Illu Illalu Pillalu Today Episode july 12 th: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మద, ప్రేమ మాత్రం భాగ్యం వాళ్ళ కోసం వేట మొదలు పెడతారు. ఇద్దరూ కలిసి వెతుకుతూ ఉంటారు. తీరా దగ్గరకు వచ్చిన తర్వాత ప్రేమకు డాన్స్ క్లాస్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఇక నేను అర్జెంటు వెళ్లాలి సాయంత్రం వెతుకుదాం అని ప్రేమా నర్మద ఇద్దరు వెళ్ళిపోతారు. ఆటో కోసం చూస్తుంటే వెనకాల వచ్చిన ధీరజ్ నేను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను పద అని అంటాడు. కానీ ధీరజ్ సైకిల్ లో వెళ్తే తను డాన్స్ క్లాస్ చెప్తున్నా విషయం తెలిసిపోతుందని ప్రేమ టెన్షన్ పడుతుంది.. ధీరజ్ నుంచి తప్పించుకుని ప్రేమ బయటపడుతుంది.. కానీ ధీరజ్ మాత్రం ప్రేమపై అనుమానం రావడంతో వెనకాలే వస్తాడు.. ప్రేమ ధీరజ్ రావడం గమనించి దాక్కుంటుంది.. ధీరజ్ నుంచి తప్పించుకున్న కూడా సేనకు అడ్డంగా దొరికిపోతుంది ప్రేమ. తన మాటలు పట్టించుకోని తండ్రి రామరాజు దగ్గరికి వెళ్లి నిజం ఎక్కడ చెప్తారు అని భయపడుతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రామరాజు తిరుపతి చెప్పిన మాటల్ని సీరియస్గా తీసుకొని ధీరజ్ తెచ్చిన షర్టుని వేసుకుని బయటికి వస్తాడు. అటు ప్రేమ డాన్స్ క్లాసులు చెప్తూ సేన కంట పడుతుంది. ఏం చేస్తున్నావ్ అమ్మ అని సేన అంటాడు. ఇదంతా నిన్ను కాదు ఆ రామరాజు గాన్ని అనాలి. కోడలు సంపాదనతో పూట గడుపుకుంటున్నాడా?వాడుకుంటుంది చూడు నా చేతిలో అని సేన వెళ్ళిపోతాడు. ధీరజు వాళ్ళ నాన్న షర్టు వేసుకోలేదని బాధపడుతూ ఉంటాడు.. ఎదురుగా వాళ్ళ నాన్న షర్టు వేసుకొని కనిపించడంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు.
నాన్న నేను తెచ్చిన షర్టును వేసుకుంటాడని అస్సలు ఊహించలేదు ఇది నా జీవితంలో నేను మర్చిపోలేని రోజు. నాకు చాలా సంతోషంగా ఉంది అని వాళ్ళ నాన్నను చూసి ధీరజ్ పొంగిపోతుంటాడు. ఒక షాపు దగ్గర ఆగిన రామరాజు తన కొడుకుని చూసి ఇక్కడ ఏం చేస్తున్నావ్ రా అని పిలుస్తాడు. డ్యూటీ లేవా అని అడిగితే తిక్క తిక్కగా సమాధానం చెప్తాడు ధీరజ్. లంచ్ బ్రేక్ నాన్న అందుకే ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను అని ధీరజ్ అంటాడు. నేను ఇంటికి వెళ్తున్నాను రా వెళ్దామని ధీరజ్ ని బైక్ ఎక్కమని చెప్తాడు.
రామ రాజు నేరుగా వచ్చి బండి ఎక్కమని అడగడంతో దీర్ఘ సంతోషానికి అవధుల్లేవు.. ఎప్పుడూ మాట్లాడని నాన్న దగ్గరకు వచ్చి ఇలా ప్రేమగా పిలవడంతో ధీరజ్ ఆనందాన్ని మాటల్లో చెప్పలేరు. సైకిల్ షాప్ అతనికి ఇచ్చేసి ధీరజ్ ని వెనకాల ఎక్కమని చెప్తాడు. ధీరజు వాళ్ళ నాన్నకి ఇచ్చిన షర్టు వేసుకోవడంతో సంతోషంగా ఉంటాడు. తప్పులన్నీ మీరు క్షమించేసారని నాకు అర్థమైంది నాన్న. ఇకమీదట మిమ్మల్ని ఒప్పించాలని ఏ పని చేయను అని మనసులో అనుకుంటూ కన్నీళ్లు కారుస్తాడు.
వాళ్ల నాన్నని గట్టిగా వాటేసుకుని పట్టుకుంటాడు. కొడుకు దగ్గరగా ఉండడంతో తండ్రి కళ్ళు చెమ్మగిల్లుతాయి. తండ్రి కొడుకుల సీన్ ఎమోషనల్ గా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.. ప్రేమ ఈ సరిహద్దు రేకు దగ్గర ఎటువంటి రచ్చ జరగలేదు అంటే ప్రస్తుతానికైతే ఏం తెలియదన్న మాట అని కూల్ అవుతుంది. అలా ఇంట్లోకి వచ్చిందో లేదో వెనకాలే రామరాజు ధీరజ్ కూడా ఇంట్లోకి వస్తారు. సేన భద్రాతో పాటు మిగిలిన వాళ్ళందరూ బయటకు వచ్చి రామరాజుని పిలుస్తారు.
Also Read: పార్వతికి దిమ్మతిరిగే షాక్.. ఎంక్వైరీ వచ్చిన పల్లవి.. అక్షయ్ గురించి నిజం తెలుస్తుందా..?
కోడలు సంపాదనతో ఇల్లు కడుక్కోవాలి అని చూస్తున్నావా? కూతుర్ని ఎలా పెంచానో తెలుసా? నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు కొంచెమైనా సిగ్గుందా అని సేన రెచ్చిపోయి మాట్లాడుతాడు. రామరాజు కుటుంబ సభ్యులు అందరూ అప్పుడే ఒక్కొక్కరుగా ఇంటికి వచ్చేస్తారు. ఏమైంది ఎందుకు అరుస్తున్నావు అని అంటే.. నా కూతురు చేత జాబ్ చేస్తున్నావా అని సేన అడుగుతాడు. నేను అమ్మాయిని ఎప్పుడో జాబ్ మానేయమని చెప్పాను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎవరో చెప్పిన మాటలు విని నన్ను అంటున్నారు అని రామరాజు చెప్తాడు. ప్రేమను రామరాజు జాబ్ చేస్తున్నావా అని అడుగుతాడు.. ప్రేమ చేస్తున్నాను అని చెప్తుంది. ఆ తర్వాత మాటలు యుద్ధం జరుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..