Prakash Raj: విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్న ప్రకాష్ రాజ్ (Prakash Raj).. ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఛీ..ఛీ.. ఇంతకంటే దిగజారిపోవడం మరొకటి ఉంటుందా అంటూ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఒకవైపు బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరొకవైపు తాను సంతకం చేసిన సినిమాలను కంప్లీట్ చేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్. అంతేకాదు అప్పుడప్పుడు రాజకీయాల పరంగా పలు బహిరంగ సభలలో ఆయన చేస్తున్న కామెంట్లు విమర్శలకు దారితీస్తున్నాయి.మొన్నా మధ్య తమిళనాడు మురుగన్ మానాడు మహాసభలో చేసిన కామెంట్లకు ప్రముఖ నటుడు సత్యరాజ్ ( Sathyaraj) కౌంటర్ ఇవ్వగా.. ఇప్పుడు హిందీ భాష పై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లకు ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
హిందీభాషపై పవన్ కళ్యాణ్ కామెంట్స్..
అసలు విషయంలోకి వెళితే.. హిందీ భాష పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన రాజ్య భాషా విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకలకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అక్కడ హిందీ భాష పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..” మన మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ. హిందీ మనది కాబట్టి ఆ భాషను మనం ప్రేమిద్దాం.. ముందుకు తీసుకెళ్దాం” అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజ్..
ఇప్పుడు ఈ వీడియోని ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేస్తూ.. “ఈ range కి అమ్ముకోవడమా.. ఛీ.. ఛీ..#Just Asking” అంటూ ఘాటుగా స్పందించారు. ఇక ఇప్పుడు దీనిపై అటు జనసైనికులతో పాటు నెటిజన్స్ కూడా గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.
ప్రకాష్ రాజ్ పై జనసైనికులు మండిపాటు..
ఇకపోతే ప్రకాష్ రాజ్ ట్వీట్ కి జన సైనికులతో పాటు పలువురు నెటిజన్లు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. నువ్వన్నట్టే వ్యక్తులు నిజంగా మిగిలిన భాషలను ద్వేషించుకుంటూ పోతే.. నువ్వు ఇన్ని సినిమాలు చేసేవాడివా ? అసలు ఇంత సంపాదించే వాడివా? జాతీయస్థాయిలో ఇంత గొప్ప పేరును తెచ్చుకునేవాడివా? ఇంత జీవితం చూసే వాడివా? అంటూ కౌంటర్ ఇస్తున్నారు.
పవన్ కళ్యాణ్ మాటల వెనుక అసలు అర్థం అదేనా?
అయితే పవన్ కళ్యాణ్ మాటలు వెనుక అసలు అర్థం ఏమిటంటే.. ఇప్పుడున్న రోజులలో విద్యా, ఉద్యోగం, వ్యాపారం కోసం భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్తున్నారు. అందుకే హిందీని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదు. అలా చేస్తే భవిష్యత్తు తరాల అభివృద్ధిని అడ్డుకున్నట్లే అవుతుంది. ఇప్పటికే ఇంగ్లీష్ ను మనం సొంతం చేసుకున్నాము. అలాగే హిందీ ని కూడా మన భాషగా ఎందుకు అనుకోవడం లేదు. ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ భాష నేర్చుకుంటాము కదా.. ఇది కూడా అంతే హిందీ నేర్చుకోవాలని ఎవరిని బలవంతం చేయడం లేదు. ప్రతి భాష అవసరమే అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు.
also read:Film industry: ఇద్దరు హీరోల మధ్య ముదురుతున్న భాషా యుద్ధం.. ఖబడ్దార్ అంటూ!
ఈ range కి అమ్ముకోవడమా ….ఛి…ఛీ… #justasking https://t.co/Fv9iIU6PFj
— Prakash Raj (@prakashraaj) July 11, 2025