Intinti Ramayanam Today Episode January 31st: నిన్నటి ఎపిసోడ్ లో.. అవినీ గుడి నుంచి బయటికి రాగానే దొంగలు ఆమె మెడలోని బంగారాన్ని తీసుకోవాలని ఆమెపై దాడి చేస్తారు. ఆ బంగారాన్ని తీసుకుంటారు.. ఇక అవని మళ్లీ దేవుడి దగ్గరికి వెళ్లి నా మంగళ సూత్రాన్ని కూడా నాకు దూరం చేసావా నా భర్తను దూరం చేశావు నేను ఎందుకు బతకాలని బాధపడుతూ ఉంటుంది. రాజేంద్రప్రసాద్ ఇంట్లో పని చేసే సీను అక్కడికి వచ్చి ఇంత రాత్రిపూట మీరు ఎక్కడంటే అక్కడ ఉండకూడదు అమ్మ మీకు ఇల్లు దొరికేంతవరకు మా ఇంట్లోనే ఉండండి అని వాళ్ళింటికి బలవంతంగా ఒప్పించి తీసుకెళ్లిపోతారు. పల్లవి హ్యాపీగా ఫీల్ అవుతుంది అందులోకే భానుమతి వచ్చి ఆ అనాధ దరిద్రం బయటికి వెళ్లింది. నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు మాత్రం ఆరాధ్యను మచ్చిక చేసుకోవాళి అప్పుడే అవని ఇంకా ఇంటికి రాకుండా ఉంటుందని సలహా ఇస్తుంది.. ఇక పల్లవి మాత్రం ఆ గుడ్ న్యూస్ ని వాళ్ళ నాన్నతో షేర్ చేసుకుంటుంది. చక్రధర్ నువ్వు నా కూతురు అని నిరూపించుకున్నావు. ఇక ఏదైనా సలహాలు కావాలంటే నిన్నే అడుగుతాను చాలా మంచి పని చేసావ్ అమ్మ అని పల్లవిని పొగడ్తలతో ముంచేస్తాడు.. పల్లవి ఆరోగ్యను బుజ్జగించాలని ప్రయత్నిస్తుంది కానీ ఆరాధ్య మాట వినదు ఇక కమలొచ్చి ఆరాధ్యుని తీసుకొని అన్నం తినిపించి పడుకోబెడతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవనిని శీను ఇంటికి తీసుకుని వెళ్తాడు. తన భార్య కనకం మాత్రం ఆమెను ఎందుకు తీసుకొచ్చారని గొడవ పెట్టుకుంటుంది. ఎంత నచ్చచెప్పినా కూడా పంకజం మినదు వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టడం ఎందుకని అవని బయటికి వెళ్తుంటే శ్రీను వచ్చి దాని విషయం పట్టించుకోకండి అమ్మ మీరు ఇక్కడే ఉండండి ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడికెళ్తారు అని బ్రతిమలాడి ఇంట్లోకి తీసుకొని వెళ్తాడు.. అవనికి వెళ్ళిన అవనికి శ్రీను తినడానికి భోజనం పెడతాడు.. అవని మాత్రం ఆరాధ్య కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అక్షయ రాత్రి అవని గురించి ఆలోచిస్తూ ఉంటాడు.. పార్వతి వచ్చే నేను ఏదైనా తప్పు చేశానని అనుకుంటున్నావా అని అడుగుతుంది. నువ్వు ఎప్పుడు తప్పు చేయవమ్మా అది నేను నమ్ముతున్నాను అని ఆలోచిస్తాడు. రాజేంద్రప్రసాద్ కూడా అవనీ లేకున్నా అంటే ఇళ్లు లాగా లేదని అవినీతి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని సలహా ఇస్తాడు. ఇక ఆరాధ్యకు పల్లవి భోజనం పెడుతుంది కానీ ఆరాధ్య భోజనం చేయదు. కమల్ బుజ్జగించి ఆరాధ్యకు భోజనం పెట్టి ఆరాధ్యను పడుకోబెడతాడు..
