Intinti Ramayanam Today Episode January 16th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లో అందరూ ఇలాగ బాధపడటం నాకు చాలా బాగుందని పల్లవి మనసులో ఖుషి అవుతుంది. ఈ విషయాన్ని తన తండ్రితో షేర్ చేసుకుంటుంది. ఆస్తి గురించి నేను మాట్లాడుతాను నేను ఇన్వాల్వ్ అయితేనే అది ఎలా ఉంటుందో వేరేలా ఉంటుంది నువ్వేం బాధ పడుకొని పల్లవికి చెప్తాడు.. అవని పార్వతి రాజేంద్రప్రసాద్ కు కాఫీ తీసుకెళ్లి ఇస్తుంది. అక్షయ్ ఏం చేస్తున్నాడు అని అడుగుతారు. ఆయన రాత్రంతా నిద్రపోలేదు మామయ్య మెలకువగానే ఉన్నారని అవని అంటుంది. ఇక పార్వతీ రాజేంద్రప్రసాద్ లు అక్షయ తో మాట్లాడాలని వస్తారు. అప్పటికే హాల్లో ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని బాధపడతారు. మీరు మా అమ్మ కడుపున పుట్టకపోయినా మా సొంత అన్నయ్య కన్నా ఎక్కువే అని అందరూ అనుకుంటారు. అక్షయ్ రాగానే అదే మాటను చెప్తారు.. ఇక పార్వతి అక్షయ తో మాట్లాడుతుంది. నువ్వు నా సొంత కొడుకు కాదని నేను చెప్పకూడదు నా కొడుకుని నువ్వు ఎక్కువే నీ పార్వతి అంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా నువ్వు మా సొంత అన్నయ్యవి అని అంటారు. అందర్నీ చూసి అక్షయ్ పొంగిపోతాడు. కానీ పార్వతిని మా తల్లి ఎలా ఉంటుంది నాకు కన్న తల్లి ఫోటో అయినా కనీసం నాకు చూపిస్తారా అని అడుగుతాడు. దానికి పార్వతీ షాక్ అవుతుంది. అంటే నేను నీ కన్నతల్లిని కాదా రాత్రికి నేను తల్లిని కాకుండా పోతున్న అని పార్వతి అడుగుతుంది. ఇక అక్షయ్ కు తన తల్లిని చూపించాలని రాజేంద్ర ప్రసాద్ అనుకుంటాడు. అనురాధ సమాధిని చూపిస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ కు తన అమ్మ అనురాధ సమాధిని రాజేంద్రప్రసాద్ చూపిస్తాడు. తల్లి సమాధిని చూసి అక్షయ్ ఎమోషనల్ అవుతాడు. ఏడుస్తాడు.. ఇకమీదట నీ గుండెల్లో బాధ తగ్గేంత వరకు మీ అమ్మ సమాధి మీద పడి ఏడువు నీకు కన్నీళ్ళతో ఆ సమాధిని కడుగు అనేసి రాజేంద్రప్రసాద్ అంటాడు.. అమ్మలేని లోటుని నీకు తెలియకుండా పార్వతి నీకు అన్ని దగ్గరుండి చేసింది. పార్వతి ప్రేమను నువ్వు అనుమానిస్తున్నావ్ అవమానిస్తున్నావని రాజేంద్రప్రసాద్ అంటాడు. కన్నతల్లి ప్రేమ ఎలా ఉంటుందో నీకు పార్వతి చూపించింది నిన్ను ఏ రోజు సవతి కొడుకు అని చూడలేదు ఇప్పటికే తను నీకోసం పరితపిస్తుంది నీకు పార్వతినే అమ్మ పార్వతి లోనే నీకు మీ అమ్మని చూసుకో అనేసి రాజేంద్రప్రసాద్ అక్షయ్ ని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు.. అక్షయ్ బాధపడుతూ ఇంటికి వెళ్తాడు..
