Sai Pallavi: కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ గా గుర్తింపు సాధించుకుంది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ వచ్చింది. ఈ సినిమా ఆడియన్స్ ని ఫిదా చేసింది. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా కూడా సాయి పల్లవికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. మళ్లీ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లవ్ స్టోరీ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం తెలుగు ఆడియోన్స్ అంతా భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల సినిమాలను చూడడం మొదలుపెట్టారు. ఈ తరుణంలో సాయి పల్లవి నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధించాయి. ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్ గా సాయి పల్లవి గుర్తింపు సాధించుకుంది.
ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న తండేల్ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గానే రిలీజ్ అయింది. ట్రైలర్ సినిమా పైన కొద్దిపాటి అంచనాలను పెంచిందనే చెప్పాలి. ఈ సినిమాలో పూర్తిస్థాయి ఉత్తరాంధ్ర యాసను మాట్లాడుతుంది సాయి పల్లవి. ఇక ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతున్న తరుణంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ జోరుగా కొనసాగిస్తుంది. ఇక ఈ సినిమా తమిళ్ ఈవెంట్ ని రీసెంట్ గా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్లో సాయి పల్లవి స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. మామూలుగా ఒక సినిమా విడుదల అయితే ఆ సినిమా టెక్నీషియన్స్ గురించి మాట్లాడటం అనేది జరుగుతుంది. సాయి పల్లవి విషయానికి వస్తే ప్రతి టెక్నీషియన్ వర్క్ ను కూడా గుర్తించి మాట్లాడటం అనేది తన ప్రత్యేకత అని చెప్పాలి.
Also Read : Deva Movie: షాహిద్ కపూర్ సినిమాకు రికార్డ్ స్థాయిలో టికెట్ ధరలు.. బాలీవుడ్‌లో కూడా ఈ పంచాయతీ తప్పదా.?
రీసెంట్ గా జరిగిన తండేల్ సినిమా ఈవెంట్ లో కూడా సినిమాటోగ్రాఫర్ విజువల్స్, దేవిశ్రీప్రసాద్ సాంగ్స్, లిరిక్ రైటర్ లిరిక్స్ గురించి ఇలా మాట్లాడుతూ వచ్చింది సాయి పల్లవి. అయితే ఇదే విషయాన్ని నాగచైతన్య కూడా తన స్పీచ్ లో ప్రస్తావిస్తూ వచ్చాడు. సాయి పల్లవి ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరి వర్క్ ని గమనిస్తూ అప్రిషియేట్ చేస్తుంది ఇలా ఉండటం అనేది రేర్ క్వాలిటీ అంటూ ప్రశంసించాడు. తండేల్ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. కొన్ని యథార్థ సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు గతంలో బన్నీ వాసు ఒక సందర్భంలో తెలిపారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకులు ముందుకు రానుంది.
Also Read : Chandoo Mondeti: ట్రెండ్ ఫాలో అవుతున్న ‘తండేల్’ డైరెక్టర్.. వారే కావాలంటూ ఎదురుచూపులు..