Uhuru Kenyatta US Foreign Aid | అమెరికా సాయం ఆపేస్తే ఎందుకు ఏడవాలి.. ప్రజలే ఒకరినొకరు సాయం చేసుకోవడం అలవర్చు కోవాలి. ట్రంప్ సాయం చేస్తారని ఎందుకు ఆశపడుతున్నారు. ఇంకా ఎంత కాలం ఆశపడతారు? విరాళాలపై సొంతకాళ్లపై నిలబడాలని అని తోటి ఆఫ్రికా దేశాలకు కెన్యా మాజీ అధ్యక్షుడు హితువు పలికారు.
‘‘అది మీ ప్రభుత్వం కాదు. మీ దేశం అంతకన్నా కాదు. మీరు అక్కడ పన్నులు కట్టడం లేదు. ఏదైనా సాయం అందించడానికి వాళ్లకు కారణాలు అక్కర్లేదు కదా. అలాంటప్పుడు ఈ ఏడుపులు దేనికి? ముమ్మాటికీ ఇది మనకు ఓ మేలుకొలుపే..’’ అని కెన్యా మాజీ అధ్యక్షుడు ఉహురు కెన్యట్టా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఫెడరల్ గ్రాంట్లు, రుణాల నిలిపివేత నిర్ణయమే ఆయన్ను ఇలా మాట్లాడటానికి కారణం.
ప్రస్తుతం అమెరికా నుంచి ప్రపంచ దేశాలకు ఆర్థిక సాయం నిలిపివేయబోతున్నట్లు ట్రంప్ ఇటీవలే ప్రకటించారు. ఈ ప్రకటనతో ప్రపంచ దేశాలు కలవరపడ్డాయి, ముఖ్యంగా ఆగ్రరాజ్యం ఇచ్చే సాయంపై ఆధారపడి జీవిస్తున్న చిన్న దేశాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ట్రంప్ అన్ని గ్రాంట్లపై సమీక్ష జరపాలని నిర్ణయించుకొని.. ఈజిప్ట్, ఇజ్రాయెల్ మిలిటరీ ఎయిడ్ మినహా ఇతర అన్ని సాయాలు ఆపేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘ఈ సాయాలు అమెరికాకు ప్రయోజనం కలిగించడం లేదు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. కానీ, ఈ నిర్ణయం వెలువడిన కాసేపటికే కోర్టులో విచారణ జరగడం వల్ల ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో కెన్యా మాజీ అధ్యక్షుడు ఉహురు కెన్యట్టా వ్యాఖ్యానిస్తూ ఒక సదస్సులో మాట్లాడుతూ.. ‘‘అమెరికా సాయం నిజంగా ప్రపంచానికి అవసరమా?’’ అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే, గత ఏడాది వివిధ దేశాలకు అమెరికా ఇచ్చిన ఆర్థిక సాయం పరిశీలనలోకి వస్తుంది. ఉదాహరణగా, ఉక్రెయిన్‌కు 16.5 బిలియన్ల డాలర్ల సాయాన్ని అమెరికా ప్రకటించి 16.2 బిలియన్ డాలర్లు పంపిణీ చేసింది. అలాగే, ఇథియోపియా, జోర్దాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సోమాలియా, యెమెన్, నైజీరియా, అఫ్గనిస్థాన్ వంటి దేశాలకు అనేక బిలియన్ డాలర్ల సాయం అందించింది. ఈ సాయం సామాజిక, ఆర్థిక రంగాల్లో ప్రధానమైన మార్పులు తెచ్చేలా ఉంది.
Also Read: అమెరికాలో వీసా ముగిసిన విద్యార్థులకు ట్రంప్ గండం.. భారత విద్యార్థులే ఎక్కువ
అయితే, ట్రంప్ ఈ సాయం విధానంలో మార్పులు కోరుకుంటున్నారు. అమెరికా ఇలాంటి సాయాలను తన ప్రత్యేక ప్రయోజనాల కోసం మాత్రమే పంపాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో విదేశాలకు, స్వచ్ఛంద సంస్థలకు చేసే ఆర్థిక సాయం ఆగిపోవడంతో విద్య, ఆరోగ్య సంరక్షణ, నిర్మాణ ప్రాజెక్టులు, విపత్తు నిర్వహణలో తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. నిష్కల్మషమైన మానవతా సాయం, ఉద్యోగాలు, అవసరమైన ఇబ్బందులు, ఆఫ్రికా దేశాలలో పౌష్టికాహార లోపం, ఆరోగ్య సమస్యలు పెద్ద ముప్పుగా మారవచ్చు.
అలాగే, వైట్‌హౌస్ వర్గాలు చెప్పిన ప్రకారం, ‘‘సామాజిక భద్రత, మెడికేర్ చెల్లింపులు, వ్యక్తులకు నేరుగా ఇచ్చే ఆర్థిక సాయం ఈ నిర్ణయానికి ప్రభావితమవుతుందా అనే విషయం రాతపూర్వకంగా చెప్పబడలేదు’’ అని పేర్కొన్నారు. అయితే, ఈ నిర్ణయం అమెరికా నుంచే కాదు, సాయం అందుకున్న దేశాలకు కూడా ఆర్థిక, సామాజిక సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలు ఉండవచ్చు.
‘‘ప్రపంచ దేశాలు, ప్రత్యేకంగా ఆఫ్రికా దేశాలు తమ సొంత వనరులతో అభివృద్ధి సాధించేందుకు ప్రయత్నించాలి’’ అని కెన్యట్టా అన్నారు. ఇంకొకరి సాయంపై ఆధారపడడం కన్నా, దేశం లోపలే ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఉత్తమని ఆయన చెప్పారు.
మానవతా సాయం విషయంలో భారత్ కూడా ప్రతిష్టాత్మకమైన పాత్ర పోషిస్తోంది. 2021-2022లో, భారత్ 2.1 బిలియన్ డాలర్ల సాయాన్ని పొరుగుదేశాలైన భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, అప్ఘనిస్థాన్‌ల అభివృద్ధికి అందజేసింది.
Hilarious. Former President of Kenya on Trump cutting off foreign aid:
“Why are you crying? It’s not your government. It’s not your country. He has no reason to give you anything. You don’t pay taxes in America. This is a wake up call for you to ask what are we going to do”. pic.twitter.com/tfjETD2qkS
— Aditya Raj Kaul (@AdityaRajKaul) January 29, 2025