ్వేం బాధ పడుకొని పల్లవికి చెప్తాడు.. అవని పార్వతి రాజేంద్రప్రసాద్ కు కాఫీ తీసుకెళ్లి ఇస్తుంది. అక్షయ్ ఏం చేస్తున్నాడు అని అడుగుతారు. అయినా రాత్రంతా నిద్రపోలేదు మామయ్య మెలకువగానే ఉన్నారని అవని అంటుంది. ఇక పార్వతీ రాజేంద్రప్రసాద్ లు అక్షయ తో మాట్లాడాలని వస్తారు. అప్పటికే హాల్లో ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని బాధపడతారు. మీరు మా అమ్మ కడుపున పుట్టకపోయినా మా సొంత అన్నయ్య కన్నా ఎక్కువే అని అందరూ అనుకుంటారు. అక్షయ్ రాగానే అదే మాటను చెప్తారు.. ఇక పార్వతి అక్షయ తో మాట్లాడుతుంది. నువ్వు నా సొంత కొడుకు కాదని నేను చెప్పకూడదు నా కొడుకుని నువ్వు ఎక్కువే నీ పార్వతి అంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా నువ్వు మా సొంత అన్నయ్యవి అని అంటారు. అందర్నీ చూసి అక్షయ్ పొంగిపోతాడు. కానీ పార్వతిని మా తల్లి ఎలా ఉంటుంది నాకు కన్న తల్లి ఫోటో అయినా కనీసం నాకు చూపిస్తారా అని అడుగుతాడు. దానికి పార్వతీ షాక్ అవుతుంది. అంటే నేను నీ కన్నతల్లిని కాదా రాత్రికి నేను తల్లిని కాకుండా పోతున్న అని పార్వతి అడుగుతుంది.
ఇన్ని రోజులు నిన్ను కన్న తల్లి కన్న ఎక్కువగానే చూసుకున్నాను అలాంటిది ఒక్కరోజులో నీకు కన్నతల్లి గుర్తొచ్చిందా ఈ తల్లిని గుర్తుకు రాలేదా అని ఎమోషనల్ అవుతుంది. 28 ఏళ్లు నిన్ను పెంచాను కానీ అప్పుడు గుర్తుకు రాలేదు నీ తల్లి ఒక్కరోజులోనే ఈ తల్లి నీకు చేదు అయిపోయిందని పార్వతి ఎమోషనల్ అవుతుంది. చెప్పురా నీకు నీ అమ్మే కావాలా నేను నీకు అమ్మను కాదా అని ఎమోషనల్ అవ్వగానే అందరూ షాక్ అవుతారు.. పార్వతిని చూసి భయపడతారు. కోమలి వెళ్లి ఈ ఆవేశం ఏంటమ్మా పనికిరాదు. నువ్వు రా ఇలా అనేసి అంటుంది. ఇది ఆవేశం కాదు వాడి మీద నాకున్న ప్రేమ వాడు నాకు ఎక్కడ దూరం అయిపోతారు అనే బాధ నా మీద నాకు కోపం అని పార్వతి కోపంగా అరుస్తుంది.. పార్వతిని గదిలోకి తీసుకెళ్తారు.. ఇక రాజేంద్రప్రసాద్ పార్వతిని నీ కొడుకు కాదని నువ్వే చెప్పావు కదా ఇప్పుడు వాడు నా కొడుకు కాదా అని బాధపడుతున్నవ్ ఎందుకు పార్వతి అని అంటాడు. అక్షయ్ కి ఫోటో చూపించాలని రాజేంద్రప్రసాద్ వెళ్తాడు. పార్వతి ఆ ఫోటో చూపిస్తే ఈ కన్నతల్లి మొహం చూసినప్పుడల్లా అతనికి అతని కన్నతల్లి గుర్తుకు వస్తుంది అది మీకు సంతోషమేనా ఇంట్లో ఆడవాళ్ళకి ఏదైనా చెప్పి చేయడం అలవాటు చేసుకునే మగాడు ఎప్పుడైనా కుటుంబ క్షేమాన్ని కోరుకుంటాడని పార్వతి రాజేంద్ర ప్రసాద్ ని నీలదీస్తుంది. ఇక అక్షయ్ బాధపడుతుంటే రాజేంద్రప్రసాద్ అక్షయ్ దగ్గరికి వెళ్లి నువ్వు రా నాతో పాటు తీసుకుని వెళ్తాడు.
అక్షయ్ కు తన అమ్మ అనురాధ సమాధిని రాజేంద్రప్రసాద్ చూపిస్తాడు. తల్లి సమాధిని చూసి అక్షయ్ ఎమోషనల్ అవుతాడు. ఏడుస్తాడు.. ఇకమీదట నీ గుండెల్లో బాధ తగ్గేంత వరకు మీ అమ్మ సమాధి మీద పడి ఏడువు నీకు కన్నీళ్ళతో ఆ సమాధిని కడుగు అనేసి రాజేంద్రప్రసాద్ అంటాడు.. అమ్మలేని లోటుని నీకు తెలియకుండా పార్వతి నీకు అన్ని దగ్గరుండి చేసింది. పార్వతి ప్రేమను నువ్వు అనుమానిస్తున్నావ్ అవమానిస్తున్నావని రాజేంద్రప్రసాద్ అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో చక్రధర్ రాజేంద్రప్రసాద్ ని ఆస్తి గురించి అడుగుతాడు. ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..