ఇంటికి వెళ్లగానే చక్రధర్ ఇంటికి ఆవేశంగా వస్తాడు. ఏంటి ఏం చేస్తున్నావ్ రాజేంద్రప్రసాద్ అని గట్టిగా అరుస్తాడు. చక్రధర్ మాటలకు ఇంట్లోనే వాళ్ళందరూ బయటకు వస్తారు.. ఏమైంది మర్యాద లేకుండా అలా మాట్లాడుతున్నారని వినోద్ అడుగుతాడు. ఏదైనా కానీ ఆలోచించి మాట్లాడండి అని వినోద్ అన్న వినిపించుకోడు చక్రధర్. అసలు మర్యాద ఏంట్రా ఇచ్చేది అని చక్రధర్ రెచ్చిపోయి మాట్లాడుతారు.. రాజేంద్రప్రసాద్ అని పిలిస్తే ఇంట్లో వాళ్ళందరూ వస్తారు. అవని ఏంటి బాబాయ్ గారు ఎందుకు అంత కోపంగా అరుస్తున్నారు? ఏమైంది అని అడుగుతుంది. నువ్వు అమాయకంగా నటించి నీ మొగుడు నువ్వు కలిసి మీ మామగారు చేత ఆస్తి రాయించుకున్నారు మీకు ఏమి ఇప్పుడు బాధ లేదు కదా ఇక్కడ బాధపడేది నాకు కూతురే అని అరుస్తాడు.
మీ కూతురుకి ఏమైంది అసలు మీ కూతురుకి వచ్చిన సమస్య ఏంటి అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. ఆస్తిలో సగం నీ కొడుక్కి రాసిచ్చావ్ మిగతాది ఇంటికి నా కోడలు కనీసం తనకి ఆస్తిలో ఎటువంటి హక్కు లేదా తనకు మాట్లాడే హక్కు లేదా అని చక్రధర్ రాజేంద్రప్రసాద్ నిలదీస్తాడు. ఆస్తి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు ఇది మా ఇంటి సమస్య మా ఇంట్లో వాళ్ళు మేము పరిష్కరించుకుంటాం నీకు సంబంధం లేదని రాజేంద్రప్రసాద్ అంటాడు. నాకు సంబంధం లేదా? నా కూతుర్ని నీ ఇంటికి కోడలుగా చేసుకున్నావ్ నీ చెల్లెలు నా భార్య.. ఇంట్లో జరిగే ప్రతి విషయం తెలుసుకునే హక్కు నాకుంది అని చక్రధర్ రాజేంద్రప్రసాద్ ను అరుస్తాడు. రాజేంద్రప్రసాద్ కూడా ఏదో మాట్లాడు లేకుండా అంటే పళ్ళు రాలగొడతానని అంటాడు. దానికి నా పళ్ళు రాలగొడతావా ఏది రాలగొట్టని కాలర్ పట్టుకుంటాడు. అలా ఒకరికొకరు మాటల యుద్ధం మొదలు పెడతారు. రాజేంద్రప్రసాద్ కాలర్ పట్టుకోవడంతో అక్షయ్ చక్రధర్ కొడతాడు.. పల్లవి మా నాన్ననే నా ముందు కొడతావని అక్షయ మీద చేయి ఎత్తుతుంది. పల్లవిని కమల్ కొడతాడు.. మా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళని చక్రధారిని బయటకు పంపిస్తారు.. ఇంట్లో ఒక క్షణం పాటు పెద్ద యుద్ధమే జరుగుతుంది..
ఇంట్లో జరిగిన విషయాన్ని అవని శ్రీకర్ తో చెప్తుంది. చక్రధరత్ మా అన్న మాటలు అసలు పట్టించుకోవద్దు వదిన మీరేంటో అన్న ఏంటో మాకు తెలుసు ఆస్తి విషయం మాకు అవసరం లేదు అది నాన్న అన్నయ్య ఇద్దరు కలిసి డెవలప్ చేశారు మాకు ఇందులో సంబంధం లేదు అని శ్రీకర్ అవనికి భరోసా ఇస్తాడు. కానీ అవని మాత్రం మాకు అలాంటి ఉద్దేశం లేకపోయినా మమ్మల్ని కావాలని దోషున్ని చేశారు శ్రీకర్ అని అంటుంది.. ఇక పల్లవి బ్యాగ్ సర్దుకొని తన పుట్టింటికి వెళ్లడానికి కిందకు వస్తుంది. భానుమతి ఏమైందని అడుగుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో అక్షయ్ ని సారీ చెప్పమని పార్వతి అంటుంది.. నీ పార్వతి మధ్య మాటల యుద్ధం సాగుతుంది మరి ఏం జరుగుతుందో రేపు చూడాలి…