ఇక ఉదయం లేవగానే అక్షయ్ అవని వచ్చినట్టు కలగంటాడు. అవని ఉందని బ్రమపడతాడు తర్వాత తేరుకొని అవని లేదు కదా అని ఆలోచిస్తాడు. ఇక కమల్ పక్కన ఆరాధ్య పడుకుని ఉంటుంది ఉదయం లేవగానే ఆరాధ్య లేకుంటే లేసి చూసి వెతుకుతాడు.. ఆరాధ్య రాసిన పేపర్లను చూసి షాక్ అవుతాడు ఇక ఉదయం లేవగానే అక్షయ్ ఆరాధ్య దగ్గరకు వెళ్తాడు. ఆరాధ్య అక్కడ ఉండదు కమ్మలు అడిగితే వదిన లేకపోతే ఆరాధ్య మన మాట వినేలా లేదు అన్నయ్య అనేసి బాధపడతాడు. అందరూ కలిసి ఆరాధన వెతుకుతారు. ఆరాధ్య వాళ్ళమ్మ ఫోటోలు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. నన్ను వదిలేసి ఎందుకు వెళ్లావమ్మా నీ ఏడుస్తుంది అక్షయ్ దగ్గరకొస్తే నువ్వు నాకు నా దగ్గరికి రావద్దు నీ వల్లే అమ్మ బయటికి వెళ్లిపోయిందని బాధపడుతుంది. ఇక పార్వతీ కూడా దగ్గరకొస్తుంటే నువ్వు నా దగ్గరికి రావద్దు నానమ్మ నేను గట్టిగా అరుస్తుంది.
ఇక కమల్ ఇంట్లో అంతా చూసి షాక్ అవుతాడు. పార్వతిని పిలుస్తాడు. ఎంగిలి ప్లేట్ల అలానే ఉన్నాయి వంటగది చిందరవందరగా ఉంది ఇక్కడ టీ తాగిన కప్పులు కూడా తీయలేదు అటు దేవుడి గది కూడా చూడండి ఎంత చిందరవందరఉందో వదిన ఉంటే ఇలా ఉండేదా అన్ని ఉదయమే లేచి దీపం పెట్టి ఎంతో నీటుగా చూసుకునేది అని కమలంటాడు.. ఇప్పుడు నీకు అర్థమైందా పార్వతి ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలంటారు రాజేంద్రప్రసాద్ అంటాడు. ఇక పార్వతీ భానుమతి ఇద్దరు కలిసి పల్లవిని లేపడానికి పైకి వెళ్తారు. ఇంట్లో మగవాళ్ళందరూ లేచిన తర్వాత కూడా ఆడవాళ్లు లేకుండా ఉండకూడదు అమ్మ నువ్వు ఇంటికి కోడలు వి ఇంట్లో అన్ని పనులు చూసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది అనేసి పార్వతి అంటుంది. ఇక భానుమతి కూడా ఇప్పుడు అవన్నీ లేదు కదా అందర్నీ మెప్పించే బాధ్యత నీది ఈ ఇంటిని నీ సొంతం చేసుకోవాలంటే నువ్వు తప్పక అన్ని పనులు చేయాలని అంటుంది. అవని బాధపడుతూ ఉంటుంది. కనకం ఏమి మా ఇంట్లో నుంచి పోయేలా లేదు ఈ మధ్య అన్ని పనులు చేయించాలని నాటకం ఆడి అన్ని పనులు చేయిస్తుంది.
అక్షయ్ ఆఫీస్ కి వెళ్లడానికి బయలుదేరుతాడు. అవి నేను పిలుస్తాడు అవినీ లంచ్ బాక్స్ కావాలంటే పార్వతి వచ్చి ఎదురుగా నిలబడుతుంది. సారీ అమ్మా మర్చిపోయాను అనేసి అంటాడు. బాక్స్ ఇస్తే నేను ఆఫీస్ కి వెళ్ళిపోతాను అమ్మ అనేసి అనగానే లంచ్ ఇంకా అవ్వలేదు రా నేను డ్రైవర్ చేత పంపిస్తానులే నువ్వు వెళ్ళు అనేసి అంటుంది.. ఇక ఆరాధ్యను రెడీ చేసి నేను స్కూల్ దగ్గర వదిలిపెడతాను పదా అనేసి అంటాడు కమల్.. ఇక అవని ఆరాధ్య కోసం స్కూల్ దగ్గరికి వెళుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో స్కూల్ దగ్గర శ్రీకర్ అవనిని చూస్తాడు. అసలు నిజం చెప్పేస్తుంది అవని.. మరి శ్రీకర్ అవని కలిసి పల్లవిని బయటికి పంపించే ప్లాన్ ఇస్తారేమో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..