Gundeninda GudiGantalu Today episode july 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. రవికోసం ప్రభావతి ఎదురుచూస్తుంది. రవి పేరు వినగానే కిందకు వస్తుంది. ప్రభావతి రవి వచ్చాడా ఏడి ఎక్కడ అని వెతుకుతుంది. రవి కాదమ్మా రవి పేరుతో కొరియర్ వచ్చింది అని మనోజ్ అంటాడు. ఈ బాలు గాడి వల్లే నా కుటుంబం రెండు ముక్కలైంది అని ప్రభావతి రెచ్చిపోతుంది. మీనాని దొంగ అన్నప్పుడు నువ్వు ఇంత బాధ పడలేదే. ఇంటి కోడలి దొంగ అంటే నువ్వు ఇలా ఒప్పుకుంటావా అని బాలు అంటాడు. మొత్తానికి బాలు, ప్రభావతిల మధ్య పెద్ద వార్ జరుగుతుంది. మనోజ్ కూల్‌గా వాడు ఇక రాడేమో అమ్మా.. వాడు రావాలంటే శ్రుతి రావాలి కదా.. శ్రుతి రావాలంటే మన బాలుతో శ్రుతి వాళ్ల నాన్నకు క్షమాపణ చెప్పిస్తే సరిపోతుంది కదా.. అప్పుడు వాళ్లు రావచ్చేమో అని సలహా ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రభావతి ఖచ్చితంగా ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే అని అంటుంది. వయసు పెరిగితే సరిపోదు బుద్ధి కూడా పెరగాలి. వాడి వైపు తగ్గట్లు వాడి చేశాడా అని బాలు ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతాడు. నన్నే అంటున్నారని ప్రభావతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఒక కొడుకు ఇది ఒక కొడుకు అది అంటూ నువ్వు తేడాలు చూపించడం వల్లే వాళ్ల మధ్య ప్రేమలు లేకుండా పోయాయని క్లాస్ పీకుతాడు.. అందర్నీ సమానంగా చూస్తే ఇలాంటి బాధలు వచ్చేవి కాదు కదా వీళ్ళ మధ్యలో వీళ్ళకే గొడవలు జరిగేవి కాదు కదా అని సత్యం అంటాడు. ఏ రోజైనా కన్నతల్లిగా వాడి మీద ప్రేమ చూపించావా..? ఎంతసేపు వాడిని అక్కడికి రాకూడదు ఇక్కడికి రాకూడదు అని కండిషన్స్ పెడతావే.. కానీ వాడు నీ కొడుకు అన్న సంగతి నువ్వు ఎందుకు మర్చిపోయావు అని సత్యం అంటాడు..
రాత్రి మీనా బాలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.. నాన్న భోజనం చేశారా మీనా అని బాలు అడుగుతాడు.. ఏదో చేశాడంటే చేశాడండి ఇంట్లో అందరూ అరకొరగానే భోజనం చేశారని మీనా అంటుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కచ్చితంగా రవి శృతీలు ఇంటికి రావాల్సిందే అని అంటుంది మీనా. కాసేపు కామ్ గా ఉంటే సరిపోయేది ఈ గొడవలు ఉండేవి కాదు కదా అని బాలుతో అంటుంది. నేను రాను అంటున్న స్కూల్ పిల్లలకి సలహాలు సజెషన్లు ఇచ్చినట్లు నన్ను నువ్వు నాన్న తీసుకెళ్లారు అప్పటికి నేను చాలా ఓర్చుకున్నాను.. ఇంకా ఎక్కువ చేయడంతోనే నేను చేయి చేసుకున్నాను కావాలని నేను చేశాను అని బాలు అంటాడు.
