Intinti Ramayanam Today Episode july 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని అక్షయ్ కు అన్ని సేవలు చేస్తూ ఉంటుంది.. అయితే కాఫీ కావాలని అడిగితే లేదు మీరు ఈ పాలు తాగండి అంత సెట్ అవుతుందని అంటుంది. అక్షయ్ తన దగ్గర ఉన్న బుక్ లో పాలకు ఎంత ఖర్చు అని లెక్క వేస్తాడు. అది చూసిన రాజేంద్రప్రసాద్ వాడు ఇక్కడి నుంచి వెళ్లేలోగా నీతో కలిసి పోయేలా చేసే బాధ్యత నాది అని అంటాడు. శ్రియ పల్లవిలు భోజనం దగ్గర గొడవ పడడం చూసి పార్వతి వాళ్ళ పై సీరియస్ అవుతుంది. మీ మొగుళ్ళు ఎందుకు తాగొస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది మీరు ఇలా ఉండడం వల్లే కదా వాళ్ళు తాగొస్తున్నారు అని అంటుంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన కమల్ శ్రీకర్ ను చూసి షాక్ అవుతుంది. ఇలా తాగొస్తే మీ భార్యలు మీకు విలువిస్తారని పార్వతి ఇద్దరినీ చెంప పగలగొడుతుంది. మీరు ఎందుకు నా మాట వినడం లేదని పార్వతి అంటుంది. అక్షయ్ కి ఫుడ్ పాయిజనింగ్ అయిందని డాక్టర్ చెప్పగానే అవని కంగారు పడిపోతుంది. ఈ సెలెన్స్ పెడుతూ ఉండండి ఈరోజు అంతా పెడితే సెట్ అవుతుంది అని డాక్టర్ చెప్తాడు. ఇక అవని అక్షయ్ ని దగ్గరుండి చూసుకోవాలని అందరితో చెబుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పార్వతి అక్షయ్ అవనీ ఎక్కడ కలిసి పోతారని టెన్షన్ తో అక్షయ్ కి చాలాసార్లు ఫోన్ చేస్తుంది.. రాజేంద్రప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇష్టపడడు. నీ ఫోన్ లిఫ్ట్ చేసి వెటకారంగా పార్వతి అనే పేరును అడ్డుపెట్టుకొని మాట్లాడుతుంది. శ్రీకర్ కమల్ మాత్రం వదిన అమ్మకు బాగానే చెప్తుంది అని అనుకుంటారు. పార్వతి అన్న పేరు చెప్పి ఆడుకుంటుంది. అవని కావాలనే ఇలా చేస్తుందని పార్వతి అనుకుంటుంది. నేను మీ అత్తయ్య పార్వతిని అని చెబుతుంది. అవునా అత్తయ్య గారు నేను మీ కోడలు అవనీని మాట్లాడుతున్నాను అని అంటుంది. ఏంటి ఇలా ఫోన్ చేశారు అని అడుగుతుంది.
మా అబ్బాయి ఫోన్ ఎత్తడం లేదు ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో కనుక్కోవాలని ఫోన్ చేశారా? లేక మీరు లేరని మీ అబ్బాయి నాతో కలిసిపోయాడని తెలుసుకోవాలని అనుమానంతో ఫోన్ చేస్తారా అని పార్వతిని అడుగుతుంది అవని.. నా కొడుకు అందరిలాంటి వాడు కాదు నా మాట కాదని ఏ రోజు ఏ పని చేయడు అని పార్వతి అంటుంది. మా అబ్బాయి అత్తయ్య గారు ఎలా ఉన్నారు? మీ మావయ్య గారు కనుక్కొని చెప్తారని కాల్ చేశాను.
మేము ఆ ఇంటికి వస్తేనే మీరు మండిపోతారు. మేము ఏం చెప్పినా సరే మీరు వినరు.. అలాంటిది ఇప్పుడు ఆ ఇంటికి వెళ్లి కనుక్కోమంటే మావయ్య వింటాడని ఎలా అనుకున్నారు అని అవని అంటుంది. అవని మాటలు విన్న పార్వతి మీ మామయ్య గారికి పెళ్ళాం అవసరం లేదనుకుంటాను అందుకే ఆమె ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు అని అంటుంది. ఏవండోయ్ ఆవిడ గారు అవని ఏమన్నదో విన్నారా మళ్ళీ మాట్లాడుతున్నారు అని రాజేంద్రప్రసాద్ అంటాడు. మీరు పక్కనే ఉండి అవని చేత ఫోన్ మాట్లాడించారా ఇక ఫోన్ చేయడం దండగని పార్వతి అంటుంది.
పల్లవి అక్షయ్ ఎలా ఉన్నాడో కంగారు పడుతున్న పార్వతీ దగ్గరికి వచ్చి, అత్తయ్య బావగారు ఎలా ఉన్నారో అమ్మమ్మ ఎలా ఉందో నేను చూసేసి వస్తాను అని అంటుంది. ఇక కమల్ శ్రీకర్ అవని కి ఫోన్ చేసి నువ్వు చెప్పినట్లుగానే తాగొచ్చినట్టు నటించే వదిన అమ్మని నమ్మించాము వాళ్ళిద్దరికీ షాక్ ఇచ్చింది అని అంటారు. అత్తయ్య గారిని ఎక్కువ బాధ పెట్టకండి అని అవని అంటుంది. మీ అన్నయ్య ఎక్కడో లేడు నా దగ్గరే ఉన్నాడు అని అనగానే.. శ్రీకర్, కమల్ సంతోషపడతారు. మా అన్నయ్య నీ దగ్గరే ఉన్నాడా అయితే మా అన్నయ్యకి ఇప్పట్లో తగ్గకూడదని కోరుకుంటున్నామని అనగానే అవని తిడుతుంది.
Also Read :ప్రభావతికి కొత్త టెన్షన్.. బాలు మాటలతో కన్నీళ్లు.. కొడుకు కోసం ఆరాటం..
ఇక పల్లవి అక్షయ్ భానుమతి ఏం చేస్తున్నారో చూడాలని వస్తుంది. ఆ ఇంటికి తాళం వేయడం చూసి వీళ్ళు అవనితో కలిసిపోయారని అనుమానంతో ఆ ఇంటికి చూడాలని వస్తుంది. పల్లవి విలను చూస్తే కచ్చితంగా అత్తయ్య దగ్గర చెప్పి పెద్ద రచ్చ చేస్తుంది అని అవని ఆలోచిస్తుంది. పల్లవికి అవి నేను చూడగానే అనుమానం మొదలవుతుంది. ఇంట్లోకి వెళ్లి నేను చెక్ చేయాలని అంటుంది. అందరూ తడబడుతూ సమాధానం చెప్పడంలో పల్లవి అనుమానం మరింత బలంగా మారుతుంది. వెళ్లి ఇంట్లో రూములు చెక్ చేస్తానని అంటుంది. ప్రణతి కావాలనే పల్లవి మీద నీళ్లు పోయడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…