Intinti Ramayanam Today Episode January 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లో వంటను బట్టే ఆడవాళ్ళు ఎలాంటివాళ్ళు వాళ్ళ మనసు ఎలాంటిదో చెప్పేయచ్చని పెద్దలంటారు అది నిజమే కదా అవని అనేసి చెంచులమ్మ ఆ వంటల్ని టేస్ట్ చేస్తుంది అని చెప్పగానే చేస్తున్నావ్ అంటే నీకు ఇంట్లో వాళ్ళ మీద గౌరవం లేదా అని చెంచులమ్మ అవన్నీ అడుగుతుంది. అదేం లేదండి నేను బాగానే చేశానే అనేసి అంటుంది. ఇక మెల్లగా మాటల్లో పెట్టి ఆస్తి అంటే నీకు మోజు ఉందా అనేసి అడుగుతుంది. కావాలంటే నీకు గౌరవం లేదా అని ఒక్కో ప్రశ్నతో నిజాలను బయట పెట్టేందుకు చెంచులమ్మ ప్రయత్నం చేస్తుంది. అవని మాట్లాడిన తీరుతో చెంచులమ్మ ఫిదా అయిపోతుంది ఇక అవన్నీ తప్పు ఉందా లేదా అని కనిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. అటు పల్లవి చెంచులమ్మకు అనుమానం రాకుండా ఉండాలని ఫోన్లు కూడా మాట్లాడకుండా ఉండాలని అనుకుంటుంది. ఇక చెంచులమ్మ పల్లవి మొత్తం చేస్తుందని తెలుసుకుంటాము. పల్లవి గురించి తెలుసుకున్న చెంచులమ్మకు నిజం చెప్పి అవని పల్లవిని సేవ్ చేస్తుంది.. చెంచులమ్మ అవని అన్నీ చూసుకుంటుంది అని చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. చెంచులమ్మ అవని మాయలో పడేసి అసలు నిజం చెప్పకుండా పోయిందని పార్వతి బాధపడుతూ ఉంటుంది. ఇక తన మనసు కుదుటపడేలా లేదని పార్వతి తన అత్తయ్యని తీసుకొని గుడికి పోతుంది. ఇంట్లో అవని చేసే ఆగడాలను ఎవరూ బయట పెట్టలేకున్నారు నేనే ఇంటి బాధ్యతను తీసుకుంటాను అవని మాయలో ఎవరు పడకుండా నా ఇంటిని నేనే కాపాడుకుంటానని దేవుడి దగ్గర మొక్కుకుంటుంది. శ్రీకర్, శ్రీయాలు ఇంటికొస్తే బాగుండని కోరుకుంటుంది. ఇక శ్రీకరు శ్రియాలు గుడికి వస్తారు. గుడికి తీసుకొస్తున్నానని ఒక మాట నాకు ముందే చెప్తే గుడికి ఏదో ఒక ప్రసాదం చేసుకొని వస్తాను కదా అనేసి శ్రియ అంటుంది కానీ నాన్నకు బాగలేదన్న విషయం తెలియగానే నా మనసులో లేదు అందుకే గుడికొద్దామని అనుకున్నాను అని శ్రీకర్ అంటాడు అంతలోకే గుడి నుంచి బయటికి అవని,భానుమతిలు వస్తారు. బయట ఉన్న తన కోడలు కొడుకుని చూసి పార్వతీ సంతోషపడుతుంది.
మీ గురించి ఇప్పుడే దేవుని కోరుకున్నాను మీరు ఇప్పుడే ప్రత్యక్షమయ్యారు ఈరోజు నేను లేచిన వేల విశేషం బాగుందని పార్వతి వాళ్ళతో అంటుంది. మావయ్య ఎప్పుడు మారాలి ఎప్పుడు అనాలి మేము ఇంకా మా ఇంట్లోనే ఉంటే అందరూ మీ అత్తింటి వాళ్ళకి మీరంటే ఇష్టం లేదేమో అని సూటిపొటి మాటలతో బాధపెడుతున్నారు అత్తయ్య అని శ్రియ పార్వతితో అంటుంది. అత్తింటి వాళ్ళు ఒప్పుకోవట్లేదని అనుకున్నాలంటే నేను నీకు ఒక నగనూ ఇస్తానమ్మా అది మా అత్తంటి వాళ్ళు ఇచ్చారని గొప్పగా చెప్పుకో అనేసి శ్రీయతో అంటుంది. కలిసి గుడికి వెళ్లి దేవుని దర్శించుకుంటారు. పల్లవి కమల్ ను ఎలాగైనా నాకు గుప్పెట్లో పెట్టుకోవాలని పల్లవి ప్లాన్ చేస్తుంది. ఇక కమల్ వచ్చే టయానికి ఏడుస్తూ నాటకాలు మొదలు పెడుతుంది.. సరదాగా మనం అక్క బావ లాగా ఉందా మానేసి అడుగుతుంది. ఒక నాటక మడుదము అనేసి అనగానే పల్లవి తన అన్న వదినల గురించి బాడ్ గా చెప్పడంతో కమల్ పల్లవి చెంప పగలగొడతాడు. భానుమతి వచ్చి నా మనవరాలు చంప ఎందుకురా పగలగొట్టావ్ అనేసి అనగానే మేమిద్దరం మొగుడు పెళ్ళాం మేమిద్దరం ఏవైనా అనుకుంటామని.
పల్లవి నిజంగానే కొట్టాను అనుకుంటున్నావు కదా ఇది కూడా నాటకమే ఈసారి ఏదైనా నాటకం ఆడేటప్పుడు నాకు ముందే చెప్పు మాములుగా ఉండదు.. దానికి పల్లవి షాక్ అవుతుంది. ఇక పార్వతి శ్రియకు ఒక నగ ఇవ్వాలని అనుకుంటుంది. భానుమతితో ఆ నగలు గురించి మాట్లాడుతుంది. వంశపారపర్యంగా వస్తున్న నగ గురించి భానుమతితో పార్వతి అంటుంది. దాన్ని అవనికి ఇవ్వలేదు పల్లవికి ఇవ్వాలని భానుమతి బలవంతంగా అంటుంది. ఇక పార్వతీ పల్లవికి ఇవ్వడానికి ఒప్పుకుంటుంది ఇదంతా విన్న అవని ఏడుస్తూ లోపలికి వెళుతుంది. అక్షయ్ రెడీ అవుతుంటే ఏడుస్తూ ఉంటుంది ఎందుకు ఏడుస్తున్నావ్ అని అవని అనగానే అత్తయ్య ఇంతకు ముందులాగా నన్ను ఏది అర్థం చేసుకోవట్లేదు అండి ప్రతిదీ అపార్థం చేసుకుంటుందని బాధపడుతుంది. నువ్వలా బిహేవ్ చేసావ్ కాబట్టి అమ్మ అలా అపార్థం చేసుకుంటుంది అంతేతప్ప ఇంకేమీ లేదు అంటాడు. కానీ ఇదంతా కాదు నువ్వు మా అమ్మ గురించి కంప్లైంట్ ఇస్తున్నావా అని అడుగుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..