శృతి వాళ్ళ నాన్నకు బాయ్ చెప్పేసి డబ్బింగ్ స్టూడియో కి వెళ్లాలని అనుకుంటుంది. శోభ ఇప్పుడు ఎందుకు బయటకి కొద్ది రోజులు ఇంట్లోనే ఉండొచ్చు కదా అని అంటుంది. నిన్న వెళ్లలేదు మొన్న వెళ్లలేదు ఇప్పుడు వెళ్ళకపోతే నా జాబ్ పోతుంది. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు బయటికి ఎలా వెళ్తావు అని శోభ అంటుంది. ఆ బాలు ఇంత చేసిన తర్వాత నువ్వు బయటికి వెళ్లి చేయడం అవసరమంటావా అని శోభా అనగానే శృతి కొట్టింది నాన్నను కదా ఆ జ్యూస్ ఏదో నాన్నకు ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటాడు అని అంటుంది. ఎంత చెప్పినా వినకుండా శృతి స్టూడియో కి వెళ్ళిపోతుంది. మనం ఇంట్లో కట్టడి చేసి కూర్చోబెడితే అది కచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వదిలే శోభా అని సురేందర్ అంటాడు.
శృతి డబ్బింగ్ స్టూడియోకి వెళ్లి డబ్బింగ్ చెబుతూ ఉంటుంది.. మధ్యలో సరిగ్గా రాకపోవడంతో టేకులు తీసుకుంటుంది. నాకు కొంచెం బ్రేక్ కావాలని చెప్పి మళ్లీ కాసేపు ఆగి మళ్ళీ చెప్తుంది. కాసేపు బ్రేక్ తీసుకుంటానని శృతి అనడంతో అతను ఓకే అంటాడు. నిన్ను కలవడానికి ఎవరో వచ్చారని చెప్తాడు. ఎవరైయుంటారు అని బయటకొచ్చి చూస్తే మీనా అని తెలుసుకొని శృతి మౌనంగా ఉంటుంది. ఏమైంది మీనా కన్నీళ్లు పెట్టుకుంటున్నవ్ ఎందుకు నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా అని అంటుంది శృతి..
ఏం జరిగిందో నీకు తెలిస్తే నువ్వు అలా మాట్లాడవు మా ఆయన గురించి నువ్వు ఎప్పుడూ తప్పుగా ఆలోచిస్తున్నావు అని మీనా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఏం జరిగిందో అసలు విషయాన్ని మీనా శృతి తో చెప్తుంది. నేను దొంగనా ఎవరిదైనా నిన్ను దొంగతనం చేయడం నువ్వు చూసావా అని మీనా అంటుంది. నన్ను అన్న పర్వాలేదు మావయ్య గారిని అందరినీ అనడంతో ఆయన కోపం కట్టలు తెంచుకొని కొట్టాడు. ఫంక్షన్జరిగేంతవరకు ఆయనను చూసావా..? నేను మావయ్య ఆయన ఒక గంట కనిపెట్టుకొని ఉన్నాము. మావయ్య గారిని అనడంతో ఆయన కోపం ఎక్కువైపోయి కొట్టారు అంతే తప్ప కావాలని కొట్టలేదు ఇక్కడ తప్పు మీ నాన్నది మా ఆయనది.
Also Read :రెండో పెళ్లి చేసుకున్న సీరియల్ హీరోయిన్లు ఎవరో తెలుసా..?
మధ్యలో రవి ఏం చేశాడు రవిని నువ్వెందుకు దూరం పెట్టావు అని అంటుంది. ఇంట్లో ఈ గొడవలు ఎలా ఉన్నా సరే రవి నీ భర్త. ఆ విషయం గురించిన ఆలోచించు శృతి అని మీనా చెప్పి వెళ్తుంది. బాలు రవి దగ్గరికి వెళ్తాడు. రెస్టారెంట్ కి వచ్చి ఎక్కడ కొడతాడు అని రవి లోపలికి వెళ్తాడు. బాలు మాత్రం రవి వెనకాల వెళ్లి రవితో మాట్లాడాలని ప్రయత్నం చేస్తాడు.. అయితే రవి ఫ్రెండ్ రవి ఇక్కడే ఉంటున్నాడు అన్న విషయాన్ని చెప్తాడు. నీ భార్యను తెలివిగా అక్కడ లాక్ చేశారు నువ్వు కూడా అక్కడే ఉండిపోతావు అని వాళ్ళు అనుకుంటున్నారు ఇల్లరికం అల్లుడు లాగా అక్కడే ఉంటావా నువ్వు అని బాలు రవికి క్లాస్ పీకుతాడు. అక్కడిదో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…