Gautham Gambhir: భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ {Gautham Gambhir} గౌతమ్ గంభీర్ – రెగ్యులర్ కేప్టెన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు తలెత్తాయా..? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం వేడెక్కిందని, వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదు..? అనే అనుమానాలు స్పష్టంగా వ్యక్తం అవుతున్నాయి.
Also Read: IND VS AUS 5Th Test: జట్టు నుంచి రోహిత్ తొలగింపు..పీకల్లోతు కష్టాల్లో టీమిండియా..స్కోర్ ఎంతంటే? !
ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత ఆటగాళ్లు విఫలం అవుతున్నారు. ఈ కారణంగా ఆస్ట్రేలియా కంటే 2-1 తో వెనుకబడి ఉంది భారత జట్టు. ఈ సిరీస్ లోని చివరి టెస్ట్ సిడ్నీ వేదికగా (జనవరి 3) నేడు ఉదయం నుండి ప్రారంభమైంది. అయితే గురువారం రోజు మధ్యాహ్నం సమయంలో కోచ్ {Gautham Gambhir} గౌతమ్ గంభీర్ – పేస్ బౌలర్ బూమ్రా సిడ్నీ గ్రౌండ్ సెంటర్ పిచ్ ని పరిశీలించేందుకు వచ్చారు.
వీరు వచ్చిన కొంత సమయం తరువాత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వారి వద్దకు వచ్చాడు. అయితే ఆ సమయంలో రోహిత్ – గంభీర్ కనీసం ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు. ఆ తర్వాత ప్రోటోకాల్ ప్రకారం కెప్టెన్ రోహిత్ కాకుండా.. కోచ్ గంభీర్ {Gautham Gambhir} విలేకరులతో మాట్లాడడం జట్టులో లుకలుకలకు బలం చేకూర్చినట్లు అయింది. దీంతో నిన్నటి రోజునే చివరి టెస్ట్ లో రోహిత్ శర్మ కి చోటు కల్పించడం లేదన్న వార్తలు వెలువడ్డాయి. అనుకున్న విధంగానే చివరి టెస్ట్ లో రోహిత్ ని పక్కన పెట్టారు.
దీంతో సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ ని తప్పించడం పట్ల కోచ్ గంభీర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా “#Rip Gautam Gambhir” అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. భారత జట్టుకు గౌతమ్ గంభీర్ కోచ్ గా వచ్చిన తరువాతే జట్టుకి వరుసగా ఓటములు ఎదురవుతున్నాయని.. అసలు జట్టు నుంచి తప్పించవలసింది గంభీర్ ని అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
Also Read: Shubman Gill: రూ.450 కోట్ల స్కాం.. గిల్ తో పాటు మరో నలుగురికి CID నోటీసులు !
ఇలా కొనసాగితే భారత క్రికెట్ జట్టు పనితీరు మరింత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చాపెల్ – సౌరవ్ గంగూలీ, కొన్నేళ్ల క్రితం అనిల్ కుంబ్లే – విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు భారత క్రికెట్ లో సంచలనం సృష్టించాయి. ఇప్పుడు కోచ్ గంభీర్ – కెప్టెన్ రోహిత్ మధ్య విభేదాలు కూడా ఆ దిశగానే నడుస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ చివరి 5వ టెస్ట్ లో రోహిత్ ని జట్టులోకి ఎంపిక చేయకపోవడంతో కోచ్ గంభీర్ కి సోషల్ మీడియా వేదికగా వేలాది పోస్టులతో చుక్కలు చూపిస్తున్నారు క్రికెట్ అభిమానులు.