Jasprit Bumrah: టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా టూర్ లో వెన్నునొప్పితో చివరి టెస్ట్ మధ్యలో నుండి చికిత్స తీసుకునేందుకు వెళ్లిన బుమ్రా.. మొదట్లో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటాడని, ఆ తర్వాత జట్టులోకి వస్తాడని పలు కథనాలు వెలువడ్డాయి.
Also Read: Nitish Kumar Reddy: కోడి పందాల్లో టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్..!
ఇంగ్లాండ్ తో జరగబోయే వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభ మ్యాచ్ లకు బుమ్రా అందుబాటులో ఉండడని.. బూమ్రా కోలుకోవడానికి మరికొద్ది రోజులు సమయం పడుతుందనే వార్తలు వచ్చాయి. అతని స్థానంలో జట్టులోకి మరొక పేస్ బౌలర్ రాబోతున్నాడని కథనాలు వెలువడ్డాయి. చివరి టెస్ట్ మ్యాచ్ నుండి బయటకు వెళ్లిన బుమ్రా.. వెన్నునొప్పి కారణంగా అక్కడి వైద్య సిబ్బంది సాయంతో స్కానింగ్ కి వెళ్ళాడు. అయితే ఆ స్కానింగ్ లో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో రెండవ ఇన్నింగ్స్ కి మళ్ళీ ఆటలోకి రాలేదు.
దీంతో ఇంగ్లాండ్ తో సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరం కానున్నాడంటూ పలు వార్తలు వైరల్ అయ్యాయి. అతడు బెంగుళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కి వెళ్ళనున్నాడని.. వీపు కింది భాగంలో వాపు ఎక్కువగా ఉన్న కారణంగా ఇంగ్లాండ్ తో జరగబోయే టి20, వన్డే సిరీస్ లకి బుమ్రాని అందుకే ఎంపిక చేయలేదంటూ వచ్చిన రూమర్స్ పై తాజాగా బుమ్రా స్వయంగా స్పందించాడు.
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన గాయం పై స్పందిస్తూ.. ” అబద్ధపు వార్తలను వ్యాప్తి చేయడం చాలా సులువు. ఆ విషయం నాకు బాగా తెలుసు. కానీ ఈ వార్తలు నాకు నవ్వు తెప్పించాయి. ఈ వార్తలు అన్నీ ఫేక్” అంటూ నవ్వుతున్న ఎమోజీలను ఆ పోస్ట్ కి జత చేశాడు. దీంతో ఈ పోస్ట్ చూసిన భారత క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. “గెట్ వెల్ సూన్”.. కమ్ బ్యాక్ సూన్ బుమ్రా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ తో జరగబోయే టి20 సిరీస్ కి భారత జట్టును ఇప్పటికే ప్రకటించారు.
Also Read: Ind Women vs Ire Women: 304 పరుగుల తేడాతో టీమిండియా విజయం… సిరీస్ క్లీన్‌స్వీప్ !
కానీ ఫిబ్రవరి 6వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్న వన్డే సిరీస్ కి సంబంధించిన తుది జట్టును ఇంకా ప్రకటించలేదు. ఈ ఇంగ్లాండ్ తో జరగబోయే వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన తుది జట్టును ఒకేసారి ప్రకటిస్తారని.. దానికి కూడా మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉందని సమాచారం. బూమ్రా చేసిన ఈ ట్వీట్ నేపథ్యంలో.. అతడు తిరిగి జట్టులోకి రాబోతున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. ఇక 2024 డిసెంబర్ నెలకి గానూ బుమ్రాని “ప్లేయర్ ఆఫ్ ది మంత్” గా ప్రకటించడంపై కూడా స్పందించాడు బుమ్రా. తనని ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ప్రకటించడం థ్రిల్లింగ్ గా ఉందని.. మన ప్రదర్శనను గుర్తించడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించాడు.
I know fake news is easy to spread but this made me laugh 😂. Sources unreliable 😂 https://t.co/nEizLdES2h
— Jasprit Bumrah (@Jaspritbumrah93) January 15, 2025